
ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు..
దాదాపు 20 వేల తేనెటీగలు ఈ పాటేసుకుని ఫాలో అయిపోతుంటే... వేల్స్‌లోని హేవర్‌ఫోర్డ్‌వెస్ట్‌కు చెందిన ఓ కారు యజమాని హడలిపోయాడు. ఒకట్రెండు గంటలు కాదు.. రెండు రోజులపాటు అవి అతడి కారును అంటిపెట్టుకుని ఫాలో అయిపోయాయి. ఇద్దరు ముగ్గురు తేనెటీగల నిపుణులు వచ్చి.. వాటిని తీసి వేసినా.. మళ్లీ అవి అక్కడికే వచ్చి చేరడం మొదలుపెట్టాయి.
ఇంతకీ జరిగిన విషయమేమిటంటే.. వాళ్ల రాణి తేనెటీగ ఆ వాహనం డిక్కీ భాగంలో ఇరుక్కుపోయింది. దీంతో రాణితో పాటే మేమూ అంటూ ఆ తేనెటీగలు వాహనాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయాయి. రెండ్రోజుల అనంతరం రాణి తేనెటీగ ఎలాగోలా బయటపడింది. దీంతో మిగిలిన తేనెటీగలు వాహనాన్ని వదిలేసి.. రాణిని ఫాలో అయిపోయాయి.