హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్దిదారులకు మాత్రమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.కిషన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఇతర డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా భూ పంపిణీపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఆ గ్రామాల నుంచి 12మంది అబ్దిదారులను ఎంపిక చేసుకుని వారికి భూమి ఇచ్చేందుకు, ఆ భూమి అభివృద్ధి చేసి సాగు యోగ్యంగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చే యాలని కోరారు. ఇటీవల చేసిన సమగ్ర కు టుంబ సర్వేకు సంబంధించి డాటా ఎంట్రీ చేసేందుకు ఆపరేటర్లకు శిక్షణ పూర్తయిందని, ఆ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
రుణ మాఫీ, కొత్త రుణాల మంజూరు తదితర అంశాలపై గ్రామా లు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిం చి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. 25నుంచి 27 తేదీల మధ్య మండల స్థాయి సమావేశాలు పూర్తిచేయాలని, 29నాటికి అర్హుల జాబితా సిద్ధం చేయాలన్నారు.
‘ఇందిరమ్మ’ అక్రమాలపై దృష్టి
2004-2013 మధ్యలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, ఇందులో మొత్తం 5,934 మంది నుంచి రూ.17.45లక్షలు రికవరీ చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ కిషన్ తెలిపారు. ఇప్పటివరకు 1,913మంది నుంచి రూ.4.61లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో తహసీల్దార్లు తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి ఆర్‌ఆర్ చట్టం ప్రకారం వసూలు చేయాలన్నారు. అదేవిధంగా వర్షాభావం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిన ప్రాంతాల్లో ఆర్డీఓలు పర్యటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
చిట్యాల, ములుగు, మహబూబాబాద్ మండలాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నట్లు సమాచారం ఉందని, దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యులు స్థానికంగా అందుబాటులో లేని విషయం తహసీల్దార్లు రిపోర్టు చేయాలని, ముఖ్యంగా రెడ్యాలకు ప్రత్యేక బృందం పంపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జ్ పీడీ రాము, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, వరంగల్ ఆర్డీఓ మాధవరావు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
Published Sun, Aug 24 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement
Advertisement