లాటరీ కొట్టాడు... విడాకులిచ్చాడు!
బీజింగ్: లాటరీలో అదృష్టలక్ష్మి వరిస్తే ఎవరైనా ఏం చేస్తారు? పెద్దమొత్తంలో వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటారు. విశాల హృదయులైతే దానం చేస్తారు. కానీ చైనాలో లాటరీ తగిలిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చాడు. చాంగ్ కింగ్ నగరంలో ఈ వింత ఉదంతం వెలుగుచూసింది.
లియు జియాంగ్ కు లాటరీలో 4.6 యువాన్లు(దాదాపు రూ.4.7 కోట్లు) వచ్చాయి. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి ఒకరోజు ముందు అతడు తన భార్య యువాన్ లీకు విడాకులిచ్చాడు. ఫిబ్రవరి 26న అతడు లాటరీ సొమ్ము అందుకున్నాడు. అయితే విడాకులు తీసుకోవడానికి ముందు లాటరీ టిక్కెట్ కొన్నందున వచ్చిన మొత్తంలో తనకు వాటా ఇప్పించాలని లియు జియాంగ్ భార్య కోర్టుకెక్కింది.
కోర్టు ఆదేశాలకు మేరకు 1.15 మిలియన్ యువాన్లు భార్యకు ఇవ్వాల్సివచ్చింది. భార్యతో విడిపోవడానికి ముందే లియు జియాంగ్ కు మరో మహిళతో సంబంధముందని తేలింది.