ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: బ్రిలియంట్ ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ ఓపెన్ కేటగిరీలో సాకేత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ప్రత్యూష్ శ్రీవాస్తవకు రెండో స్థానం లభించగా, ప్రతీక్ శ్రీవాస్తవకు మూడో స్థానం దక్కింది. జూనియర్ కేటగిరీ టైటిల్‌ను ఎస్.బిపిన్‌రాజ్ (సాక్రెడ్ హార్ట్ స్కూల్) చేజిక్కించుకున్నాడు. బ్రిలియంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ ఆఖరి ఆరో రౌండ్‌లో సాకేత్, ప్రత్యూష్ శ్రీవాస్తవల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది.
ఇద్దరు ఐదున్నర పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ ప్రొగ్రెసివ్ స్కోర్ ఆధారంగా సాకేత్‌ను విజేతగా ప్రకటించారు. జూనియర్ కేటగిరీలో ఎస్.బిపిన్‌రాజ్ (5.5), మిధుష్ (5.5)ల మధ్య కూడా చివరి రౌండ్ గేమ్ డ్రా అయింది. బిపిన్‌రాజ్ ప్రోగ్రెసివ్ స్కోర్‌తో మొదటి స్థానం పొందాడు. మిధుష్, ఎం.తరుణ్ వరుసగా రెండు, మూడో స్థానాలు పొందారు. వెటరన్ పురుషుల టైటిల్‌ను యు.వి.దివాకర్ గెలుచుకోగా, మహిళల టైటిల్‌ను మనీషా చౌదరి గెలిచింది. వివిధ విభాగాల ఫలితాలు ఇలా ఉన్నాయి.
ఫైనల్స్ ఫలితాలు
ఓపెన్ కేటగిరీ: 1.సాకేత్, 2.ప్రత్యూష్, 3.ప్రతీక్, 4.డి.సురేష్, 5.శోభరాజ్, 6.ఎస్.ఖాన్, 7.ఫయాజ్, 8.వి.ఎస్.ఎన్. మూర్తి, 9.ఎన్.రామ్మోహన్‌రావు, 10. సందీప్ నాయుడు.
అండర్-14 బాలురు: 1.తరుణ్, 2.గులాబ్ అహ్మద్; అండర్-14 బాలికలు: 1,హరిలాస్య, 2.ఎస్.దేవిక; అండర్-12 బాలురు: 1.జయతీర్థ్, 2.మేఘాంశ్ రామ్; అండర్-12 బాలికలు:1.లాస్య ప్రియ, 2. డి.మోహిని; అండర్-10 బాలురు: 1.మిధుష్, 2.కె.తరుణ్; అండర్-10 బాలికలు: 1.సాహిత్య, 2. హంసిక; అండర్-8 బాలురు: 1. పి.రుత్విక్, 2. ఒ.రుత్విక్; అండర్-8 బాలికలు: 1.రచిత, 2. కె.త్రిష. అండర్-6 బాలురు: 1.ప్రణయ్ వెంకటేష్, 2.హరినారాయణ; అండర్-6 బాలికలు:1. అనన్య, 2. సుసేన్‌రెడ్డి.
చెస్ విజేతలు సాకేత్, బిపిన్‌రాజు
Published Mon, Feb 10 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement