
సామాజిక సర్వేకు సిద్ధం
హన్మకొండ అర్బన్: ఈ నెల 19న సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2014 జనాభా లెక్కల ప్రకారం 9.39 లక్షల కుటుంబాలు ఉన్నాయని, వీటి సర్వే చేసేందుకు 39,552 మంది అధికారులను నియమిస్తున్నట్టు తెలిపారు.
వీరిని సర్వే ప్రాంతాలకు తరలించేందుకు వెరుు్య వాహనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. సేకరించిన డాటాను కంప్యూటరీకరించేందుకు మొత్తం 2500 కంప్యూటర్లు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి మండలానికి ముగ్గురు ఏడీ స్థాయి అధికారులను నియమిస్తున్నామని, సర్వే తీరును వీరు పరిశీలిస్తుంటారని తెలిపారు. సర్వే నిర్వహణపై ఈనెల 6న శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జారుుంట్ కలెక్టర్ పౌసుమిబసు, అడిషనల్ జేసీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ పండాదాస్, ఆర్డీవో సురేందర్‌కరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.