జింఖానా, న్యూస్‌లైన్: రాయల్ చెస్ అకాడమీ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ అండర్-15 విభాగంలో తరుణ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ టోర్నీలో తరుణ్ (4 పాయింట్లు) మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానాన్ని గౌతమ్ (4) దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో సుకన్య టైటిల్‌ను దక్కించుకుంది.
బాలుర అండర్-13 విభాగంలో మేఘాన్ష్‌రామ్ (5) ప్రథమ స్థానంలో నిలవగా... కుమార్ (4) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో అనీషా ఘోష్ (3.5) టైటిల్‌ను సాధించింది. అమూల్య రెండో స్థానంలో నిలిచింది. బాలుర అండర్-11 విభాగంలో శశాంక్ రాజ్ మొదటి స్థానంలో, విశ్వాస్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సాహిత్య (4), ద్వితీయ స్థానాన్ని ఝాన్సి దక్కించుకున్నారు. బాలుర అండర్-9 విభాగంలో శ్రీరామ్ విజేతగా నిలవగా... రుత్విక్ (4) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
బాలికల విభాగ ంలో త్రిష (3.5), రచిత (3) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్-7 విభాగంలో కృష్ణ సిద్ధాంత్ (3) టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానాన్ని సాయి మనో సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో సుసేన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా... ప్రణీత ప్రియ రెండో స్థానంలో నిలిచింది. ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఎస్.ఖాన్ టైటిల్ సాధించాడు. వరుసగా రెండు, మూడు స్థానాలను మూర్తి, షేక్ ఫయాజ్ సొంతం చేసుకున్నారు.
చెస్ చాంపియన్ తరుణ్
Published Mon, Mar 24 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM
Advertisement
Advertisement