అస్తానా: కజకిస్తాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 190వ ర్యాంకర్ తరుణ్ 21–8, 21–7తో ప్రపంచ 78వ ర్యాంకర్ లె డక్ ఫాట్ (వియత్నాం)పై సంచలన విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 76వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా)తో తరుణ్ తలపడతాడు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ 22–20, 21–14తో దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్)ను ఓడించాడు.
మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 15–21, 15–21తో వోంగ్ తియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జంట చేతిలో ఓడిపోగా... సెమీఫైనల్లో మనీషా–సంజయ్ (భారత్) ద్వయం 21–16, 10–21, 21–14తో కొసియెలా–తనీనా (అల్జీరియా) జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు టైటిల్ ఖరారైంది. ఫైనల్ పోరు ఇద్దరు భారత క్రీడాకారిణులు అనుపమా ఉపాధ్యాయ, ఇషారాణి బారువా మధ్య జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment