సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా పోలింగ్ జరక్కుండానే అవమానకరమైన ఫలితాలను చవిచూశారు. ఉపసంహరణలకొచ్చేసరికి ఇంకెంతటి చేదు అనుభవాలను ఎదుర్కొంటారో చూడాలి. సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవిని సైతం దక్కించుకోబోతోంది. దీన్నిబట్టి టీడీపీ ఎంత గడ్డు పరిస్థితిలో ఉందో స్పష్టమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి సొంత మండలంలోనే ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నానాటికీ తీసికట్టు
కళా వెంకటరావు.. ఈ పేరుకు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గతంలో అనేక పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా.. ఇంతటి పేరున్న కళా వెంకటరావు పరిస్థితి ప్రస్తుతం దయనీయమని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం ఇంకా ఉన్నప్పటికీ సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. దాదాపు ఉనికిని కోల్పోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేకపోయారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాలకు ఒక్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైపోయాయి. కనీసం నామినేషనే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహానికి ఊతమిచ్చింది. దీన్నిబట్టి టీడీ పీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటుందో స్పష్టమవుతుంది. అధినేత చంద్రబాబునాయు డు అజెండాను తలకెత్తుకోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అక్కడివారు చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు ఎఫెక్ట్..
రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుతగలడం, మూడు రాజధానులు వ ద్దు–అమరావతే ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకుని ముందుకెళ్లడం వలన ప్రజలు చీదరించుకుంటున్నారు. రాగా రాగా వచ్చే అవకాశాన్ని కాలదన్నుతున్నారని, అభివృద్ధికి అడ్డుపడే నాయకులకు అండగా ఉండటం అనవసరమని కళా వెంకటరావు సొంత మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా తిరస్కరిస్తున్నా రు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి అక్రమాలకు తెరలేపి, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చనేతలను ప్రజల్లోకి వదిలేసి జిల్లాను నాశ నం చేసిన నేతలకు పట్టం కట్టడం కన్నా పక్కన పెట్టడమే మంచిదన్న నిర్ణయానికొచ్చిన ప్రజలు ఛీత్కరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగి న బుద్ధి చెబుతామని బాహాటంగానే ప్రజలు ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ తరపున పోటీ చే యడానికి నాయకులు భయపడుతున్నారు. అందులో భాగంగా కళా వెంకటరావు సొంత మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా నామినేషన్ వేయలేదు. జిల్లాలో టీడీపీ దయనీయ పరిస్థితికి ఇది తార్కాణంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment