కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్లు, చెవుల మాదిరిగా ఉంటూ, ఎన్నికల విధులు సక్రమం గా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి. కిషన్ సూచించారు.
కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం సూక్ష్మ పరిశీలకుల రెండురోజుల శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారిని ఎన్నికల సంఘం సూక్ష్మ పరిశీలకులుగా నియమించిందని చెప్పారు. సాధారణ పరిశీలకుడు కింగ్లే మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర వహించాలని అన్నారు. నివేదికలు నిర్ణీత నమూనాలో పంపాలని సూచించారు. ఈనెల 29, 30 తేదీల్లో సూక్ష్మ పరిశీలకులు వారికి కేటాయించిన కేంద్రాల్లో విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయంలో అత్యవసర సమాచారాన్ని సాధారణ పరిశీలకులకు తెలియజేయాలని కోరారు.
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
Published Wed, Apr 16 2014 3:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement