ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారను. జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ స్థానాలు, 640 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, రెండు జడ్పీటీసీ, 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడంలేదు. 44 జడ్పీటీసీలకు ఎన్నికలు, 620 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లలో 29 మండలాలు ఉన్నాయి. వాటిలో వేలేరుపాడు, కుక్కునూరు ప్రజలు తమను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఆ రెండు మండలాలు పోగా 27 మండలాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం డివిజన్‌లోని 17 మండలాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి.
6న ఎన్నికలు జరిగే మండలాలు
ఏప్రిల్ 6న కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్‌ల లో ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం రెవెన్యూ డివి జన్‌లోని బయ్యారం, చండ్రుగొండ, ఏన్కూర్, గార్ల, గుం డాల, జూలూరుపాడు, కామేపల్లి, కొత్తగూడెం, సింగరేణి(కారేపల్లి), టేకులపల్లి, ఇల్లెందు మండలాలకు, పాల్వంచ డివిజన్‌లోని అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపహడ్, దమ్మపేట, మణుగూ రు, ములకలపల్లి, పాల్వంచ, పినపాక, భద్రాచలం డివిజన్‌లోని భద్రాచలం, చర్ల, చింతూరు, దుమ్ముగూడెం, కూనవరం, వీఆర్‌పురం, వెంకటాపురం, వాజేడు మండలాలలో ఎన్నికలు నిర్వహిస్తారు.
11న ఖమ్మం డివిజన్‌లో..
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. బోనకల్లు, చింతకాని, కల్లూరు, రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కూసుమంచి, మధిర, ముదిగొండ, నేలకొండపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, తిరుమలాయపాలెం, వేంసూరు, వైరా, ఎర్రుపాలెం మండలాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి.
‘ప్రాదేశిక’ ఎన్నికలు ఇలా...
Published Sun, Mar 30 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM
Advertisement
Advertisement