![A Shocking Video Showed Her Throwing A Bowl Of Steaming Soap Into A Restaurant Manager Face - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/11/Resu.jpg.webp?itok=dSYDEV2E)
టెక్సాస్: రెస్టారెంట్లలో సర్వ్ చేసేవాళ్లతో కొంతమంది కస్టమర్లు ఎంత తలబిరుసుగా ప్రవర్తిస్తుంటారో చూసే ఉంటాం. అంతేకాదు మరికొంతమంది కస్టమర్లు ఆర్డర్ లేటుగా తీసుకువచ్చాడంటూ సర్వ్ చేసేవాళ్లను చేయి చేసుకుడమే కాక అక్కడ ఉన్న ఫర్నేచర్‌ను పాడు చేసిన వార్తలు కూడా విన్నాం. కానీ ఇక్కడొక రెస్టారెంట్‌లోని మహిళా ఆ కస్టమర్లందరీ కంటే ఒక అడుగు ముందుకేసి ఇంకా దారుణంగా ప్రవర్తించింది.
(చదవండి: విమానాలకు రన్‌వేగా....)
అసలేం జరిగిందంటే.. టెక్సాస్‌లోని రెస్టరెంట్లో ఒక కస్టమర్ స్పైసీ స్పైసీ మెక్సికన్ సూప్ ఆర్డర్ చేసింది. అయిత ఆమెకు సర్వ్ చేసిన సూప్ కంటైనర్‌లో ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. అంతే ఆమె కోపంతో రెస్టారెంట్ మేనేజర్ జన్నెల్లే బ్రోలాండ్ వద్దకు వచ్చి జరిగిన విషయం వివరిస్తుంది. అంతేకాదు ఏవిధంగా ఆ సూప్ కంటైనర్ మూత కరిగిపోయిందో చూపిస్తూ మేనేజర్‌పై కోపంగా అరుస్తూంది.
కాసేపటికి ఉన్నటుండి ఆ వేడివేడి సూప్‌ను మేనేజర్ బ్రోలాండ్ ముఖంపైన విసిరేసి హడావిడిగా పరుగెత్తుతూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు బ్రోలాండ్ షాక్‌కి గురవుతోంది. ఈ మేరకు బ్రోలాండ్ వెంటనే ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అక్కడ ఉన్న కొంతమంది మహిళల సాయంతో ఆమె వెళ్లిపోతున్న కారుని ఫోటోలు తీసి టెక్సాస్‌లో పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ప్రస్తుతం సదరు కస్టమర్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు కస్టమర్ తీరుని విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment