మహబూబాబాద్, న్యూస్‌లైన్ : సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందాలి.. ఆ బాధ్యత అధికారులపై ఉం ది.. నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ జి.కిషన్ స్పష్టం చేశారు. పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో బుధవారం మహబూబాబాద్, నర్సంపేట డివిజన్లకు సంబంధించి అన్ని శాఖ ల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పథకాల అమలుపై చర్చించి అధికారులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అభ్యుదయ అధికారులను కేటాయించామని, వారు ప్రతి శుక్రవా రం కేటాయించిన గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల కు తెలియజేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజలు ఫిర్యాదు చేయగానే స్వీకరించి పరిష్కా రం మార్గం చూపినపుడే అభ్యుదయ అధికారులపై వారికి నమ్మకం కలుగుతుందన్నారు. గ్రా మంలోని సమస్యలు తెలుసుకోవడానికి సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉచితంగా సిమ్‌కార్డులను అందిస్తోందని, ఆ ప్రక్రియ వారంలో పూర్తవుతుందని చెప్పారు.
ప్రతి గ్రామంలో పింఛన్లు, రేషన్‌కార్డులు ఇతరాత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన జాబితాను పంచాయతీ కార్యాలయంలో అంటించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కార్యదర్శిపైనే ఉందన్నారు. మహిళా సాధికారత, ఓటరు నమోదు కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పర్చడంతోపాటు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు అందించేలా చూడాలని చెప్పారు. ప్రతి నెలా రెండో శనివారం గ్రామ సమస్యల ను సర్పంచ్‌ల ద్వారా తెలుసుకోవడానికి తాను అందుబాటులో ఉంటానని కలెక్టర్ తెలిపారు.
అధికారులకు క్విజ్ పోటీ
సమీక్ష సమావేశంలోనే వివిధ అంశాలపై అధికారులకు క్విజ్ పోటీ నిర్వహించారు. సరైన సమాధానం చెప్పినవారికి బహుమతులు అందజేశారు. అధికారులు సైతం ఆసక్తిగా పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజేఏసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్, డ్వామా పీడీ హైమావ తి, మానుకోట, నర్సంపేట డివిజన్ల ఆర్డీఓలు మధుసూదన్‌నాయక్, అరుణకుమారి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి
Published Thu, Jan 16 2014 4:35 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement