వాషింగ్టన్ : మమూలుగా మనమందరం తేనె కావాలంటే కిరాణ షాపుకో, సూపర్ మార్కెటుకో పోయి తీసుకుంటాం. కానీ నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నించమంటే అంతే సంగతులు..! సింపుల్‌గా మన షేప్ మారిపోయి ఆసుపత్రిలో తేలుతాం. నేరుగా తేనెను తీయడానికి ప్రయత్నిస్తే తేనెటీగలు ఎదురుదాడికి పాల్పడతాయి. అందుకే జనం తేనె తుట్టెల జోలికి పోవాలంటే చచ్చేంత భయపడుతుంటారు. మహిళలైతే మరీను.. టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ అనే మహిళ మాత్రం అలా కాదు. తేనెటీగల పెంపకం దారి అయినా ఈమె తేనె తుట్టెను పద్ధతిగా ఏ భయం లేకుండా చేతులతో తీస్తుంది. కొద్దిరోజుల క్రితం టెక్సాస్‌లోని ఓ ఇంటిలో రెండు సంవత్సరాలుగా దాగి ఉన్న తేనె తుట్టెను చేత్తో తీసివేసింది.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఎరికా ఎలాంటి సేఫ్టీ లేకుండా తేనెటీగలను తుట్టెనుంచి వేరు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 1.5 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన వారు ఔరా..! అంటున్నారు. అంతేకాకుండా మహిళను వండర్‌వుమన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment