సాక్షి, బెంగళూరు : ఓ వ్యక్తి చనిపోగా ఆయన అంత్యక్రియలు చేయడానికి వెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో శవ యాత్రలో పాల్గొన్నవారు మృతదేహాన్ని అక్కడే వదిలి పరుగులంఘించుకున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా హొసహళ్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన సిద్ధలింగప్ప అనే వృద్ధుడు కాలం చేయగా సోమవారం ఆయన శవాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ శివారులోని శ్మశానానికి అంత్యక్రియల కోసం బయలుదేరారు. శ్మశానంలో గంధపు చెక్కలు, అగరొత్తులు అంటించడంతో ఆ పొగ ఘాటుకు అక్కడి చెట్లపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. దీంతో కంగారుపడ్డ వారు శవాన్నిఅక్కడే వదిలి తలో దిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 30 మందికిపైగా గాయపడగా వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా, కొంతమంది బంధువులు టార్పాల్, గోనె సంచుల సాయంతో ఎలాగోలా అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment