
చిన్నంబావి: మాట్లాడుతున్న ప్రభాకర్‌రెడ్డి
చిన్నంబావి (మహబూబ్‌నగర్): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తించేలా చూడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యాంగారి ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, సంస్థాగత కార్యదర్శి బుడ్డన్న, మండల అధ్యక్షులు కృష్ణమూర్తి, భీజేవైఎం మండల అధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి జగన్, తిరుపతయ్య వివిధ మండల అ«ధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
పాన్‌గల్: ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కుమారస్వామి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన మోదీ అన్ని సామాజిక వర్గాల అభివృద్దే ద్యేయంగా 116 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటì ంటికి తెలియపరుస్తూ 2019 సాధారణ ఎన్నికలలో పార్టీ గెలుపే ద్యేయంగా పనిచేయాలన్నారు. పార్టీ మండల అధ్యక్షులు మధుసూధన్‌యాదవ్, నవీన్‌రెడ్డి, మల్లిఖార్జున్, రామకృష్ణ, రాములునాయక్, సీతమ్మ, పరందాములు, రాము, నరేందర్ పాల్గొన్నారు.