
రాహుల్ (ఫైల్ పొటో)
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు ఉరివేసుకున్న ఘటన దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం రాహుల్(18) అనే యువకుడు బుధవారం రాత్రి స్నేహితుని అన్న పెళ్లి బరాత్‌కు వెళ్లాడు. రాత్రి ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు రాహుల్‌కు ఫోన్‌చేసి మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన రాహుల్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటికి లేటుగా వస్తున్నాడని భర్త ముఖంపై..)
Comments
Please login to add a commentAdd a comment