వీరిటు.. వారటు
- కలెక్టర్, జేసీ, ఇద్దరు ఎస్పీలు తెలంగాణకు..
- ముగ్గురు డీఎఫ్‌ఓలు, ఒక ఓఎస్‌డీ ఇక్కడే...
- డీఐజీ కాంతారావు, కమిషనర్ పండాదాస్ ఆంధ్రప్రదేశ్‌కు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. జిల్లాలో ముగ్గురు ఐఏఎస్ అధికారులుండగా... కేంద్ర ప్రభుత్వం ఒకరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. నలుగురు ఐపీఎస్ అధికారులు ఉంటే... ఒక్కరిని ఆంధ్రప్రదేశ్‌కు అలాట్ చేసింది. ముగ్గురు ఐఎఫ్‌ఎస్ అధికారులుండగా, వీరందరనీ తెలంగాణకే కే టాయించారు. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ సొంత రాష్ట్రం ఏపీ కావడం గమనార్హం. త్వరలోనే వీరికి కొత్త పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
జిల్లా కలెక్టర్ జి.కిషన్(2001) తెలంగాణకు ఆప్షన్ పెట్టుకున్నారు. కేంద్ర నిర్ణయం ప్రకారం కిషన్ తెలంగాణకే అలాట్ అయ్యారు. కిషన్ సొంతజిల్లా నల్లగొండ.
జేసీ పౌసుమి బసు (2007) తెలంగాణకు ప్రాధాన్య మివ్వగా, కేంద్రం ఈమెను మన రాష్ట్రానికే కేటాయించింది. బసు సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్.
వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ గొర్రె ల సువర్ణ పండాదాస్(2006) తెలంగాణకు ప్రాధాన్యంఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. పండాదాస్ సొంత జిల్లా పశ్చిమగోదావరి.
పోలీసు శాఖకు సంబంధించి వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు(1999) ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్రం ఆయన ఆప్షన్ ప్రకారమే అలాట్ చేసింది. కాంతారావు సొంత జిల్లా పశ్చిమగోదావరి.
వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చా రు. కేంద్రం ఇదే రాష్ట్రానికి కేటాయిం చింది. ఆయన సొంతజిల్లా కరీంనగర్.
వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్‌కేవీ.రంగారావు రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. రోస్టర్ పాయింట్ల ప్రకా రం కేంద్రం ఈయనను తెలంగాణకు కేటాయించింది. రంగారావు సొంత జిల్లా విశాఖపట్నం.
వరంగల్ ఓఎస్డీ అంబర్‌కిషోర్‌ఝా (2009) తెలంగాణకు ఆప్షన్ పెట్టుకున్నారు. బీహార్‌కు చెందిన ఆయనను కేంద్రం తెలంగాణకు కేటాయించింది.
అటవీశాఖ ముఖ్య పర్యవేక్షణ అధికారి (సీఎఫ్) పి.వెంకటరాజారావు(1997) తెలంగాణకు అలాట్ అయ్యారు. రా జారావు హైదరాబాద్‌కు చెందినవారు.
ఫారెస్ట్‌కు శాఖలో జెనటసిస్ట్‌గా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి ఎస్.రమేశ్(2004) తెలంగాణకు అలాట్ అయ్యారు. రమేశ్ తమిళనాడుకు చెందినవారు.
జిల్లా అటవీ భాగంలో కొంత మేర విధులు నిర్వర్తించే కరీంనగర్ పశ్చిమ డివిజన్ డీఎఫ్‌ఓ జి.నర్సయ్య(2001) తెలంగాణకు అలాట్ అయ్యారు. కరీంనగర్ ఈయన సొంత జిల్లా.