honey bees
-
బెడ్ రూంలో నుండి వింత శబ్దాలు.. కట్ చేస్తే
-
బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం! తేనెటీగలు లేకుంటే..
తేనెటీగలు.. ఇవి 3 కోట్ల సంవత్సరాల క్రితం నుంచే భూగోళంపై జీవిస్తున్నాయి. మొక్కల/వ్యవసాయ జీవవైవిధ్యానికి, పర్యావరణ వ్యవస్థల మనుగడకు పరాగ సంపర్కం కీలకం. అడవిలో 90% మొక్కలు, చెట్లకు, 75% పంటలకు తేనెటీగలు తదితర ప్రాణుల వల్ల జరిగే పరాగ సంపర్కమే ఆధారం. 115 ప్రధాన ఆహార పంటలు ప్రపంచ ప్రజల ఆకలితీర్చుతున్నాయి. వీటిలో 87 పంటలు పుష్పించి సక్రమంగా పంట దిగుబడులు ఇస్తున్నాయంటే అందుకు 35% కారణం తేనెటీగలు తదితర చిరు మిత్ర జీవులే. రసాయనిక వ్యవసాయ పద్ధతులు, చెట్లను నరికేయటం వల్ల వీటి మనుగడ ప్రమాదంలో పడింది. తేనెటీగలు వంటి మిత్ర పురుగులను రక్షించుకోవటం మన ఆహార భద్రతకు, పర్యావరణ ఆరోగ్యానికి ప్రాణావసరమని ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. మనం వినిపించుకోవాలి. ప్రతి నాలుగు పంటల్లో మూడు పంటలు తేనెటీగల సేవలు అందుకుంటున్నాయి. బాదం పంట దిగుబడులైతే నూటికి నూరు శాతం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. తేనెటీగలకు 5 కళ్లు, రెండు రెక్కలుంటాయి. కొన్నయితే గంటకు 20 మైళ్లు ప్రయాణిస్తూ పరాగ సంపర్కానికి తోడ్పడుతుంటాయి. పంటల మార్పిడి, వైవిధ్యత.. పర పరాగ సంపర్కానికి తోడ్పడే ఈ చిరుప్రాణులకు హాని కలిగించని బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించమని అంతర్జాతీయ తేనెటీగల దినోతవ్సవం (మే 20) సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. పిలుపునిచ్చింది. ‘పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని తగ్గించటం, పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు వంటి చిరు జీవులకు అవసరమైన ఆవాసాలను అంటే చెట్లను, పూల వనాలను పునరుద్ధరించటం, అభివృద్ధి చేయటం వంటి చర్యలు తీసుకోవాలని ఎఫ్.పి.ఓ. డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, రైతులు ఈ పిలుపును అందుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గిస్తే నీటిలో వీటి అవశేషాలు తగ్గుతాయి. తేనెటీగలకు మేలు జరుగుతుంది అన్నారాయన. తేనెటీగల పరిరక్షణకు స్లొవేనియా విశేష కృషి చేస్తోంది. 2016 నుంచి మే 20వ తేదీని అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుపుకోవడానికి స్లొవేనియా ప్రభుత్వ కృషే కారణం. ఖండాంతర దేశాల్లో 300కు పైగా తేనెటీగల పరిరక్షణ కార్యక్రమాల్లో స్లొవేనియా భాగస్వామైంది. ఎన్.ఐ.పి.హెచ్.ఎం. అధ్యయనం హైదరాబాద్ రాజేంద్రనగరలోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) శాస్త్రవేత్తలు తేనెటీగలు సహా అనేక మిత్ర పురుగుల వల్ల ఏయే పంటల సాగులో ఏ విధంగా ప్రయోజనం ఉంటుందనే అంశంపై అధ్యయనం చేశారు. మిత్రపురుగుల సంరక్షణతో కూడిన ‘ఎకలాజికల్ ఇంజనీరింగ్’ పద్ధతులపై జరిగిన అధ్యయనానికి అదనపు సంచాలకులు(పిహెచ్‌ఎం) డాక్టర్ ఈడ్పుగంటి శ్రీలత సారధ్యం వహించారు. పొద్దుతిరుగుడు, జనుము, మొక్కజొన్న, స్వీట్‌కార్న్, వంగ, బెండ, గుమ్మడి, సొర, బీర, చెర్రీ తదితర పంటలపై ఈ అధ్యయనం జరిగింది. గట్ల మీద పూల మొక్కలు సాగు చేశారు. 9 జాతులకు చెందిన 14 రకాల ఈగలు ఈ కూరగాయ తోటల్లో పరాగసంపర్కానికి దోహదపడినట్లు గుర్తించారు. అందులో 5 రకాల తేనెటీగలు ఉన్నాయి. వంగ తోటలో 14 రకాల ఈగలు కనిపించటం విశేషం. ఎకలాజికల్ ఇంజనీరింగ్ అంటే? ‘ఎకలాజికల్ ఇంజనీరింగ్’ భావనను 1962లో తొలుత ప్రతిపాదించిన శాస్త్రవేత్త డా. హొవర్డ్ టి. ఒడుమ్. రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతుల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని గుర్తించి, పంట పొలాల్లో పర్యావరణ వ్యవస్థలను పునరుజ్జీవింపజేయటం. తద్వారా మొక్కలు, భూమి ఆరోగ్యాన్ని కాపాడటం. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటం ఈ భావన ముఖ్య లక్ష్యం. భూమిని బాగు చేయడానికి ఆచ్ఛాదన పంటలు, పంటల మార్పిడి, పచ్చిరొట్ట పంటలను సాగు చేసి కలియదున్నటం, సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు, జీవ రసాయనాలు వినియోగించటం ఎకలాజికల్ ఇంజనీరింగ్‌లో ముఖ్యమైన అంశాలు. మిత్రపురుగులను ఆకర్షించడానికి ఆకర్షక పంటలు, శతృపురుగులను ఆకర్షించి మట్టుబెట్టడానికి ఎర పంటలు, శతృపురుగులను పారదోలడానికి వికర్షక పంటలు, పురుగులు తోటలోకి రాకుండా చూడడానికి కంచె/సరిహద్దు పంటలు వేసుకోవటం చీడపీడల నియంత్రణలో కీలకం. ‘పంటల తొలి 40 రోజుల్లో రసాయనిక పురుగుమందులు వాడకుండా ఉండటం ముఖ్యం. ఈ దశలోనే తేనెటీగలు సహా అనేక రకాల మిత్రపురుగులు వృద్ధి చెంది పంటకాలం అంతటా చీడపీడలను నియంత్రణలో ఉంచుతాయి. .’ అంటున్నారు డా. శ్రీలత. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం పెరుగుతున్న కొద్దీ సహజ తేనెటీగల సంఖ్య తగ్గిపోతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. బెంగళూరు ప్రాంతంలో జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. నగరం చుట్టూతా విస్తరించిన 40 కిలోమీటర్ల ప్రాంతంలోని 60 గ్రామాల్లో అధ్యయనం చేస్తే సహజ తేనెటీగల సంఖ్య ఏకంగా 20% తగ్గినట్లు వెల్లడైంది. జర్మనీకి చెందిన గొట్టింజెన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. రసాయనిక వ్యవసాయం విస్తీర్ణం, సాంద్రత పెరుగుతున్నకొద్దీ తేనెటీగలు సమూహాలు తగ్గిపోతుండటాన్ని గుర్తించారు. నగరం నుంచి ప్రతి కిలోమీటరు దూరంగా వెళ్లే కొద్దీ ఆయా ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 2.4% మేరకు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఠీ 2016 డిసెంబర్– మే 2017 మధ్య 1275 కుటుంబాలపై అధ్యయనం చేశారు. ఇందులో 638 రైతు కుటుంబాలు. 3 కుటుంబాలకు చెందిన 31 జాతుల తేనెటీగలు ఆ ప్రాంతాల్లో గుర్తించారు. చెట్ల మీదనే కాకుండా నేలలో బొరియలు చేసుకొని ఆవాసాలను ఏర్పాటు చేసుకునే తేనెటీగలు ఉంటాయి. కాబట్టి, రసాయనిక పురుగుమందుల వల్లనే కాకుండా రసాయనిక ఎరువులు లేదా నీటి పారుదల వల్ల కూడా తేనెటీగల సంఖ్య తగ్గుతున్నట్లు గుర్తించారు. ఒక రైతు తన పొలంలో రసాయనిక ఎరువులు వాడటం లేదా నీటి తడి పెట్టడం చేస్తే అక్కడ తేనెటీగల సంఖ్య 20% తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. పరిసరాల్లోని ఒక్కో పొలంలో పురుగుమందులు చల్లినప్పుడల్లా ఒక్కోశాతం తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. అత్యధికంగా 80% మంది రైతులు, సగటున 25% మంది రైతులు రసాయనిక పురుగుమందులు చల్లుతున్నారు. ఆ మేరకు తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. అనేక సంవత్సరాల నుంచి ఉధృతంగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో తేనెటీగలు 8.1% మేరకు తగ్గింది. రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేనెటీగల సంఖ్య 17.3% తగ్గిపోయింది. అదేవిధంగా, దగ్గర్లో అడవి లేదా చెరువు ఉన్న చోట్ల 30–39% పెరిగింది. వ్యవసాయంలో విషరసాయనాలు, ముఖ్యంగా నియోనికోటినాయిడ్స్, వాడుతుండటం వల్ల తేనెటీగల నాడీవ్యవస్థ దెబ్బతింటున్నది. ఈ ప్రభావం వల్ల తేనె సేకరణకు వెళ్లిన తేనెటీగలు, ఇంకా ఇతర మిత్ర పురుగులు తిరిగి గూళ్లకు చేరకుండానే నేలరాలుతున్నట్లు పరిశోధకులు గుర్తించారంటున్నారు తేనెటీగల సంరక్షకురాలు బీవీ అపూర్వ. -
ప్రమాదంలో తేనెటీగలు.. మానవాళి మనుగడకే ముప్పు!
సాక్షి, అమరావతి: తేనెటీగలు.. సృష్టిలోనే ఓ గొప్ప సహజసిద్ధ ఇంజనీర్లు. షడ్భుజాలతో ఆరు వేల గదుల ఇళ్లను పక్కపక్కనే నిరి్మంచుకోగల సామర్థ్యం వీటి సొంతం. సమైక్య జీవనానికి ప్రతీకలైన మధుమక్షికలు వేలాది కిలోమీటర్ల మేర ప్రయాణించి.. పూలలోని మకరందాన్ని సేకరించుకొస్తాయి. వీటి నిరంతర శ్రమ వల్లే భూలోకంలోని చెట్లు, మొక్కలు మనగలుగుతున్నాయి. ఎన్నో పంటలు వీటివల్లే పండుతున్నాయి. ఈ చిరు ప్రాణులు జీవకోటికి చేస్తున్న మేలు ఎంతంటే.. తేనెటీగలు మొత్తం అంతరించిపోతే కేవలం 30 రోజుల్లో భూమండలంపై ప్రాణికోటి కూడా అంతరించిపోతుంది. అంతటి విశిష్టత గల తేనెటీగలకు మానవాళి వల్ల పెద్ద కష్టమే వచి్చపడింది. 180 రకాల తేనెటీగల జాతులు అత్యంత ప్రమాదంలో చిక్కుకున్నాయని ఐక్యరాజ్య సమితి తేల్చింది. వీటిని సంరక్షించేందుకు రంగంలోకి దిగింది. భూమండలాన్ని పచ్చగా ఉంచేందుకు మట్టి, నీరు, సూర్యరశ్మి ఎంత అవసరమో తేనెటీగలు (మధుమక్షికలు) కూడా అంతే అవసరం. నేలపై ఉన్న వృక్ష జాతులతోపాటు 90 శాతానికి పైగా పంటలు తేనెటీగల వల్లే అభివృద్ధి చెందుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మానవాళి జీవితం మొత్తం ఇతర జీవులతో ముడిపడి ఉంది. వాటిలో అత్యంత ముఖ్యమైన ప్రాణి తేనెటీగ. ప్రకృతికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పూల మకరందంపై ఆధారపడి జీవించే తేనెటీగలు పంటలపై మితిమీరి వినియోగిస్తున్న పురుగు మందులు, కాలుష్యం కారణంగా మరణిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం తేనెటీగల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని దేశాలను కోరుతోందంటే వీటి అవసరం ప్రపంచానికి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తేనెటీగలు జీవ వైవిధ్యంలో భాగం. మానవ మనుగడ అంతా వాటిపైనే ఆధారపడి ఉంది. పంటలు సకాలంలో పండడంలో కీలకమైన పరపరాగ సంపర్కానికి అత్యంత వేగవంతమైన వాçßæకాలుగా ఇవి సేవలు అందిస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే, ప్రజలకు అత్యంత నాణ్యమైన ఆహారమైన తేనె, రాయల్ జెల్లీ, మైనం వంటి వాటిని అందించడంతో పాటు తేనెటీగల విషాన్ని సేకరించి ఇతర ఉత్పత్తులకు వినియోగిస్తున్నారు. పురుగు మందుల వాడకంతో.. పంటల రక్షణ కోసం పురుగు మందులను మితిమీరి వినియోగిస్తుండటంతో తేనెటీగల జాతి తగ్గిపోతోందని జీవవైవిధ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేకపోతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల జాతులు అంతరించిపోతున్నట్టు యూకే అగ్రికల్చరల్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ దేశంలో గత పదేళ్లలో 13 జాతులు అంతరించిపోగా.. మరో 35 జాతులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించింది. అందుకు పంటలకు వాడుతున్న నికోటినాయిడ్స్ కారణమని వెల్లడించింది. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 18 జాతులు పూర్తిగా కనుమరుగైపోయాయని, మరో 180 జాతులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ క్యూరేట్ (ఐయూసీఎన్) ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన తేనెటీగల సంతతిని పెంచకపోతే సమీప భవిష్యత్‌లో ప్రపంచం ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. రక్షణకు తక్షణ చర్యలు అవసరం మొక్కలు, పూల పరాగ సంపర్కానికి తేనెటీగల అవసరాన్ని గుర్తించిన యూరోపియన్ యూనియన్ 2018 మేలో నియోనికోటినాయిడ్స్ అని పిలిచే మూడు రకాల పురుగుమందులపై నిషేధాన్ని విధించింది. అయితే, అంతకు ముందే 2011లో స్లోవేనియా దేశం తేనెటీగలకు హానికరమైన చాలా పురుగు మందులను నిషేధించిన తొలి దేశంగా గుర్తింపు పొందింది. కాగా, 2019 చైనాలోని కుని్మంగ్లో జరిగిన ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (కాప్–15)లో 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులు తగ్గించాలని నిర్ణయించింది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల కొరతను తగ్గించాలంటే తేనెటీగల సంఖ్య పెరగాలని.. ఆ ప్రాణులు బతకాలంటే రసాయన పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే పరిష్కారమని ఆ సదస్సులో ప్రతినిధులు పేర్కొన్నారు. తేనెటీగల ఆవాసాలను రక్షించడానికి, ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజాన్ని చైతన్యం చేసి ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం నిర్వహించాలని ప్రకటించింది. మూడో వంతు ఆహారోత్పత్తి వీటివల్లే.. ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టం సరీ్వస్ (ఐపీబీఈఎస్) పేర్కొంటున్న ప్రకారం దాదాపు 80 మిలియన్ల సంవత్సరాలుగా తేనెటీగల ప్రపంచంలో అత్యంత పరాగ సంపర్కం చేసి నేరుగా ఆహార భద్రతకు దోహదం చేస్తున్నాయి. ఏటా 1.77 మిలియన్ మెట్రిక్ టన్నుల తేనెను మనకు అందిస్తున్నాయి. ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో మూడోవంతు తేనెటీగల పైనే ఆధారపడి ఉందని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించిందంటే వీటి ప్రాధాన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు, పక్షులు, కొన్ని జంతువులు, కీటకాలు పరాగ సంపర్కానికి, మొక్కల పునరుత్పత్తికి దోహదం చేస్తున్నా.. అత్యంత సాధారణ పరాగ సంపర్కాలలో తేనెటీగలు ముందున్నాయి. చదవండి: ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? -
తేనెటీగలే కాదు.. చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయని తెలుసా?
తేనె అనగానే మనకు గుర్తొచ్చేది తేనెటీగలే. అవి వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అందులోనూ కొన్నిరకాలే ఈ పనిచేస్తాయి. మరి వీటికి పూర్తి భిన్నంగా ఉండే ఒక రకం చీమలు కూడా తేనెను ఉత్పత్తి చేస్తాయి తెలుసా?.. ఈ చీమల తేనె, దాని సేకరణ, నిల్వ విధానం చాలా చిత్రంగా ఉంటుంది కూడా.. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. కరువులో వాడుకొనేందుకు.. సాధారణంగా చాలా రకాల జీవులు ఎప్పుడైనా ఆహారం దొరకని పరిస్థితుల్లో వాడుకొనేందుకు వీలుగా నిల్వ చేసుకుంటూ ఉంటాయి. అది అవి మామూలుగా తినే ఆహారమే అయి ఉంటుంది. కానీ ఆ్రస్టేలియా, అమెరికా, మెక్సికోతోపాటు పలు ఆఫ్రికా దేశాల్లోని ఎడారి భూముల్లో ఉండే ఒక రకం చీమలు ఏకంగా తేనెను నిల్వ చేసుకుంటాయి. అది కూడా చిత్రమైన పద్ధతిలో కావడం విశేషం. ఇవి కాంపోనోటస్ ఇన్ఫ్లాటస్ జాతికి చెందినవి. సింపుల్‌గా హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. శరీరంలోనే ‘తేనె’నిల్వ ► సాధారణంగా తేనెటీగలు తమ నోటిద్వారా పూల నుంచి మకరందాన్ని సేకరించి.. దానిని ప్రత్యేకమైన పట్టుల్లో నిల్వచేస్తాయి. కానీ ఈ చీమలు తేనెను నిల్వ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లేమీ ఉండవు. వాటి శరీరంలోనే తేనెను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని హనీపాట్ చీమలు అని పిలుస్తుంటారు. ► సాధారణంగా చీమల కాలనీల్లో వేర్వేరు విధులను వేర్వేరు చీమలు నిర్వహిస్తుంటాయి. ఇలా వర్కర్ చీమలు పూల నుంచి మకరందాన్ని సేకరించుకుని వచి్చ.. పుట్టలోనే ఉండే హనీపాట్ చీమల నోటికి అందిస్తాయి. హనీపాట్ చీమలు దానిని తేనెగా మార్చి తమ కడుపులో నిల్వ చేస్తాయి. ► ఈ నిల్వ ఏ స్థాయిలో ఉంటుందంటే.. హనీపాట్ చీమల కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా తేనెను నింపుకొంటాయి. ఆ బరువుతో కదలలేక.. పుట్టలో గోడలను పట్టుకుని చాలా రోజులు అలాగే ఉండిపోతాయి. ► పుట్టలోని చీమలకు ఆహారం కొరత తలెత్తినప్పుడు.. ఈ హనీపాట్ చీమల కడుపు నుంచి తేనెను బయటికి తీసి తినేస్తాయి. ఒక్కోసారి ఇతర పుట్టల చీమలు.. హనీపాట్ చీమలున్న పుట్టపై దాడిచేసి తేనెను ఎత్తుకుపోతుంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ చీమలు.. బహుమతులు సాధారణ తేనెతో పోలిస్తే ఈ చీమల తేనె తీపిదనం తక్కువని, కాస్త పుల్లటి రుచి కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చీమల తేనెలో గ్లూకోజ్ చక్కెర శాతం ఎక్కువని.. అదే తేనెటీగల తేనెలో ఫ్రక్టోజ్ రకం చక్కెర అధికమని వివరించారు. ఆ్రస్టేలియాలో స్థానిక తెగల ప్రజలు తేనెచీమలను సేకరించి బహుమతిగా ఇచ్చి పుచ్చుకుంటారట కూడా. చదవండి: మనసు మాట వినే చక్రాల కుర్చీ! -
కోనసీమ జిల్లా: అంకంపాలెంలో మహిళలపై తేనెటీగల దాడి
-
లక్షల్లో తేనెటీగలను చంపేస్తున్నారు.. ఎందుకంటే?
ఆస్ట్రేలియా అధికారులు గత రెండు వారాల్లో కొన్ని లక్షల తేనెటీగలను చంపేశారు. వాటిని పెంచే కాలనీలను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో లాక్డౌన్ విధించి ఒక్క తేనెటీగను కూడా బయటకు పోకుండా, బయటి నుంచి ఇతర తేనెటీగలు లోనికి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవడాని ఎంతో బలమైన కారణమే ఉంది. వరోవా మైట్ అనే పరాన్నజీవి తేనెటీగలపై దాడి చేస్తోంది. ఈ పురుగులకు తేనెటీగలే ఆహారం. అంతేకాదు వరోవామైట్ దాడి చేసిన తేనెటీగలకు ప్లేగువ్యాధి వాపిస్తుంది. ఇది ఒకదాని నుంచి మరోదానికి సంక్రమిస్తుంది. ఫలితంగా ఆస్ట్రేలియాలో తేనెటీగలు మొత్తం ఈ వ్యాధి బారినపడి చనిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రూ.వందల కోట్ల వాణిజ్యం జరిగే ఆస్ట్రేలియా తేనె పరిశ్రమ కుదేలవుతుంది. భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే ప్రభుత్వం వరోవా మైట్‌ను నివారించేందుకు అది సంచరించిన తేనెటీగల కాలనీలను అంతం చేస్తోంది. దీనివల్ల ఇతర ప్రాంతాలకు ప్రాణాంతక వరోవామైట్ వ్యాపించే ముప్పు తప్పుతుంది. వరోవామైట్ అనే పరుగు ఎరుపు గోదుమ రంగులో నువ్వు గింజ పరిమాణంలో ఉంటుంది. ఈ పరాన్నజీవులకు తేనెటీగలే ఆహారం, ఆధారం. సిడ్నీ సమీపంలోని ఓడరేవు వద్ద గతవారం వీటిని గుర్తించారు. ఈ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఆ ప్రాంతంలోని తేనెటీగల కాలనీల్లో లాక్డౌన్ విధించింది. వరోవా వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించిన అతికొద్ది దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. 2016, 2019, 2020 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా వీటి ముప్పును అదిగమించింది. అయితే ఈసారి మళ్లీ వచ్చిన వరోవా పురుగులు ఇక్కడే తిష్ట వేసేలా ఉన్నాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10 చోట్ల దీని ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. దబ్బో నగరానికి 378కిలోమీటర్ల దూరంలోనూ వరోవా ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వరోవా వ్యాపించిన తేనెతెట్టెలను గుర్తించడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేయలేకపోతే రూ. వందల కోట్ల నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో మొత్తం తేనెటీగల పరిశ్రమకే ముప్పు వస్తుందనే కారణంతో తేనెటీగలను చంపేస్తున్నారు. -
తేనె సేకరిస్తున్నప్పడు ఆ తాడును బావమరిది మాత్రమే పట్టుకోవాలి!
సాక్షి, అచ్చంపేట (మహబూబ్‌నగర్): అడవి బిడ్డలు సేకరించే తేనె అంటే ఎంతో స్వచ్ఛమైనది. ఎలాంటి కల్తీ లేని తేనె పట్టు వారి వద్ద లభిస్తుంది. తరతరాలుగా వారు తేనె సేకరణ కులవత్తిగా సాగుతోంది. ప్రకతి దేవతలకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి తేనె సేకరణకు బయలుదేరే చెంచులు.. చెట్లపైకి ఎక్కే దగ్గరి నుంచి తేనె సేకరణ పూర్తి చేసే వరకు ఓ ప్రత్యేకమైన ఆచారాన్ని నేటికీ అవలంబిస్తున్నారు. తమ ఆచారాన్ని కొనసాగిస్తూనే పుష్కరకాలంగా శాస్త్రీయ పద్ధతుల్లో సైతం తేనెను సేకరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచులు అధికంగా ఉన్న నల్లమలలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ మాసంలో మాత్రమే తేనె సేకరణ చేస్తారు. సీజన్ల వారీగా అడవి బిడ్డలు తేమ సేకరణ విధానం, అందుకోసం ఉపయోగించే పద్ధతులు.. తదితర వాటిపై సండే స్పెషల్.. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) తేనె సేకరణ కోసం చెట్టు ఎక్కేందుకు సిద్ధమైన చెంచు వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో చెంచు కుటుంబాలకు తేనె ముఖ్య జీవనాధారం. సీజన్లను బట్టి వివిధ రకాల తేనె సేకరణ చేస్తుంటారు. తొలకరి వర్షాకాలంలో దేవదారి పూతతో వచ్చే తేనె శ్రేష్టమైనది. మామిడి పూతతో వచ్చే తేనె చాలా మధురంగా, వామ తోటల మకరందాన్ని సేకరించిన సమయంలో వచ్చే తేనె కొంత ఘాటుగా ఉంటుంది. పొద్దుతిరుగుడు, కందిపూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. తాటి పూతతో వచ్చే తేనె కొంత అరుదుగా దొరుకుతుంది. చెంచులకు తేనె సేకరణలో అవగాహన పెంపొందించే దిశగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పదేళ్లుగా కోనేరు స్వచ్ఛంద సంస్థ అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో చాలామంది చెంచులకు శాస్త్రీయ పద్ధతుల్లో తేనె సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. తేనె సేకరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారికి అవసరమైన కిట్లను అందజేస్తున్నారు. చెంచులు చూడడానికి నీరసంగా ఉన్నప్పటికీ తేనె సేకరణ సమయంలో కొండలు, చెట్లు సునాయసంగా ఎక్కగలుగుతారు. (చదవండి: రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం) వేప చెట్టు కొమ్మపై పొదిగి ఉన్న పెద్ద తేనె తుట్ట తుట్టె నుంచి తేనెను వేరు చేయడం తుట్టెగా ఉన్న తేనె గడ్డలను పలుచని తెల్ల వస్త్రంలో వేసి జల్లెడలాంటి ఓ ప్రత్యేక పాత్రలో పిండుతారు. తర్వాత వాటిని సీసాలు, డబ్బాల్లో నింపి గిరిజన సహకార సంస్థలో విక్రయించి, వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చేతులతో పిండి తేనెను తుట్ట నుంచి వేరు చేస్తారు. ఇది చూడడానికి అంతగా బాగో లేనప్పటికీ, తేనెతో పాటు వచ్చే మైనం ఆరోగ్యానికి మంచే చేస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో తెనే సేకరిస్తున్న చెంచులు శాస్త్రీయ పద్ధతిలో సేకరణ తేనెటీగలు నశించిపోకుండా చూడటంతో పాటు ఒకే తేనె తుట్ట నుంచి 5–6 సార్లు తేనె సేకరించే విధానాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయవచ్చు. 12 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెంచులతో మమేకమై, వారికి శిక్షణ ఇచ్చి ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆయా స్వచ్ఛంద సంస్థలు అందజేసిన కిట్లు ప్రతి గ్రామం, పెంట, గూడెంలలో చెంచులకు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీజన్ల వారీగా తేనె సేకరిస్తున్నారు. తేనె సేకరణకు సంబంధించి కిట్టులో బలమైన రెండు తాళ్లు, ఎలిమెంట్, గ్లౌజెస్ బూట్లు, తెల్లనిప్యాంట్, షార్టు, బకెట్, కత్తి ఉంటాయి. (చదవండి: ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది) తుట్టలో తేనె ఉన్న భాగం తేనె సేకరణ ఇలా.. తేనె సేకరణకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ప్రకతి, వన దేవతలను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం తేనె తుట్ట కింది భాగంలో ఆకులు, పుల్లలతో దట్టమైన పొగ పెట్టేవారు. దీంతో తేనె టీగలు ఊపిరాడక కొన్ని చనిపోవడంతో పాటూ మరికొన్ని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాయి. ఆ తర్వాత తేనెను సునాయసంగా తీస్తారు. కొండభాగంలో ప్రత్యేక ఆచారం.. కొండభాగంలో ఉన్న తేనె సేకరించే సమయంలో చెంచులు ఆచారం ప్రకారం కొండపై నుంచి జాలువారే తాడును బావమరిదిని మాత్రమే పట్టుకొనిస్తారు. తాడు సహాయంతో తేనె తుట్టె వద్దకు వెళ్లే సమయంలో ఓ ప్రత్యేకమైన శబ్ధం చేస్తూ వెంట తెచ్చుకున్న సుడేకు మంటపెట్టి, ఆ పొగతో తేనెటీగలను తేనె పట్టుకు దూరం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న శిబ్బెంలో (పల్లెం) తేనె ఉన్న భాగాన్ని వేసుకుని కింద ఉన్న వారికి చేరవేస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు.. తేనె సేకరణలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడం లేదు. రోజురోజుకీ నశించి పోతున్న తేనెటీగలు పెంపకానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. జీసీసీలో కొనుగోలు చేసే ధర కంటే బయటి వ్యక్తులకు అమ్మకుంటే అధిక డబ్బలు వస్తున్నాయి. కల్తీ లేని తేనెను సేకరిస్తున్నాం. అందుకే మంచి డిమాండ్ ఉంటుంది. చాలా మంది తేనె కోసమే మా చెంచుపెంటలకు వస్తున్నారు. – చిగుర్లపెద్ద లింగయ్య, రాంపూర్ పెంట ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా(ఇన్సూరెన్స్) సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన క్లిట్లు కూడా పాడైనవి. కొత్త వాటిని ఇవ్వలేదు. ప్రస్తుత సీజన్లో తేనె ఎక్కవ సేకరణ జరుపుతాం. అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది – బయన్న, మల్లాపూర్ చెంచుపెంట -
వైరల్ వీడియో: ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
-
ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
గాంధీనగర్: ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు...ఆ బలానికి ఉండే శక్తి ఎలాంటిదంటే పెను తుపానునైనా ఎదిరించి నిలవగలదు. టౌటే తుపాను సాక్షిగా మరోసారి ఈ సత్యం సాక్షాత్కరించింది. మే 18న గంటకు 140 కిలోమీటర్ల వేగంతో టౌటే తుపాను గుజరాత్లో తీరం దాటింది. ఆ సమయంలో భారీ సైజు నిర్మాణాలే చిగురుటాకుల వణికి పోయాయి. అరేబియా సముద్రంలో నౌకలు కొట్టుకుపోయాయి. కానీ గుజరాత్‌లోన గదదలో ఇంటి బీమ్‌కి వేలాడుతున్నతేనేటీగలు ఆ తుపాను ఎదిరించాయి. పరిమాణంలో చిన్నవైన తేనేటీగలు ఒకదాన్నొకటి గట్టిగా పట్టుకుని ప్రచండ గాలులును కాచుకున్నాయి. ఐకమత్యం స్ఫూర్తిని నిలిపాయి. -
ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..!
వాషింగ్టన్ : మమూలుగా మనమందరం తేనె కావాలంటే కిరాణ షాపుకో, సూపర్ మార్కెటుకో పోయి తీసుకుంటాం. కానీ నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నించమంటే అంతే సంగతులు..! సింపుల్‌గా మన షేప్ మారిపోయి ఆసుపత్రిలో తేలుతాం. నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నిస్తే తేనెటీగలు ఎదురుదాడికి పాల్పడతాయి. అందుకే జనం తేనె తుట్టెల జోలికి పోవాలంటే చచ్చేంత భయపడుతుంటారు. మహిళలైతే మరీను.. టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ అనే మహిళ మాత్రం అలా కాదు. తేనెటీగల పెంపకం దారి అయినా ఈమె తేనె తుట్టెను పద్ధతిగా ఏ భయం లేకుండా చేతులతో తీస్తుంది. కొద్దిరోజుల క్రితం టెక్సాస్‌లోని ఓ ఇంటిలో రెండు సంవత్సరాలుగా దాగి ఉన్న తేనె తుట్టెను చేత్తో తీసివేసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఎరికా ఎలాంటి సేఫ్టీ లేకుండా తేనెటీగలను తుట్టెనుంచి వేరు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 1.5 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన వారు ఔరా..! అంటున్నారు. అంతేకాకుండా మహిళను వండర్‌వుమన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. -
పొట్టపై 10 వేల తేనెటీగల గూడుతో..
టెక్సాస్: ప్రస్తుత కాలంలో మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న జంట బేజీ షవర్, మెటర్నిటీ ఫొటోషూట్ వంటి కార్యక్రమాలకు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం కోసం అందమైన, ఆకర్షించే ప్రదేశాలను ఎంచుకోవడం లేదా వారి ఫొటోషూట్ భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ను మరింత ప్రత్యేకంగా ఉంచేందుకు అత్యంత సాహసమైన ఆలోచన చేసింది. తన పొట్టపై ఏకంగా 10 వేల తేనెటీగల గూడును పెట్టుకుని ఫొటోషూట్‌కు ఫోజ్లిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆమె పేరు బేథానీ కరులక్. ఆమె ముందునుంచే ఇలాంటి సాహసాల్లో నిపుణురాలు. (వైరల్ : నల్ల చిరుతను చూశారా?) బేథానీ ఇటీవల తీసుకున్న తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘ఇది ప్రమాదకరమైనది. దయచేసి అనుభవం లేకుండా ఎవరూ ప్రయత్నించకండి’ అనే క్యాప్షన్‌తో ఆమె పోస్టు చేసింది. ‘ఫొటోషూట్ మొత్తంలో ఆ తేనెటీగల నన్ను ఒక్కసారి కూడా కుట్టలేదు. మొదట రాణీ తేనెటీగను నా పొట్టపై బంధించాము. ఆ తర్వాత మిగతా తేనెటీగలను ఉంచడంతో కాసేపట్లలో అవి గూడు కట్టాయి. ఇక్కడ దాదాపు 10 వేలకు పైగా తేనెటీగల ఉన్నాయి. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని డాక్టర్ సలహాతోనే ప్రయత్నించాం’ అంటూ బేథాని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సాహసానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తూంటే మరికొందరూ ‘అసలు ఎందుకిలా చేయడం’, ‘తేనెటీగలకు బదులుగా సీతాకోక చిలుకలను ప్రయత్నించచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం) -
అందంలో.. మకరందం
వలిసె పూలు.. పసుపు పచ్చగా కనుచూపు మేర పరచినట్లుండే ప్రకృతి పరిచిన ఈ పూదోటల్ని చూసేందుకు విశాఖ మన్యానికి శీతాకాలం పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఏ యూరోప్‌లోనో ఉన్నట్లు అనిపించేలా మన మనసు దోచే ఈ పూలు పిల్లగాలులకు అటూ ఇటూ ఊగుతూ స్వాగతం పలుకుతుంటాయి. ఈ వలిసె పూలు తమ అందంతోనే కాదు మకరందంతోను పర్యాటకుల జిహ్వను వహ్వా అనిపిస్తున్నాయి. అర విరిసిన ఈ పూల మకరందాన్ని జుర్రుకుని తేనెటీగలు అందించే తేనెకు విశాఖ మన్యంలో పర్యాటకుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ఔషధ గుణాలతో పాటు మంచి సువాసన, రుచి ఉండడంతో వలిసె సాగు లాభదాయకంగా మారింది. – సాక్షి, విశాఖపట్నం ఇథియోపియా నుంచి విశాఖ మన్యానికి చూసేందుకు అవి పొద్దుతిరుగుడు పూలుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందల ఏళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయి. ఇక్కడి అనుకూల వాతావరణంతో కొన్నేళ్ల క్రితం వరకూ ఎక్కడ చూసినా వీటి అందాలే కనువిందు చేశాయి. అరుకువ్యాలీ, పాడేరు ప్రాంతాల్లోనే 20 వేల ఎకరాల్లో ఈ వలిసె పూలు ఉండేవి. ఇప్పుడు 10 వేల ఎకరాలకు సాగు పడిపోయింది. ఈ పూలతోటల్లో అక్కడక్కడా నీలం రంగుల పెట్టెలు కనిపిస్తుంటాయి. తేనె సేకరించేందుకు పెట్టినవే అవి. శీతాకాలం రెండు నెలలు ఇక్కడ ఇదొక కుటీర పరిశ్రమ. గిరిజనులే గాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తేనె వ్యాపారులు ఈ కాలంలో ఇక్కడికి వస్తుంటారు. వలిసె పూలలో మకరందం ఆస్వాదించే తేనెటీగల్ని ఈ పెట్టెల్లోకి ఆకర్షించేందుకు తయారీదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ తేనెలో మినరల్స్, విటమిన్లు.. సాధారణంగా తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఈ వలిసె పూల తేనెలో ఎంజైమ్‌లు, మినరల్స్, విటమిన్లు, అమినో ఆమ్లాలు ఉంటాయి. ఈ తేనెను గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో కలిపి తాగితే పొట్ట తగ్గడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుందని అంటున్నారు. తేనెటీగలు పరిసర ప్రాంతాల్లోని పూల నుంచే తెచ్చే మకరందం బట్టి వాసన, రంగు మారుతుంటుంది. తేనె కిలో రూ.350 నుంచి రూ.450 వరకూ ఉంటుంది. ఈ పూల నుంచి వచ్చే విత్తనాల్ని గిరిజనులు పప్పు చేసి నూనె తీస్తారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలో వినియోగిస్తారు. ఎకరాకు వంద కిలోల వరకూ విత్తనాలు వేస్తే ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ వలిపో గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటంతో ఇటీవల కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ వాడుతున్నారు. వలిసిపూల తోటలో తేనె ఉత్పత్తిదారుడు వెంకటశివరావు పర్యాటకులే కొనుగోలుదారులు మన్యంలో నీలగిరి చెట్లు, కాఫీ తోటల సాగు విస్తీర్ణం ఎక్కువ. సాధారణ రోజుల్లో వీటి పూల నుంచి తెచ్చే మకరందంతోనే తేనెటీగలు పట్టు పెడతాయి. శీతాకాలంలో మాత్రం వలిసె పూలు వస్తాయి. నీలగిరి, కాఫీ పూల కన్నా వలిసె పూల మకరందంతో అధికంగా తేనె దిగుబడి వస్తుంది. ఈ పరిశ్రమ మాకు లాభసాటిగా ఉంది. – వెంకటశివరావు, తేనె ఉత్పత్తిదారుడు, కురిడి, డుంబ్రిగూడ మండలం వారాంతంలో ఎక్కువ గిరాకీ ఈ సీజన్లో అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది వలిసె పూల తేనె కొంటారు. శని, ఆదివారాల్లో ఐదారు వేల రూపాయల తేనె అమ్ముతాం. మేము ఉత్పత్తి చేసే తేనె పర్యాటకులే ఎక్కువగా కొంటారు. – సుహాసిని, తేనె ఉత్పత్తిదారురాలు, చాపరాయి, డుంబ్రిగూడమండలం ఒక పెట్టె నుంచి 35–40 కిలోల తేనె సేకరణ ప్రస్తుతం సుమారు 250 ఎకరాల్లోని వలిసె పూల తోటల్లో తేనెపట్టు పెట్టెలు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో పూల సాంద్రతను బట్టి వంద వరకూ పెట్టెలు పెడతారు. ఒక్కో పెట్టెలో లక్ష వరకూ ఆడ తేనెటీగలు, వంద మగ తేనెటీగలు, రాణి తేనెటీగ ఉంటాయి. ఈ ఒక్కో పెట్టె నుంచి వారానికి మూడు నుంచి నాలుగు కిలోల తేనె ఉత్పత్తి అవుతుంది. సీజన్లో పెట్టెకు 35 నుంచి 40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని అరకు నుంచి పాడేరు వెళ్లే రోడ్డు మార్గంలో వలిసె పూల తోటల్లో మనకి చాలాచోట్ల తేనె ఉత్పత్తి పరిశ్రమలు కనిపిస్తుంటాయి. అరకు–కిరండూల్ రైల్వే మార్గంలోనూ మనకు దర్శనమిస్తుంటాయి. -
తేనెటీగలు అంతరిస్తే..?
ఊరకే రొదపెడుతూ తిరిగే తేనెటీగలను చూస్తే చాలామంది చిరాకుపడతారు. ఒక్కోసారి అవి మనుషులను కుడుతుంటాయి కూడా. తేనెటీగలు కుట్టిన చోట దద్దుర్లు ఏర్పడి విపరీతంగా మంట పుడుతుంది. అందువల్ల తేనెటీగలను చూస్తే చాలామంది భయపడతారు కూడా. ఎప్పుడైనా ఒక చెంచాడు తేనె రుచి చూస్తే మాత్రం తేనెటీగల మీద చిరాకు, భయం, కోపం వంటివన్నీ ఆ క్షణానికి మాయమవుతాయి. తేనెలోని ఔషధ గుణాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రం తేనెటీగల మీద కృతజ్ఞతా భావం కూడా ఏర్పడుతుంది. తేనెటీగలు నిరంతరం శ్రమించి పొందికగా అల్లుకున్న గూళ్లలో భద్రపరచిన తేనెను మనుషులు వారి అవసరాల కోసం కొల్లగొడుతున్నారు. తేనెటీగల శ్రమను దోచుకుంటున్న మనుషులు వాటి పట్ల రవ్వంతైనా కృతజ్ఞత చూపుతున్నారా అంటే, లేదనే సమాధానం చెప్పాలి. అజ్ఞానంతో, అహంకారంతో, నిర్లక్ష్య ధోరణితో మనుషులు కన్నూ మిన్నూ కానకుండా తేనెటీగలకు ముప్పు తెచ్చిపెడుతున్నారు. ఇష్టానుసారం పంటలపై పురుగుమందులు చల్లుతూ తేనెటీగలు భూమ్మీద మనుగడ కొనసాగించలేని దారుణమైన పరిస్థితులను కల్పిస్తున్నారు. ఆఫ్టరాల్ తేనెటీగలు... అవి ఈ భూమ్మీద ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనే ధోరణిలో మనుషులు తమ పద్ధతులను ఏమాత్రం మార్చుకోవడం లేదు. ఎడాపెడా వాడుతున్న పురుగుమందుల కారణంగా అరుదైన కొన్నిజాతుల తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ‘హవాయిన్ యెల్లో ఫేస్డ్ బీస్’ రకానికి చెందిన ఏడు ఉపజాతుల తేనెటీగలు, ‘రస్టీ ప్యాచ్డ్ బంబ్లీ బీ’ జాతికి చెందిన తేనెటీగలు ప్రమాదం అంచులకు చేరుకున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతోందని ‘గ్రీన్‌పీస్’ సంస్థ ‘బీస్ ఇన్ డిక్లైన్’ అనే పుసక్తం ద్వారా దశాబ్దం కిందటే ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులేవీ రాలేదు సరికదా, తేనెటీగలు మరింతగా ప్రమాదానికి చేరువవుతున్నాయి. తేనెటీగలు చేసే పని గూళ్లు కట్టుకుని, తేనెను సేకరించడం మాత్రమే కాదు. చాలా పంటలు ఎదగడానికి కూడా అవి ఇతోధికంగా దోహదపడతాయి. మనుషులు ఆహారంగా ఉపయోగించే చాలా పంటల్లో– కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 35 శాతం ఆహార పంటల్లో పరపరాగ సంపర్కం జరగడానికి ఇవి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. తేనెటీగల శ్రమను పట్టించుకోని మనుషులు, వాటికి ముప్పు కలిగిస్తూ, తమ ముప్పును తామే కొని తెచ్చుకుంటున్నారు. రెండో ప్రపంచయుద్ధ కాలం నుంచే వ్యవసాయం కోసం పురుగుమందులు వాడటం మొదలైంది. పురుగు మందుల వాడకం పెరుగుతున్న కొద్దీ తేనెటీగల సంఖ్య తగ్గిపోతూ వస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే, అవి అంతరించిన మరో నాలుగేళ్లకు ఈ భూమ్మీది మనుషులు కూడా అంతరించిపోతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తేనెటీగలను కాపాడుకోకుంటే మానవాళి సొంత ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వారు చెబుతున్నారు. -
పాక్‌ను విడిచివెళ్తున్న తేనెటీగలు!
పెషావర్: పాకిస్తాన్ ఉగ్రవాదుల కేంద్రంగా మారుతోందని భారత్‌తోసహా అగ్రరాజ్యాలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రపంచానికి ఉగ్రవాదులను సరఫరా చేస్తున్న దేశంగా కూడా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రకార్యాకలాపాలను విడనాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. పాక్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు తరచూ సైనిక ఆపరేషన్లు జరుగుతుంటాయి. దీంతో ఆ దేశం నిత్యం బాంబుల మోతతో మార్మోగిపోతుంది. ఈ తుపాకులు, బాంబుల మోతలు ఆ దేశంలో మనుషులేకాదు.. కనీసం తేనెటీగలకు కూడా నిలువ నీడ లేకుండా చేస్తున్నాయట. తుపాకులు, బాంబుల మోతలు పెరగడంతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిందని, అందుకే తేనెటీగలు పాక్‌ను విడిచి వెళ్లిపోయాయని పాక్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. ఇప్పటికే రెండు జాతుల తేనెటీగలు తమ ప్రాంతంలో కనుమరుగయ్యాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు లేకపోతే ఏమవుతుంది? తేనె లేనంత మాత్రాన బతకలేరా.. అనే అనుమానం కలగొచ్చు. భూమిపై తేనేటీగలు అంతరించిన నాలుగు సంవత్సరాల్లో మనిషి అంతరిస్తాడని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. తేనెటీగలు కేవలం మకరందం కోసమే కాదని.. పుష్పాలు ఫలదీరకణం చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. తేనెటీగలు లేకపోతే పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందన్నది శాస్త్రవేత్తల ఆందోళన చెందుతున్నారు. -
పరి పరిశోధన
వేడిమిలో తేడా.. విద్యుత్తు పుట్టిస్తుంది! పగలు ఎండతో వేడిగా ఉంటుంది... రాత్రయితే చల్లగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ ఉష్ణోగ్రత తేడాలతో కరెంటు పుట్టించడం.. దాంతోనే చిన్న చిన్న సెన్సర్లు, పరికరాలను నడిపించడం సాధ్యమని అంటున్నారు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు. అనడమే కాదు.. ఒక పరికరాన్ని తయారు చేసి నెలలపాటు విద్యుత్తు ఉత్పత్తి చేశారు కూడా. ఉష్ణోగ్రతల్లో తేడాలను విద్యుత్తుగా మార్చడం కొత్తేమీ కాదు. సముద్రాల్లో ఉపరితలంపై ఉండే వేడి నీటిని.. లోపలుండే చల్లటి నీటి సాయంతో చాలాచోట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. అయితే ఎంఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పరికరానికి ఒకే సమయంలో రెండు వేర్వేరు ఉష్ణోగ్రతల అవసరం లేదన్నమాట. రాత్రిపగళ్ల మధ్య ఉండే వ్యత్యాసాన్ని సమర్థంగా వాడుకోగలదు. థెర్మల్ రెసొనేటర్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరాన్ని రిమోట్ సెన్సింగ్ రంగంలో విస్తృతంగా వాడుకోవచ్చునని.. సోలార్‌ప్యానెల్స్, బ్యాటరీలు వంటివేవీ లేకుండా ఏళ్లపాటు సెన్సర్లతో సమాచారం సేకరించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణాన్ని త్వరగా గ్రహించడం, లేదా పరిసరాలలోకి విడుదల చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉన్న పదార్థాన్ని వాడటం ద్వారా ఈ థెర్మల్ రెసొనేటర్ పనిచేస్తుంది. ఈ రెండు లక్షణాలున్న పదార్థాలను తెలివిగా పేర్చడం ద్వారా థెర్మల్ రెసొనేటర్ పగటి ఉష్ణోగ్రతలను గ్రహించి తనలోనే నిక్షిప్తం చేసుకుంటుంది. రాత్రి సమయపు చల్లదనాన్ని ఇతర పదార్థాలు శోషించుకుంటాయి. రెండింటి మధ్య ఉన్న తేడాతో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వీటిని సోలార్ ప్యానెల్స్ అడుగున ఉంచితే ప్యానెల్స్ వెలువరించే వేడిని తీసేయడంతోపాటు విద్యుత్తునూ ఉత్పత్తి చేస్తాయని.. తద్వారా రెండింతల లాభం వస్తుందని అంటున్నారు. తేనెటీగల వైవిధ్యతతో మనిషికి మేలు! భూమ్మీద తేనెటీగలు అంతరించిపోయిన కొంత కాలానికే మనిషీ కనుమరుగవుతాడని ఐన్‌స్టీన్ అంతటి శాస్త్రవేత్త ఎప్పుడో చెప్పాడు. తాజాగా రట్గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేసి.. ఒకే రకమైనవి కాకుండా బోలెడంత వైవిధ్యతతో కూడిన తేనెటీగలు ఉండటం మనిషికి చాలారకాలుగా మేలు చేస్తుందని తేల్చారు. పెన్సెల్వేనియా ప్రాంతంలో తాము దాదాపు వంద రకాల తేనెటీగలను గుర్తించి, సేకరించడంతోపాటు 48 తోటల్లో పరీక్షలు కూడా జరిపామని విన్ఫ్రీ అనే శాస్త్రవేత్త తెలిపారు. తేనెటీగల వైవిధ్యత ఎంత పెరిగితే.. ఫలదీకరణం కూడా అంతే స్థాయిలో ఎక్కువైనట్లు తమ పరిశీలనల్లో తేలిందన్నారు. పర్యావరణ వ్యవస్థ చురుకుగా పనిచేయాలంటే.. తద్వారా మనిషికి మేలు జరగాలంటే తేనెటీగల వైవిధ్యత ఎంత ముఖ్యమన్నది తమ అధ్యయనం చెబుతోందని ఆయన అన్నారు. రైతులు రహదారులకు రెండు వైపులా.. లేదంటే పొలాల గట్ల వెంబడి తేనెటీగలు మనగలిగేలా పూల మొక్కలు ఎక్కువగా నాటడం ద్వారా కీటకనాశినుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని, తద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని విన్ఫ్రీ తన గత పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టం చేశారు. -
అధికారులపై తేనెటీగల దాడి
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ జిల్లాలోని ఘటన సారంగాపూర్‌లో శుక్రవారం జరిగింది. స్వర్ణ ప్రాజెక్టు వద్ద తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో అధికారులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్టు నుంచి రబీకి నీళ్లు ఇచ్చేందుకు వచ్చినపుడు ఈ ఘటన జరిగింది. -
తేనెటీగల దాడి: శవాన్ని వదిలి పరుగో పరుగు!
సాక్షి, బెంగళూరు : ఓ వ్యక్తి చనిపోగా ఆయన అంత్యక్రియలు చేయడానికి వెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో శవ యాత్రలో పాల్గొన్నవారు మృతదేహాన్ని అక్కడే వదిలి పరుగులంఘించుకున్నారు. కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడి తాలూకా హొసహళ్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధలింగప్ప అనే వృద్ధుడు కాలం చేయగా సోమవారం ఆయన శవాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామ శివారులోని శ్మశానానికి అంత్యక్రియల కోసం బయలుదేరారు. శ్మశానంలో గంధపు చెక్కలు, అగరొత్తులు అంటించడంతో ఆ పొగ ఘాటుకు అక్కడి చెట్లపై ఉన్న తేనేటీగలు ఒక్కసారిగా అక్కడున్న వారిపై దాడి చేశాయి. దీంతో కంగారుపడ్డ వారు శవాన్నిఅక్కడే వదిలి తలో దిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 30 మందికిపైగా గాయపడగా వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా, కొంతమంది బంధువులు టార్పాల్, గోనె సంచుల సాయంతో ఎలాగోలా అంత్యక్రియలు పూర్తిచేశారు. -
భక్తులపై తేనెటీగల దాడి
- పది మందికి గాయాలు జమాలయ్యదర్గా(మహానంది): జమాలయ్య దర్గా వద్ద తేనెటీగల దాడిలో పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం జరిగింది. నంద్యాలకు చెందిన సుమారు 20 మందికిపైగా భక్తులు జమాలయ్యదర్గా వద్ద స్వామివారికి పూజలు చేసేందుకు వచ్చారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని వంటలు చేసుకునేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్లుండి తేనేటీగలు వారిపై దాడి చేయడంతో చిన్నారులతో కలిపి సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం అక్కడే ఉన్న తిమ్మాపురం గ్రామానికి చెందిన యువకులు వేణు, సయ్యద్, తదితరులు వారికి సేవలందించారు. ఇదిలా ఉండగా గత గురువారం సైతం తేనెటీగలు దాడి చేయడంతో ఐదుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. -
ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు..
దాదాపు 20 వేల తేనెటీగలు ఈ పాటేసుకుని ఫాలో అయిపోతుంటే... వేల్స్‌లోని హేవర్ఫోర్డ్వెస్ట్కు చెందిన ఓ కారు యజమాని హడలిపోయాడు. ఒకట్రెండు గంటలు కాదు.. రెండు రోజులపాటు అవి అతడి కారును అంటిపెట్టుకుని ఫాలో అయిపోయాయి. ఇద్దరు ముగ్గురు తేనెటీగల నిపుణులు వచ్చి.. వాటిని తీసి వేసినా.. మళ్లీ అవి అక్కడికే వచ్చి చేరడం మొదలుపెట్టాయి. ఇంతకీ జరిగిన విషయమేమిటంటే.. వాళ్ల రాణి తేనెటీగ ఆ వాహనం డిక్కీ భాగంలో ఇరుక్కుపోయింది. దీంతో రాణితో పాటే మేమూ అంటూ ఆ తేనెటీగలు వాహనాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయాయి. రెండ్రోజుల అనంతరం రాణి తేనెటీగ ఎలాగోలా బయటపడింది. దీంతో మిగిలిన తేనెటీగలు వాహనాన్ని వదిలేసి.. రాణిని ఫాలో అయిపోయాయి. -
తేనెటీగల దాడిలో భర్త మృతి: భార్యకు గాయాలు
సీలేరు (విశాఖ జిల్లా) : తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా సీలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుప్పలవాడ గ్రామం గొందివీధికి చెందిన భార్యాభర్తలు కొర్ర ధను(50), కొర్ర కుంద్రి(46)లపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో తీవ్రగాయాలపాలైన భర్త ధను కాసేపటికే మృతిచెందాడు. భార్య కుంద్రిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
మేడిపల్లి (కరీంనగర్) : గుడికి వెళ్లిన ఓ కుటుంబంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా వారిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం భీమారం ఎల్లమ్మ గుడి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. గుడికి వెళ్లిన కుటుంబసభ్యులు తేనెటీగల దాడిలో గాయపడ్డారు. వారిలో నారాయణ అనే వృద్ధుడు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
తేనెటీగల దాడిలో వృద్దుడుకి గాయాలు
-
తేనెటీగల దాడిలో మహిళలకు గాయాలు
బయ్యారం: నాగుల చవితి సందర్భంగా పూజలు నిర్వహించుకుంటున్న మహిళలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గందంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళలు పూజలు చేసుకునేందుకు గ్రామ శివారులోని పుట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ చెట్టుకు ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో.. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. -
వృద్ధదంపతులపై తేనెటీగల దాడి
నల్గొండ (భువనగిరి) : భువనగిరి మండలం ఎర్రంపెల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తేనెటీగలు ఓ వృద్ధదంపతులపై దాడిచేశాయి. రోడ్డుపక్కనున్న చెట్టు కింద సేదతీరుతున్న సమయంలో కోతులు అక్కడికి చేరుకున్నాయి. కోతులు చెట్టెక్కి తేనెతుట్టెను కదిలించడంతో తేనెటీగలు వృద్ధదంపతులపై పడ్డాయి. మీదపడ్డ తేనెటీగలు బాగా కుట్టడంతో దంపతుల ముఖమంతా వాచిపోయింది. గాయపడిన దంపతులు మైతిరెడ్డి(65), అండమ్మ(60)లను స్థానికులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వగ్రామం వలిగొండ మండలం ఏడుమెట్ల. వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. -
ఈద్గాలో తేనెటీగల దాడి.. 40 మందికి గాయాలు
నెన్నెల: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఈద్గాలో ప్రార్థనల సందర్భంగా ముస్లింలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 మందికి గాయాలు కాగా, వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బక్రీద్ సందర్భంగా సుమారు 150 మంది ముస్లింలు ఈద్గా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడున్న మర్రిచెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. గాయపడ్డ వారిలో ఇబ్రహీం, మోహిన్, డప్పులు వాయించాడనికి వచ్చిన లింగంపల్లి శంకర్ అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడగా..వారిని 108 వాహనంలో బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగల దాడి
వైఎస్సార్ జిల్లా(వేంపల్లె): అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై తేనెటీగలు దాడిచేసిన ఘటన ఆదివారం రాత్రి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో చోటుచేసుకుంది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆట స్థలంలో ఆడుకునేందుకు వచ్చారు. వీరందరూ కలిసి పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీసుకోవాలనుకున్నారు. 15 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రదేశం నుంచి దాదాపు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న శేషాచలం అడవుల్లోకి వెళ్లారు. అడవిలో వీరికి కనిపించిన తేనె తుట్టెను సెల్‌ఫోన్‌తో ఫొటో తీస్తుండగా ప్లాష్ వెలుతురుకు తేనెటీగలు (పెద్ద ఈగలు) ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. దీంతో విద్యార్థులు చెల్లాచెదురుగా విడిపోయి పరుగులు తీశారు. వీరిలో 14 మంది ట్రిపుల్ ఐటీకి చేరుకోగా గంగాధర నాయక్ అనే విద్యార్థి రాలేదు. గంగాధర నాయక్ అడవిలో తప్పిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు, పోలీసులు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది శేషాచలం అడవుల్లో గంగాధర నాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 1.30 గంటల వరకు వెతికినప్పటికి కనిపించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో మళ్లీ ఉదయం వెతికేందుకు వెళుతుండగా రాత్రంతా అడవిలోనే గడిపిన ఆ విద్యార్థి తిరిగి వ స్తూ పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలతో ఉన్న అతన్ని అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. వినీత్ అనే విద్యార్థికి కూడా కడప రిమ్స్‌లో చికిత్స అందించి ట్రిపుల్ ఐటీకి పంపించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. -
200 మందిపై తేనెటీగల దాడి
పాట్నా: తేనెటీగల దాడిలో దాదాపు 200 మంది మహిళలు, పిల్లలు గాయపడిన ఘటన బిహార్ లోని ఆర్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక పండుగను పురస్కరించుకుని మర్రి చెట్టు పూజలు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని పోలీసు అధికారులు తెలిపారు. చెట్టుకింద ఒకేసారి ఎక్కుమంది గుమిగూడడంతో తేనెటీగలు దాడిచేశాయని వెల్లడించారు. బాధితులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని చెప్పారు. -
‘తేనె’ మనసు.. మనిషి
తేనె అమ్ముకునే ఈ వ్యక్తికి తేనె కంటే తేనెటీగలంటే మహా ప్రేమ. ఖాళీ సమయమంతా వీటి మధ్యే గడుపుతాడు. గత 12 ఏళ్లుగా వీటితోనే సావాసం. తేనె వ్యాపారానికి కొత్త తరహా ప్రచారం తేవాలనే ఆలోచన, తేనెటీగలతో సావాసమే.. ఈ సాహసానికి పురికొల్పాయంటాడు ఈయన. ఈశాన్య చైనాలోని చోంగ్క్వింగ్ నగరంలో నివసించే ఈయన పేరు షి పింగ్(34). సాహసం చేసేసమయంలో కనీసం షర్ట్ కూడా వేసుకోని ఈయనపై దాదాపు 4,60,000 తేనెటీగలు దాదాపు 40 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాయి. ఈ తేనెటీగల మొత్తం బరువు దాదాపు 45 కేజీలు. గతంలో ఇదేతరహాలో మొత్తంగా 61.4 కేజీల బరువైన లక్షలాది తేనెటీగలతో భారత్‌కు చెందిన విపిన్ సేథ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. -
శవాన్ని వదిలి పరిగెత్తారు
కరీంనగర్: తేనెటీగలు తరచూ మనుషులపై దాడి చేసి తమ సత్తా చూపుతున్నాయి. అవి ఊరకనే ఎందుకు దాడి చేస్తాయి? వాటిని కదిలిస్తేనో, వాటికి ఇబ్బంది కలిగిస్తేనో దాడి చేస్తుంటాయి. తేనెటీగల దాడి వల్ల కొన్ని సందర్భాలలో ఆస్పత్రిపాలుకావలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు బోయిన్పల్లి మండలంలో శవాన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నవారిపై తేనెటీగలు దాడి చేయడంతో వారు శవాన్ని అక్కడే వదిలి దౌడు తీశారు. విలాసాగర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. శవయాత్ర నిర్వహిస్తున్న వారిపై అవి దాడి చేయడంతో జనం ఒక్కసారిగా తోచుకుంటూ పరుగులు తీశారు. ఆ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. శవయాత్ర సందర్భంగా సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. ఆ కడ్డీల నుంచి వచ్చిన పొగ సమీపంలో ఉన్న తేనె తుట్టిపై సోకడంతో అవి దాడి చేసినట్లు భావిస్తున్నారు. గత నెలలో వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో ఆదిమానవులు గీచిన చిత్రాలు చూసేందుకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులపైన తేనెటీగలు దాడి చేయడంతో 24 మంది ఆస్పత్రి పాలయ్యారు. తేనెతుట్టెపై కొందరు విద్యార్థులు సరదాగా రాళ్లు విసరడంతో అవి ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. ఇష్టమొచ్చినట్లు విద్యార్థులను, ఉపాధ్యాయులను కుట్టివదిలిపెట్టాయి. వారికి ముద్దనూరు, జమ్మలమడుతు ఆస్పత్రులలో చికిత్స చేశారు. అందు వల్ల తేనెటీగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా!