అండర్-16 చెస్ విజేత షణ్ముక తేజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్లో అండర్-16 టైటిల్‌ను షణ్ముక తేజ కైవసం చేసుకున్నాడు. అండర్-14 టైటిల్‌ను వి.ప్రదీప్ కుమార్ గెలుచుకోగా, అండర్-10 టైటిల్‌ను వి.ప్రణీత్ గెలిచాడు. జి.అదితి, శ్రీపాద అరుణ్లిద్దరూ బెస్ట్ ప్లేయర్లుగా నిలిచారు. చెస్ డాట్ హలో హైదరాబాద్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు తార్నాకలోని ఎం.కృష్ణారెడ్డి హాల్లో జరిగాయి.
ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మేజర్ శివ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హలో హైదరాబాద్ డాట్ కామ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నంద గోపాల్, నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 విభాగం:1. వి.ప్రణీత్, 2.సి. అకిరారెడ్డి,3. మొహమ్మది బేగం, 4. జి.విశాల్‌రెడ్డి, 5. ఎం.శివ భార్గవి, 6.ఎన్.విద్యాధర్, 7.పి.రఘు, 8.ఎన్.కళాధర్, కె.వి.ధృవ్, 9.జ్ఞాన ప్రియా. అండర్-14 విభాగం:1.వి.ప్రదీప్ కుమార్, 2. టి.సాయి వరుణ్, 3.ముదాసిర్, 4.పి.మధుకేతన్, 5. పి.ప్రణవీ సాయి, 6. డి.ఎన్.వి.వరుణేంద్ర, 7.పి.ప్రణీత్, 8.డి.ఎన్.వి.హర్షేంద్ర, 9. హజీరా బేగం, 10.జి.నవీన్. అండర్-16 విభాగం:1.పి.షణ్ముక తేజ, 2.ఎం.తరుణ్, 3.వి.వి.ఎస్.శివ, 4.సి.పార్థసారథి, 5.డి.సాయి శ్రవణ్, 7.ఎం.ఎ.ఎస్.ప్రణవ నినాదం, 8.ఎన్.సాయి వికాస్‌రెడ్డి, 9. బి.మధు కుమార్, 10. ఎ.అరవింద్ నాయక్, 11.పి.వి.ప్రణీత్.