బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్‌మనీ చెస్ టోర్నమెంట్‌లో జూనియర్ కేటగిరి టైటిల్‌ను పి.లాస్య ప్రియ (గౌతమ్ మోడల్ స్కూల్ మారేడ్‌పల్లి) కైవసం చేసుకుంది. ఓపెన్ కేటగిరి టైటిల్‌ను దీప్తాంశ్ రెడ్డి చేజిక్కించుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో ఆదివారం జరిగిన జూనియర్ విభాగం (ఆరో రౌండ్) ఫైనల్లో లాస్య ప్రియ, కె.తరుణ్ సంయుక్తంగా 5.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు.
అయితే ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా లాస్య ప్రియ విన్నర్‌గా, తరుణ్ రన్నరప్‌గా నిర్వాహకులు ప్రకటించారు. అలాగే ఓపెన్ విభాగంలో దీప్తాంశ్ రెడ్డి, ఎస్.కె.ఫయాజ్ ఖాన్ (6) పాయింట్లను పొందగా ప్రోగ్రెసివ్ స్కోరుతో దీప్తాంశ్ రెడ్డిని విజేతగా ఎంపిక చేశారు. చివరిదైన ఆరో రౌండ్‌లో ఎం.దీప్తాంశ్ రెడ్డి (6) ఎం.చక్రవర్తి రెడ్డి (5)పై విజయం సాధించాడు. ఫయాజ్ ఖాన్ (6) సుబ్బరాజు(4)పై గెలిచారు. జూనియర్ విభాగం (6)ఫైనల్ రౌండ్స్‌లో పి.లాస్య ప్రియ (5.5) బి.వి.మేఘాంశ్‌రామ్ (5)పై విజయం సాధించింది. కె.తరుణ్ (5.5)జస్వంత్ (4)పై, కె.యశ్వంత్ (5) సి.హెచ్.సాయి గోపాల్ (4)పై, కె.శరత్ చంద్ర (5) ఎన్.కృష్ణ కళ్యాణ్ (4)పై, కె.విశ్వనాథ్ అరవింద్ (5) కృష్ణ బాలాజీ (4)పై గెలిచారు.
చెస్ విజేతలు లాస్య ప్రియ, దీప్తాంశ్
Published Mon, Mar 10 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement