రైతుల ఇంటికే అధికారులు | Farmers' homes, officials | Sakshi
Sakshi News home page

రైతుల ఇంటికే అధికారులు

Published Sat, Oct 18 2014 1:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers' homes, officials

  • రుణమాఫీ విషయంలో ఇబ్బందులుండవు
  •  మాట వినని బ్యాంకుల విషయం ప్రభుత్వం దృష్టికి..
  •  అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు : కలెక్టర్ కిషన్
  • హన్మకొండ అర్బన్ : రైతులకు బ్యాంకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటివద్దనే రుణమాఫీ, రెన్యూవల్‌కు సంబంధించి దరఖాస్తులపై వ్యవసాయ అధికారులు సంతకాలు తీసుకుం టారని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రుణమాఫీ, ప్రభుత్వ పథకాల మంజూరు తదితర విషయాలను విలేకరుల సమావేశంలో వివరించారు.

    రుణమాఫీలో ప్రభుత్వం తొలివిడతగా 25శాతం జిల్లాకు రూ.472కోట్లు విడుదల చేసిందని, ఆ మొత్తా న్ని రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు చెప్పారు. అయితే కొన్ని బ్యాంకులు రుణాల రెన్యూవల్ విషయంలో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు.

    ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభంలో ఉన్నందున బ్యాంకులకు తిరగడం ఇబ్బందిగా ఉంటుందని భావించి వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల ఇంటికి వెళ్లి రుణా ల రెన్యూవల్ దరఖాస్తులపై సంతకాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారని తెలిపారు. జిల్లా లో ఇప్పటివరకు 97వేల బ్యాంకు అకౌంట్లు మాత్రమే రైతులవి అందుబాటులో ఉన్నం దున వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నార ని, ఇంకా 22వేల ఖాతాల వివరాలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. మితగావారు కూడా జన్‌ధన్ ఖాతాలు తెరిచి అధికారులకు వివరా లు ఇవ్వాలని కోరారు.
     
    అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

    ప్రస్తుతం ఆహార భద్రత కార్డులకోసం 9.65లక్షలు, పింఛన్లకోసం 5.81లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటి పరిశీలనకు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేశామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజ లు ఆందోళన చెందవద్దని సూచించారు. 20వ తేదీ గడువు అయినప్పటికీ తరువాత కూడా మండల కార్యాలయాల్లో దర ఖాస్తులు స్వీకరి స్తారని చెప్పారు.

    దరఖాస్తుల పరిశీలనకు అధికారులు ఎప్పుడు వచ్చేది వార్డుల వారీగా తేదీలు ముందే ప్రకటిస్తారని, ఇంటివద్ద అం దుబాటులో ఉండి తగిన సమాచారం ఇవ్వాల ని కోరారు. సమగ్ర సర్వే సమయంలో పూర్తి వివరాలు ఇవ్వని వారు.. అసంపూర్తి సమాచా రం ఇచ్చిన వారు ప్రస్తుతం మార్చుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా రశీదు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.

    ఫాస్ట్ పథకానికి సంబంధించి కులం, నివాసం విషయంలో విధివిధానాలు వచ్చినప్పటికీ ఆదాయం విషయంలో ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. అయితే ముందుగా దరఖాస్తులు తెల్ల కాగితాలపై ఇస్తే సరిపోతుందని తరువాత అధికారులే విచారణ జరిపి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని చెప్పారు. ఈవిషయంలో అధికారులకు మరోసారి స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామన్నారు.

    ఓటర్ల నమోదు..

    జిల్లాలో నవంబర్ ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ ఉంటుందని, దానిని పరిశీలించి అభ్యంతరాలుంటే నవంబర్ 25వ తేదీలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు లు చేసుకోవాలని చెప్పారు. నవంబర్ 9, 16 తేదీల్లో బూత్‌లవారీగా జాబితాల ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 25నాటికి డాటాఎంట్రీ పూర్తి చేసి జనవరి 5న తుదిజాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్వో సురేంద్రకరణ్, జేడీఏ రామారావు, డీఆర్‌డీఏ పీడీ శంకరయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement