టెక్సాస్: ప్రస్తుత కాలంలో మొదటిసారిగా తల్లిదండ్రులు కాబోతున్న జంట బేజీ షవర్, మెటర్నిటీ ఫొటోషూట్ వంటి కార్యక్రమాలకు మక్కువ చూపుతున్నారు. ఇందుకోసం కోసం అందమైన, ఆకర్షించే ప్రదేశాలను ఎంచుకోవడం లేదా వారి ఫొటోషూట్ భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన మెటర్నిటీ ఫొటోషూట్‌ను మరింత ప్రత్యేకంగా ఉంచేందుకు అత్యంత సాహసమైన ఆలోచన చేసింది. తన పొట్టపై ఏకంగా 10 వేల తేనెటీగల గూడును పెట్టుకుని ఫొటోషూట్‌కు ఫోజ్‌లిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె పేరు బేథానీ కరులక్. ఆమె ముందునుంచే ఇలాంటి సాహసాల్లో నిపుణురాలు. (వైరల్ : నల్ల చిరుతను చూశారా?)
బేథానీ ఇటీవల తీసుకున్న తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘ఇది ప్రమాదకరమైనది. దయచేసి అనుభవం లేకుండా ఎవరూ ప్రయత్నించకండి’ అనే క్యాప్షన్‌తో ఆమె పోస్టు చేసింది. ‘ఫొటోషూట్ మొత్తంలో ఆ తేనెటీగల నన్ను ఒక్కసారి కూడా కుట్టలేదు. మొదట రాణీ తేనెటీగను నా పొట్టపై బంధించాము. ఆ తర్వాత మిగతా తేనెటీగలను ఉంచడంతో కాసేపట్లలో అవి గూడు కట్టాయి. ఇక్కడ దాదాపు 10 వేలకు పైగా తేనెటీగల ఉన్నాయి. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనిని డాక్టర్ సలహాతోనే ప్రయత్నించాం’ అంటూ బేథాని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమె సాహసానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తూంటే మరికొందరూ ‘అసలు ఎందుకిలా చేయడం’, ‘తేనెటీగలకు బదులుగా సీతాకోక చిలుకలను ప్రయత్నించచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం)
Comments
Please login to add a commentAdd a comment