Chongqing city
-
దేశముదురు... ఆటకట్టు
చైనాలోని చోంగ్క్వింగ్ నగరానికి చెందిన లియూ షియాంగ్ అనే దేశముదురు అతితెలివి చూపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనికి 7.22 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 4.76 కోట్లు) లాటరీ తగిలింది. ఎవరైనా ఏం చేస్తారు... వెంటనే విషయాన్ని కుటుంబీకులతో పంచుకుంటారు. అయితే లియూ బుర్రలో ఓ వెధవ ఆలోచన వచ్చింది. లాటరీ తలిగిన విషయాన్ని దాచిపెట్టి... భార్య యువాన్ లీని వెంటనే విడాకులు ఇవ్వాలని కోరాడు. ఇద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న అప్పును తానే భరిస్తానని... విడాకులు ఇవ్వమని బలవంతం చేశాడు. మరో దారిలేక ఆమె అలాగే చేసింది. అధికారికంగా విడాకులు మంజూరైన మరుసటి రోజే లియూ వెళ్లి లాటరీ మొత్తాన్ని క్లెయిమ్ చేశాడు. వీరి విడాకుల విషయం తెలియని స్నేహితులు యువాన్ లీని శుభాకాంక్షలు చెప్పసాగారు. అంత డబ్బు వచ్చింది కదా... కంగ్రాట్స్ అంటూ జనం ఫోన్లు చేస్తుంటే ఆమె బిత్తరపోయింది. చివరికి విషయం తెలిసి భర్తపై కోర్టులో కేసు వేసింది. తామిద్దరం దంపతులుగా ఉన్నపుడే లాటరీ టిక్కెట్టు కొన్నాడని... అందువల్ల ప్రైజ్‌మనీలో తనకు సగభాగం రావాల్సిందేనని వాదించింది. చివరకు కోర్టు ఆమె వాదనతో ఏకీభవించి 1,8 లక్షల డాలర్లను (కోటీ 19 లక్షల రూపాయలు) మాజీ భార్యకు ఇవ్వాల్సిందేనని తీర్పునిచ్చి... లియూ ఆటకట్టించింది. -
లాటరీ కొట్టాడు... విడాకులిచ్చాడు!
బీజింగ్: లాటరీలో అదృష్టలక్ష్మి వరిస్తే ఎవరైనా ఏం చేస్తారు? పెద్దమొత్తంలో వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటారు. విశాల హృదయులైతే దానం చేస్తారు. కానీ చైనాలో లాటరీ తగిలిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చాడు. చాంగ్ కింగ్ నగరంలో ఈ వింత ఉదంతం వెలుగుచూసింది. లియు జియాంగ్ కు లాటరీలో 4.6 యువాన్లు(దాదాపు రూ.4.7 కోట్లు) వచ్చాయి. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఒకరోజు ముందు అతడు తన భార్య యువాన్ లీకు విడాకులిచ్చాడు. ఫిబ్రవరి 26న అతడు లాటరీ సొమ్ము అందుకున్నాడు. అయితే విడాకులు తీసుకోవడానికి ముందు లాటరీ టిక్కెట్ కొన్నందున వచ్చిన మొత్తంలో తనకు వాటా ఇప్పించాలని లియు జియాంగ్ భార్య కోర్టుకెక్కింది. కోర్టు ఆదేశాలకు మేరకు 1.15 మిలియన్ యువాన్లు భార్యకు ఇవ్వాల్సివచ్చింది. భార్యతో విడిపోవడానికి ముందే లియు జియాంగ్ కు మరో మహిళతో సంబంధముందని తేలింది. -
‘తేనె’ మనసు.. మనిషి
తేనె అమ్ముకునే ఈ వ్యక్తికి తేనె కంటే తేనెటీగలంటే మహా ప్రేమ. ఖాళీ సమయమంతా వీటి మధ్యే గడుపుతాడు. గత 12 ఏళ్లుగా వీటితోనే సావాసం. తేనె వ్యాపారానికి కొత్త తరహా ప్రచారం తేవాలనే ఆలోచన, తేనెటీగలతో సావాసమే.. ఈ సాహసానికి పురికొల్పాయంటాడు ఈయన. ఈశాన్య చైనాలోని చోంగ్క్వింగ్ నగరంలో నివసించే ఈయన పేరు షి పింగ్(34). సాహసం చేసేసమయంలో కనీసం షర్ట్ కూడా వేసుకోని ఈయనపై దాదాపు 4,60,000 తేనెటీగలు దాదాపు 40 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాయి. ఈ తేనెటీగల మొత్తం బరువు దాదాపు 45 కేజీలు. గతంలో ఇదేతరహాలో మొత్తంగా 61.4 కేజీల బరువైన లక్షలాది తేనెటీగలతో భారత్‌కు చెందిన విపిన్ సేథ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు.