ఇంటర్ స్కూల్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్‌లో అండర్-13 బాలుర టైటిల్‌ను వి.ప్రదీప్ కుమార్ చేజిక్కించుకున్నాడు. అండర్-13 బాలికల టైటిల్‌ను అమిత కరణ్ జైశ్వాల్ గెలిచింది. సుజాత స్కూల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మొయినాబాద్‌లోని సుజాత స్కూల్‌లో మంగళవారం ఈ పోటీలు జరిగాయి. వీటిని స్కూల్ ప్రిన్సిపల్ సునిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టోర్నీ డెరైక్టర్ కృష్ణ సింగ్, చీఫ్ ఆర్బిటర్ జ్యోతి గణేష్ పాల్గొన్నారు.
ఫైనల్స్ ఫలితాలు:
అండర్-10 బాలురు: 1.జస్వంత్, 2. కార్తీక్ రెడ్డి, 3. విశాల్, 4.కుష్, 5.వైష్ణవ్, 6. రోహన్ 7.ప్రవేక్. 8.ఆకాష్, 9.ప్రియాంచ్. అండర్ 10 బాలికలు: 1.వర్షిత, 2.నందిత, 3. త్రిష.
అండర్-13 బాలురు: 1.వి.ప్రదీప్ కుమార్, 2.కె.సుమంత్, 3.భరత్ యాదవ్, 4.సి.హెచ్.రితిక్, 5.తరుణ్. అండర్-13 బాలికలు: 1.అమిత కరణ్ జైశ్వాల్, 2.దేవి సృజన, 3.రిషిత. అండర్-16 బాలురు:1. షణ్ముఖ్ తేజ. అండర్-16 బాలికలు: 1.షీతల్.
అండర్-13 చాంప్ ప్రదీప్ కుమార్
Published Wed, Mar 5 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement