ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ఈనెల 23నుంచి రాంనగర్‌లోని మదర్స్ హైస్కూల్‌లో జరుగనుంది. రాయల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ టోర్నీలో స్కూల్ విద్యార్థులు మాత్రమే పోటీపడేందుకు అర్హులని చీఫ్ ఆర్బిటర్ ఎస్.సబ్బారాజు తెలిపారు. అండర్-7, 9, 11, 13, 14, 15 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.
అలాగే వన్డే ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నీ కూడా అదే రోజు మదర్స్ హైస్కూల్‌లో నిర్వహించనున్నారు. 22లోగా తమ ఎంట్రీలను పంపించాలి. వివరాల కోసం ఎస్.సుబ్బారాజు (98667-02431), బి.వి.కుమార్ (92471-88018)లను సంప్రదించవచ్చు.
23 నుంచి స్కూల్ చెస్ టోర్నీ
Published Fri, Mar 21 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement
Advertisement