తేనె అమ్ముకునే ఈ వ్యక్తికి తేనె కంటే తేనెటీగలంటే మహా ప్రేమ. ఖాళీ సమయమంతా వీటి మధ్యే గడుపుతాడు. గత 12 ఏళ్లుగా వీటితోనే సావాసం. తేనె వ్యాపారానికి కొత్త తరహా ప్రచారం తేవాలనే ఆలోచన, తేనెటీగలతో సావాసమే.. ఈ సాహసానికి పురికొల్పాయంటాడు ఈయన. ఈశాన్య చైనాలోని చోంగ్‌క్వింగ్ నగరంలో నివసించే ఈయన పేరు షి పింగ్(34).
సాహసం చేసేసమయంలో కనీసం షర్ట్ కూడా వేసుకోని ఈయనపై దాదాపు 4,60,000 తేనెటీగలు దాదాపు 40 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాయి. ఈ తేనెటీగల మొత్తం బరువు దాదాపు 45 కేజీలు. గతంలో ఇదేతరహాలో మొత్తంగా 61.4 కేజీల బరువైన లక్షలాది తేనెటీగలతో భారత్‌కు చెందిన విపిన్ సేథ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు.
‘తేనె’ మనసు.. మనిషి
Published Fri, Apr 11 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement
Advertisement