inter school chess tournment
-
చాంప్స్ షణ్ముఖ తేజ, రోహన్
ఎల్బీ స్టేడియం: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీలో షణ్ముఖ తేజ, రోహన్ విజేతలుగా నిలిచారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు తలపడే విభాగంలో షణ్ముఖ తేజ గెలువగా, 5వ తరగతిలోపు విద్యార్థులు పోటీ పడే విభాగంలో ఎం.సాయి రోహన్ నెగ్గాడు. ఫైనల్స్ ఫలితాలు: 6-10 క్లాస్ విభాగం: 1.షణ్ముఖ తేజ (5), 2.పి.సుశీల్‌రెడ్డి (5), 3. బి.సాయి చాణి క్య (5), 4. డి.గణేష్ (4), 5. ఎన్. వెంకట్(4), 6. డి.సాయి శ్రవణ్ (4), 7. బి.సాయి రేవంత్‌రెడ్డి (4), 8. భవేష్ (4), 9.సి.హెచ్.మాధురి, 10. హరి చరణ్ సాయి (4). 5 క్లాస్ విభాగం: 1.ఎం.సాయి రోహన్ చౌదరి (5), 2. సి.హెచ్. కార్తీక్ సాయి (5), 3. సి.హెచ్.వర్షిత (4), 5.సర్వజ్ఞి (4), 5.ఎస్.యశస్ నందన్(4), 6. కె.జి.సాత్విక (4), 7. సూరజ్ (4), 8. జస్వంత్ (4), 9. వి.ఆర్.ఎస్. విరించి (4), 10.వెంకట రఘనందన్ (4). -
చెస్ చాంపియన్ తరుణ్
జింఖానా, న్యూస్‌లైన్: రాయల్ చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ అండర్-15 విభాగంలో తరుణ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తరుణ్ (4 పాయింట్లు) మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని గౌతమ్ (4) దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో సుకన్య టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర అండర్-13 విభాగంలో మేఘాన్ష్రామ్ (5) ప్రథమ స్థానంలో నిలవగా... కుమార్ (4) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో అనీషా ఘోష్ (3.5) టైటిల్‌ను సాధించింది. అమూల్య రెండో స్థానంలో నిలిచింది. బాలుర అండర్-11 విభాగంలో శశాంక్ రాజ్ మొదటి స్థానంలో, విశ్వాస్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సాహిత్య (4), ద్వితీయ స్థానాన్ని ఝాన్సి దక్కించుకున్నారు. బాలుర అండర్-9 విభాగంలో శ్రీరామ్ విజేతగా నిలవగా... రుత్విక్ (4) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బాలికల విభాగ ంలో త్రిష (3.5), రచిత (3) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్-7 విభాగంలో కృష్ణ సిద్ధాంత్ (3) టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానాన్ని సాయి మనో సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో సుసేన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా... ప్రణీత ప్రియ రెండో స్థానంలో నిలిచింది. ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎస్.ఖాన్ టైటిల్ సాధించాడు. వరుసగా రెండు, మూడు స్థానాలను మూర్తి, షేక్ ఫయాజ్ సొంతం చేసుకున్నారు. -
23 నుంచి స్కూల్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ ఈనెల 23నుంచి రాంనగర్‌లోని మదర్స్ హైస్కూల్లో జరుగనుంది. రాయల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ సౌజన్యంతో జరగనున్న ఈ టోర్నీలో స్కూల్ విద్యార్థులు మాత్రమే పోటీపడేందుకు అర్హులని చీఫ్ ఆర్బిటర్ ఎస్.సబ్బారాజు తెలిపారు. అండర్-7, 9, 11, 13, 14, 15 బాలబాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అలాగే వన్డే ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నీ కూడా అదే రోజు మదర్స్ హైస్కూల్లో నిర్వహించనున్నారు. 22లోగా తమ ఎంట్రీలను పంపించాలి. వివరాల కోసం ఎస్.సుబ్బారాజు (98667-02431), బి.వి.కుమార్ (92471-88018)లను సంప్రదించవచ్చు. -
అండర్-16 చెస్ విజేత షణ్ముక తేజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో అండర్-16 టైటిల్‌ను షణ్ముక తేజ కైవసం చేసుకున్నాడు. అండర్-14 టైటిల్‌ను వి.ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, అండర్-10 టైటిల్‌ను వి.ప్రణీత్ గెలిచాడు. జి.అదితి, శ్రీపాద అరుణ్లిద్దరూ బెస్ట్ ప్లేయర్లుగా నిలిచారు. చెస్ డాట్ హలో హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు తార్నాకలోని ఎం.కృష్ణారెడ్డి హాల్లో జరిగాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హలో హైదరాబాద్ డాట్ కామ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నంద గోపాల్, నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 విభాగం:1. వి.ప్రణీత్, 2.సి. అకిరారెడ్డి,3. మొహమ్మది బేగం, 4. జి.విశాల్‌రెడ్డి, 5. ఎం.శివ భార్గవి, 6.ఎన్.విద్యాధర్, 7.పి.రఘు, 8.ఎన్.కళాధర్, కె.వి.ధృవ్, 9.జ్ఞాన ప్రియా. అండర్-14 విభాగం:1.వి.ప్రదీప్ కుమార్, 2. టి.సాయి వరుణ్, 3.ముదాసిర్, 4.పి.మధుకేతన్, 5. పి.ప్రణవీ సాయి, 6. డి.ఎన్.వి.వరుణేంద్ర, 7.పి.ప్రణీత్, 8.డి.ఎన్.వి.హర్షేంద్ర, 9. హజీరా బేగం, 10.జి.నవీన్. అండర్-16 విభాగం:1.పి.షణ్ముక తేజ, 2.ఎం.తరుణ్, 3.వి.వి.ఎస్.శివ, 4.సి.పార్థసారథి, 5.డి.సాయి శ్రవణ్, 7.ఎం.ఎ.ఎస్.ప్రణవ నినాదం, 8.ఎన్.సాయి వికాస్‌రెడ్డి, 9. బి.మధు కుమార్, 10. ఎ.అరవింద్ నాయక్, 11.పి.వి.ప్రణీత్.