ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో రిషబ్ షా, కేతన్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రోజు జరిగిన రెండు రౌండ్లలోను వారిద్దరితో పాటు విని విజయ్ కుమార్, ఓంకార్, రతి ధనశ్రీ, ఆర్యన్, తపన్ కుమార్‌లు విజయాలు నమోదు చేశారు. వీళ్లంతా రెండేసి పాయింట్లతో ఉమ్మడిగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఏ2హెచ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో లక్డికాపూల్‌లోని వాసవి క్లబ్‌లో శనివారం జరిగిన రెండో రౌండ్ పోటీల్లో రిషబ్ షా(2)... సురేశ్ (1)పై, కేతన్ (2)... మృదుల్ డేహంకర్ (1)పై గెలిచారు. విని విజయ్ కుమార్ (2)... బేతల్ (1)ను, ఆర్యన్ (2)... రాజు (1)ను, రతి (2)... చందన్ మహాజన్ (1)ను కంగుతినిపంచారు. తపన్ (2)... సూర్య (1)పై గెలుపొందగా, రాజేశ్ గుప్తా (1.5)... రోనిత్ దాస్ (1.5)తో, రవికుమార్ (1.5)... అంకిత గౌడ్ (1.5)తో గేమ్‌లను డ్రా చేసుకున్నారు. అంతకుముందు ఈ పోటీలను వాసవి క్లబ్ కార్యదర్శి బద్దం వెంకటకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్ మేజర్ కె.ఎ.శివప్రసాద్ పాల్గొన్నారు.
సురేష్‌పై రిషబ్ గెలుపు
Published Sun, Dec 22 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement