యువత చేతిలోనే భవిత
పట్టణప్రాంతాల్లో పోలింగ్‌పై అనాసక్తి
పోలింగ్‌శాతం పెంపుపై ఎన్నికల కమిషన్ దృష్టి
30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
సాక్షి, కరీంనగర్ : 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. విద్యాధికులు కొలువుండే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 53శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కోరుట్లలో 64 శాతం, మెట్‌పల్లి 70, జగిత్యాలలో 63శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం నగర పంచాయతీలుగా మారిన జమ్మికుంటలో 68 శాతం, వేములవాడలో 58, హుజూరాబాద్ 67 పెద్దపల్లిలో 72 శాతం పోలింగ్ నమోదైంది.
రామగుండం మున్సిపాలిటీలో (2004లో జరిగిన ఎన్నికల్లో) 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో సగటున 66.75 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 33 శాతానికి పైగా ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్ నియోజక వర్గంలో 53.29 శాతం పోలింగ్ జరగగా, కార్పొరేషన్‌గా ఎదిగిన రామగుండంలో 57.98 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోరుట్లలో 67.09, జగిత్యాల 67.84, ధర్మపురి 65.71, మంథని 74.13, పెద్దపల్లి 70.77, చొప్పదండి 69.12, వేములవాడ 65.90, సిరిసిల్ల 64.49, మానకొండూరు 59.91, హుజూరాబాద్ 71.34, హుస్నాబాద్ 70.20 శాతం పోలింగ్ నమోదైంది.