సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ జిల్లాలోని ఘటన సారంగాపూర్‌లో శుక్రవారం జరిగింది. స్వర్ణ ప్రాజెక్టు వద్ద తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో అధికారులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు అధికారులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు సారంగపూర్ స్వర్ణ ప్రాజెక్టు నుంచి రబీకి నీళ్లు ఇచ్చేందుకు వచ్చినపుడు ఈ ఘటన జరిగింది.
అధికారులపై తేనెటీగల దాడి
Published Fri, Dec 8 2017 4:23 PM | Last Updated on Fri, Dec 8 2017 4:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment