అండర్-16 చెస్ విజేత షణ్ముక తేజ | Under-16 Chess Championship shanumukha Teja | Sakshi
Sakshi News home page

అండర్-16 చెస్ విజేత షణ్ముక తేజ

Published Fri, Feb 21 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

Under-16 Chess Championship shanumukha Teja

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్‌లో అండర్-16 టైటిల్‌ను షణ్ముక తేజ కైవసం చేసుకున్నాడు. అండర్-14 టైటిల్‌ను వి.ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, అండర్-10 టైటిల్‌ను వి.ప్రణీత్ గెలిచాడు. జి.అదితి, శ్రీపాద అరుణ్‌లిద్దరూ బెస్ట్ ప్లేయర్లుగా నిలిచారు. చెస్ డాట్ హలో హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు తార్నాకలోని ఎం.కృష్ణారెడ్డి హాల్‌లో జరిగాయి.
 
 ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హలో హైదరాబాద్ డాట్ కామ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నంద గోపాల్, నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు.
 
 ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 విభాగం:1. వి.ప్రణీత్, 2.సి. అకిరారెడ్డి,3. మొహమ్మది బేగం, 4. జి.విశాల్‌రెడ్డి, 5. ఎం.శివ భార్గవి, 6.ఎన్.విద్యాధర్, 7.పి.రఘు, 8.ఎన్.కళాధర్, కె.వి.ధృవ్, 9.జ్ఞాన ప్రియా. అండర్-14 విభాగం:1.వి.ప్రదీప్ కుమార్, 2. టి.సాయి వరుణ్, 3.ముదాసిర్, 4.పి.మధుకేతన్, 5. పి.ప్రణవీ సాయి, 6. డి.ఎన్.వి.వరుణేంద్ర, 7.పి.ప్రణీత్, 8.డి.ఎన్.వి.హర్షేంద్ర, 9. హజీరా బేగం, 10.జి.నవీన్. అండర్-16 విభాగం:1.పి.షణ్ముక తేజ, 2.ఎం.తరుణ్, 3.వి.వి.ఎస్.శివ, 4.సి.పార్థసారథి, 5.డి.సాయి శ్రవణ్, 7.ఎం.ఎ.ఎస్.ప్రణవ నినాదం, 8.ఎన్.సాయి వికాస్‌రెడ్డి, 9. బి.మధు కుమార్, 10. ఎ.అరవింద్ నాయక్, 11.పి.వి.ప్రణీత్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement