Provincial elections
-
‘నటులనే మించిన నటుడు మాజీ ప్రధాని’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా బాగా నటిస్తున్నారని, ఆయన నటన ముందు ఫిల్మ్ స్టార్స్ కూడా పనికిరారని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ఓ ర్యాలిలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఒక్క అమెరికా డాలర్ మన 5 రూపాయలకు సమానం. ఇప్పుడు 130 పాక్ రూపాయలైంది. కానీ షరీఫ్ కుటుంబం మాత్రం దేశాన్ని దోచుకుని విదేశాలకు వెళ్లిపోయిందని’ పేర్కొన్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు మెరుగు పడాలంటే పీటీఐకి ఓట్లేసి విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ఎన్నికల నేపథ్యంలో తాను అమాయకుడినని తెలియ జెప్పేందుకు నవాజ్ షరీఫ్ చాలా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదియాలా జైల్లో తమను దోమలు కుడుతున్నాయని షరీఫ్, ఆయన కూతురు మర్యమ్ చెబుతున్నారని.. ఏసీల సౌకర్యం లేకపోతే వారు ఉండలేరని ఈ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. వారిద్దరూ చాలా బాగా నటిస్తున్నారని, సినిమాల్లో సైతం మనం ఇలాంటి నటనను చూడలేమన్నారు. పాకిస్తాన్‌లోని ఇతర ప్రావిన్స్‌ల కంటే కూడా కైబర్ కనుమలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. కైబర్‌లో అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని, 9 వేల మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. 50 కొత్త కాలేజీలు, 10 యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణలు రావడం, పీఎంఎల్–ఎన్ నేత షరీఫ్ జైల్లో ఉండటం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
పాక్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఈ నెల 25వ తేదీన జరగనున్న నేషనల్ అసెంబ్లీతోపాటు, 4 ప్రొవిన్షియల్ అసెంబ్లీల ఎన్నికల ప్రచార పర్వం సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఎన్నికల్లో కరుడుగట్టిన మత గురువులు సహా 12,570 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పెద్దగా ఉత్సాహం చూపని ఓటర్లు, ఉద్రిక్త వాతావరణం మధ్య చివరి నిమిషం వరకు అభ్యర్ధులు సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నేషనల్ అసెంబ్లీ స్థానాలకు 3,675 మంది ప్రొవిన్షియల్ పదవులకు 8,895 మంది పోటీ పడుతున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్–ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉండటం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత అసిఫ్ అలీ జర్దారీపై పలు ఆరోపణల నేపథ్యంలో అనిశ్చిత వాతావరణం కొనసాగుతోంది. -
పీఠముడి
వారాలు గడుస్తున్నాఎదురు తెన్నులు పదవీ ప్రమాణం చేయని జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అధికారపగ్గాలు దీర్ఘకాలంగా ప్రత్యేక పాలనలో మండల, జిల్లా పరిషత్‌లు జిల్లా,మండలపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురైంది. వారాలు గడుస్తున్నా ‘పీఠ’ముడి వీడడం లేదు. గెలిచిన అభ్యర్థులు పాలన పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. ఎన్నికలు ముగిసి 50 రోజులైనా జిల్లాలో ఇంకా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. కొత్తపాలక వర్గాలు కొలువు తీరకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన దాదాపు రూ.13 కోట్లు వరకు నిధులు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో విజయం సాధించినా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు అధికార దర్పం వెలగబెట్టలేని దుస్థితి. పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సుధీర్ఘకాలం తరువాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీకాలం 2011 జూన్‌తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగింది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు, జీతాలు, చెల్లింపులు, అత్యవసర పనులు, సాధారణ పరిపాలన మినహా ప్రజాహిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారం వంటివి అమలుకు నోచుకోలేదు. మండలాల్లో అధికారులు, సిబ్బంది కొరత విపరీతంగా ఉండడంతో ప్రధాన సమస్యలపై కూడా వారు దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు కూడా నిధుల కొరతతో అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో అనేక సమస్యలు పరిష్కారానికి కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి. అన్నింటికీ నిరీక్షణే : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో గత నెలలో రెండు దశలలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల 13న జెడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి మూడు వారాలైనా ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితిలో ఉన్నారు. రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకరాలకు జాప్యం జరుగుతోంది. జూన్ 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణ స్వీకారం ముగిశాక వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికల్లో గెలిచినా.. ఈ దఫా అధికారాన్ని చేపట్టడానికి వారాలు వేచి ఉండాల్సి వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. కొత్త పాలకవర్గాలపై ఆశలు కొత్త పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందోనని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్‌కు 13వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రూ.కోట్లు రానున్నాయి. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు, రోడ్డులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద రూ.1.5 కోట్లు వరకు వస్తుంది. ఇందులో 50 శాతం నిధులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను వినియోగించే అవకాశముంటుంది. వీటితో పాటు జనరల్ ఫండ్ కింద ప్రభుత్వం నుంచి రూ.5 నుంచి రూ.6 కోట్లు వరకు విడుదలవుతుంది. ఈ నిధులు వస్తే జిల్లాలో రోడ్లు కల్పనతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడి, మంచినీటి ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారు. -
పోటాపోటీగా ఫైనల్స్
హన్మకొండ, న్యూస్‌లైన్ : లీగ్ మ్యాచ్ల్లా సాగిన గ్రామపంచాయతీ, సహకార ఎన్నికలు ఎప్పుడో ముగిశారుు. క్వార్టర్స్, సెమీస్‌లా మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికలు సైతం ఇటీవలే అయ్యూరుు. మిగిలింది ఫైనల్ మ్యాచే. రాజకీయ జట్ల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. సార్వత్రిక సమరంలో అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నారుు. తమదైన పద్ధతుల్లో ప్రచారంలో కదం తొక్కుతున్నారుు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గత నెల ఐదో తేదీన సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోరుకు ముందుగా మునిసిపల్... ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు వచ్చిపడ్డారుు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో పోరు సాగింది. అనంతరం ఓట్ల లెక్కింపుపై సందిగ్ధత... కోర్టు తీర్పుల నేపథ్యంలో గ్రామాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ ఎన్నికలపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ రసవత్తరంగా సాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తంతు ఈ సారి చప్పచప్పగా మొదలైంది. అరుుతే ప్రధాన పార్టీల అభ్యర్థుల టికెట్ల ఖరారు... జంప్‌జిలానీలతో కొంత ఊపు వచ్చినప్పటికీ అంతంతమాత్రమే. స్థానిక సందడి ముగియడంతో ఇప్పుడు పట్టణాలు, పల్లెలన్నీ సార్వత్రిక పోరుపైనే చర్చిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగినవి కావడంతో... గ్రామాల వారీగా పోలింగ్ సరళి... అక్కడి ఓటర్ల మనోగతం... పార్టీల వారీగా మద్దతుపై పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఆయూ గ్రామాలు, మండలాలకు చెం దిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా బలాబలాలపై లెక్కలేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు అంచనా వేస్తున్న ఓట్లను బట్టి తమకు పోలయ్యే వాటిని అంచనా వేస్తున్నారు. ఈ సారి స్థానిక పోరులో ఊహించిన దాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ జరగడంతో తమ ఓటు బ్యాంకు ను లెక్కకడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి వెచ్చించిన నిధులు.. సార్వత్రిక ఎన్నికలకు చేయాల్సిన ఖర్చులపై లెక్కలేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారంతో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఆయూ చోట్ల ఓటింగ్ సరళిపై దృష్టి కేంద్రీకరిం చారు. క్రాస్‌ఓటింగ్ ప్రాంతాల్లో పార్టీల వారీగా బలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యూరు. సమావేశాలు... ప్రచారాలు సార్వత్రిక ఎన్నికలకు ప్రచార సమయం 16 రోజులే మిగిలి ఉండడంతో పార్టీల అభ్యర్థులందరూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున మైకులు మొత్తుకుం టున్నాయి. కళాకారుల ఆటపాటలు మొదల య్యాయి. మండలాలవారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రతి సెగ్మెంట్‌కూ తమ పార్టీ అగ్రనేతలతో ప్రచారం చేయించుకునేందుకు అభ్యర్థులు ఎత్తుగడ వేస్తున్నారు. జిల్లా లో ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పాలకుర్తి సెగ్మెంట్లో ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజాగర్జన సమావేశం నిర్వహించారు. మరోమారు కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు, టీఆర్ఎస్ సీనియర్లను జిల్లా లో ప్రచారానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
ఉద్రిక్తతల మధ్య మలి విడత పోలింగ్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో శుక్రవారం రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పలు చోట్ల ఘర్షణలు, ఓటర్ల నిరసనలు, పోలీసుల లాఠీచార్జీలు తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. గరివిడి మండలం తోండ్రంగిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మెరకముడిదాం మండలం రామాయవలస, గాతాడలలో ఓట్లు తారుమారవడంతో పోలింగ్ నిలిచిపోయింది. 19 జెడ్పీటీసీ, 317 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగగా, మొదట్లో మందకొడిగా సాగిన ఓటింగ్ తరువాత పుంజుకుంది. మొత్తం 8,05,532 ఓట్లకు గాను జెడ్పీటీసీ అభ్యర్థులకు 6,94,204, ఎంపీటీసీలకు 6,91,844ఓట్లు పోలయ్యాయి. జెడ్పీటీసీలకు 86.43 శాతం, ఎంపీటీసీకు 86.35 పోలింగ్ శాతం నమోదైంది. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి బ్యాలెట్ల పెట్టెలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. 2,538 బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఎస్.కోట మండలం రేవళ్లపాలెంలో చిన్న సందులో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 18 గిరిజన గ్రామాలకు చెందిన నాలుగువేల మంది ఓటర్లు ఇక్కడ సందులోనే ఓటు వేయాల్సి వచ్చింది. గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో పోలీసులు జులుం ప్రదర్శించడంతో ఆగ్రహించిన స్థానికులు పోలింగ్‌ను గంటపాటు నిలిపి వేశారు. విజయనగరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ కాంతిలాల్ దండే పర్యటించి పోలింగ్ తీరును గమనించారు. ఎక్కడయినా చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కరించారు. డివిజన్లోని ధర్మవరం, అలమండ, గంట్యాడ, కొత్తవలస, బొద్దాం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఆయన పర్యటించారు. -
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
-
‘ప్రాదేశిక’ ప్రచారం సమాప్తం
374 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీలకు ఎన్నికలు రేపు ఎంపీటీసీ బరిలో 969 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ స్థానాల్లో వంద మంది అభ్యర్థుల పోటీ ఒంగోలు, న్యూస్‌లైన్: మలిదశ ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడింది. ఆరు నియోజకవర్గాల్లోని 9,42,722 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 28 మండలాల్లో ఎన్నికలు: రెండో దశ ప్రాదేశిక ఎన్నికలు ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కనిగిరి, కందుకూరు, దర్శి నియోజకవర్గాల్లో 28 మండలాల్లోని 381 ఎంపీటీసీ స్థానాలకు జరగాల్సి ఉంది. వీటిలో దర్శి -2, క్రిస్టియన్‌పాలెం, తాళ్లూరు మండలం మల్కాపురం మండల ప్రాదేశికాలు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా కనిగిరి మండలం చాకిరాలు, పీసీపల్లి మండలం గుదేవారిపాలెం స్థానాలు టీడీపీ ఖాతాకు జమయ్యాయి. ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెం, లింగసముద్రం మండలం ముత్యాలపాడు, తాళ్లూరు మండలం మన్నేపల్లి ఎంపీటీసీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యాయి. ఏడు ప్రాదేశికాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 969 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో బీఎస్పీ 5, బీజేపీ 8, సీపీఐ 11, సీపీఎం 16, కాంగ్రెస్ 35, వైఎస్సార్ సీపీ 363, టీడీపీ 363, లోక్‌సత్తా 2, స్వతంత్రులు 166 మంది పోటీలో ఉన్నారు. రెండో దశలో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఎస్పీ 5, బీజేపీ 2, సీపీఐ 3, సీపీఎం 2, కాంగ్రెస్ 7, వైఎస్సార్ సీపీ 27, టీడీపీ 28, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 25 మంది వెరసి మొత్తం వంద మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, చైర్మన్ అభ్యర్థి నూకసాని బాలాజీ జిల్లా అంతటా ప్రచారం నిర్వహించి అభ్యర్థులను, కార్యకర్తలను ఉత్సాహపరుస్తుంటే టీడీపీ నేతలు మాత్రం టికెట్ల వేటలో రాజధానిలో మకాం వేశారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాసక్తత కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు 6,855 మంది సిబ్బంది: రెండో దశ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 6,855 మంది సిబ్బందిని జిల్లా అధికారులు వినియోగిస్తున్నారు. 1270 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. 1,395 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,395 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 4,065 మంది ఇతర పోలింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం గురువారం ఉదయం 7 గంటలకల్లా సంబంధిత మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా అదనపు ఎన్నికల అధికారి ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర మెటీరియల్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒంగోలు డివిజన్లో 7 మండలాల్లో, కందుకూరు డివిజన్లోని 21 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
స్వల్ప ఘర్షణలు
సాక్షి, ఒంగోలు: తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లోని 28 జెడ్పీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 395 ఎంపీటీసీ స్థానాలకు 1056 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 1327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతగా మొత్తం 10,21,189 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా..పోలింగ్ మాత్రం మందకొడిగా సాగింది. కొన్నిచోట్ల ఓటర్లు పోలింగ్‌కు హాజరు కాకపోవడంతో.. ఎన్నికల అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లి ఓటర్లను రప్పించాల్సి వచ్చింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 496 ఓట్లకుగాను.. కేవలం 126 మంది మాత్రమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఉదయం ఏడు నుంచి 12 గంటల వరకు.. ఆ తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలకు మించి కూడా ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరి ఓట్లు వేశారు. అసౌకర్యాల నడుమ పోలింగ్.. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి, వైద్యసహాయ సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా, అద్దంకి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళా ఓటరు ఓటేయడానికి వచ్చి క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోయింది. చీరాల, పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల ఏర్పాటు కూడా ఓటర్లకు ఇబ్బందిగా మారింది. కేంద్రం లోపలికి, బయటకు వచ్చేందుకు ఒకే మార్గం పెట్టడంతో మహిళా ఓటర్లు ఇక్కట్లు పడ్డారు. చీరాలలో పోలింగ్ కేంద్రాల వద్దనే స్వతంత్ర అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు పలువురు అధికారులకు ఫిర్యాదులందించారు. కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ ఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి.. పోలింగ్‌ను పరిశీలించారు. స్వల్పఘర్షణలు..లాఠీచార్జి తొలి ప్రాదేశికపోరుపై ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుండటంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వివాదాలే ఇరువర్గాల ఘర్షణకు దారితీశాయి. పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం, వీరన్నపాలెం, నూతలపాడు గ్రామాల్లో ఓటర్లను తరలించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్పఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం ఏల్చూరులో పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తనయుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరకొండపాలెంలో పోలింగ్ ఏజెంట్ల నడుమ స్వల్ప వివాదం నడిచింది. బల్లికురవ మండలం పెదఅంబటిపూడిలో రాజకీయ పార్టీలు వేసిన టెంట్లను తొలగించే క్రమంలో.. అడ్డుకోబోయిన కార్యకర్తలపై డ్యూటీ సీఐ లాఠీచార్జి చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు మండలం, చాట్లమర అగ్రహారంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఓట్లను బహిరంగంగా చూపించి వేయాలని దళిత ఓటర్లను టీడీపీ ఏజెంట్ హెచ్చరించడం వివాదానికి దారితీసింది. మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం నాయుడుపేటలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తగా.. వైస్సార్ సీపీ కార్యకర్త వాకా రమణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ అక్కడ ప్రత్యేకంగా కూర్చొని ఎన్నికల కేంద్రం వద్ద పరిశీలించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో పోలింగ్‌బూత్‌లకు నంబర్లు మార్చడంతో .. ఓటర్లు ఏబూత్లోకి ఓటేయాలనే తికమకతో అధికారుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. దీంతో అక్కడ 2 గంటలపాటు పోలింగ్ నిలిచిపోయింది. కొమరోలు నియోజకవర్గం అల్లీనగరం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్ ఫారాలు లేకపోవడంతో. ఒక గంటపాటు పోలింగ్ ఆగింది. కొమరోలు మండలంలోని తాటిచర్ల గ్రామంలో పోలింగ్ అధికారి వృద్ధుల ఓట్లను సైకిల్ గుర్తుపై వేయాలని సూచిస్తున్నారన్న సమాచారం మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలింగ్ అధికారిని ప్రశ్నించేందుకు వెళుతున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. -
తొలి విడత పోరులో పోలింగ్ 81.83 %
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తొలివిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంలో ఓటర్లను ప్రలోభపెట్టటానికి విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ ప్రజలకు దొరికిపోయారు. తొలివిడతలో 24 జెడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 81.83శాతం పోలింగ్ నమోదైంది. కాశీపూర్ గ్రామంలోని 43వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించింది. బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేరు తప్పుగా ముద్రించడమే రీపోలింగ్‌కు కారణం. ఈనెల 11న రీపోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి స్మితాసబర్వాల్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు ఉండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు పది మందికి పైగా వడదెబ్బ బారినపడ్డారు. ఇదిలాఉండగా కంగ్టి మండలం గర్డేగాం గ్రామం రక్తమోడింది. దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. మునిపెల్లి మండలం తాడిపల్లి గ్రామంలో ఎస్ఐ నారాయణరెడ్డి ఓవర్ యాక్షన్ తో కొంతమంది మహిళా ఓటర్లు భయపడి ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు. చెర్లగూడెం ఎంపీటీసీ పరిధిలోని కాశీపూర్‌లో బ్యాలెట్ పత్రాలపై పేర్లు తప్పుగా ముద్రిం చారు. స్థానిక అభ్యర్థుల పేర్లకు బదులుగా పోతిరెడ్డిపల్లికి చెందిన అభ్యర్థులు పేర్లు ముద్రించారు. 187 ఓట్లు పడిన తరువాత అధికారులు గుర్తించారు. దీంతో 43 నంబర్ బూత్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.కంగ్టి మండలం గరిడేగాంలో ఓ వ్యక్తి ఓటు వేసే విషయంలోకాంగ్రెస్,టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకోవడంతో దాదాపు నలుగురు గాయపడ్డారు. మునిపల్లి మండలం తాడిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎస్ఐ నారాయణ రెడ్డి ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఆయన పోలింగ్‌కేంద్రంలో కూర్చొని వచ్చిపోయే ఓటర్లను చిత్రీకరిస్తుండటంతో ఓటర్లు ఓటు వేయడానికి బయడ్డారు. కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు. అంతకు ముందు రాత్రే పోలీసులపై తాడిపల్లి గ్రామస్థులు తిరగబడిన విషయం తెలిసిందే. ఎస్ఐ తీరుపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండపాక మండల కేంద్రంలో దమ్మక్కపల్లిలో శనివారం రాత్రి టీఆర్ఎస్కు చెందిన ఓ కార్యకర్త డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ వాళ్లు పట్టుకున్నారు. తిరిగి అదే వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్ద కనిపించడంతో కాంగ్రెస్ వాళ్లు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మిరుదొడ్డి మండలం మోతెలో శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్ అభ్యర్థి పంచిన మద్యం, డబ్బు గొడవకు దారి తీసింది. ఆదివారం కొంతమంది మహిళలు కాంగ్రెస్ అభ్యర్ధిపై గొడవకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో అదనపు పోలీసులు బలగాలను మోహరించారు. మిరుదొడ్డిలో ఓటు వేసేందుకు వచ్చిన నలుగురు ఓటర్లు.. ఎండవేడిని తట్టుకోలేక అస్వస్థకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.జిల్లాలో మొత్తం 1,149 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్‌క్యామ్ పెట్టి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని కలెక్టర్ చెప్పారు. కానీ 300 పోలింగ్ కేంద్రాల్లోనే వెబ్ క్యామ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఏం జరిగిందో తెలియకుండా పోయింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ఉండటం వల్ల ఎన్నికల విధులకు వారు రాలేకపోయారని, అందుకోసమే అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్ సిస్టమ్ అమలు చేయలేకపోయామని అధికారులు చెప్పడం గమనార్హం. -
ప్రాదేశిక ఎన్నికల్లో మాదే విజయం
పరిగి, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ ఊహించని విధంగా ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పరిగి వల్లభనగర్‌కు చెందిన యువజన సంఘాల నాయకులు యూత్ నాయకుడు పల్లెల ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు జాఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు హర్షద్ టీఆర్ఎస్లో చేరాడు. సాయంత్రం నిర్వహించిన మరో కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నసీరొద్దీన్ మరికొందరు యువకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. యూత్ నాయకులు జగన్, వెంకటేష్, వీరేష్, శ్రీను, రాజోల్, రమేష్, సన్ని, కృష్ణ, ప్రతాఫ్, నవీన్, మల్లేశ్, శ్రీకాంత్, కిరణ్ తదితర వంద మందికి పైగా యువకులు చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరటంతో టీఆర్ఎస్ పార్టీ మరింత పటిష్టం అవుతుందన్నారు. అందరం కలిసి కట్టుగా పార్టీని ప్రగతి పథంలో నడిపిద్దామని ఆయన తెలిపారు. అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో.. ఇటు సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తాచాటుతుం దని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్, మీర్‌మహమూద్, ప్రవీణ్‌రెడ్డి, ఎర్రగడ్డపల్లి గోపాల్, బషీర్, అనూష, నయీం, హైమద్ఖురేషి, పాండు, అక్రం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ఓటర్లను కోరారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు రాజన్న పథకాలు చేరాయని వివరించారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు లక్షలాది మందికి మేలు చేశాయన్నారు. రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గడానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కారణమన్నారు. మహానేత పథకాలను యథాతథంగా ప్రజలకు మరోసారి అందించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అందోల్ మండలం నేరేడుగుంట ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మొగులయ్యను కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, లేనిపోని కేసులు పెడతామని బె దిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని కానీ ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడే వారికి ఓటర్లు పట్టం కడతారని ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఆర్ఓ ఎల్లయ్య, యువజన సంఘం నాయకులు శివశంకర్ పాటిల్, అశోక్‌గౌడ్, జగదీష్, సురేష్, సుశాంత్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడే తొలి విడత ప్రాదేశిక పోరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలివిడత ‘ప్రాదేశిక’ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం మల్కాజిగిరి, రాజేంద్రనగర్, వికారాబాద్ డివిజన్లలోని 303 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం 1,110 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 16,43,681 మంది ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. ఇందు లో 8,45,218 మంది పురుషులు, 7, 98,463 మంది మహిళలున్నారు. ఈ మండలాల్లోనే.. తొలివిడతలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లో ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. బంట్వారం, బషీరాబాద్, ధారూరు, ఘట్కేసర్, కీసర, మర్పల్లి, మేడ్చల్, మోమీన్‌పేట, పెద్దేముల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట, శంషాబాద్, తాండూరు, వికారాబాద్, యాలాల మండలాల్లో ఓటింగ్‌కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో సహా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలివిడత పోలింగ్ ప్రక్రియలో 5,550 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. మరో పది శాతం మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు. జిల్లాలో 215 సున్నితమైన, 165 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బరిలో 1,291 మంది అభ్యర్థులు ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలివిడతలో జరుగుతున్న మండలాల్లో మొత్తం 1,291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 303 ఎంపీటీసీ స్థానాలకు 1,211 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 16 జెడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వికారాబాద్ డివిజన్లోని 9 జెడ్పీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉండగా.. రాజేంద్రనగర్ డివిజన్లోని రెండు స్థానాలకు 12 మంది బరిలో ఉన్నారు. మల్కాజిగిరి డివిజన్లోని ఐదు స్థానాలకు 32 మంది పోటీ పడుతున్నారు. నెల తర్వాతే ఫలితాలు ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఇప్పట్లో వెల్లడికావు. ఫలితాలు ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని పేర్కొంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. ఫలితాలను సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఎన్నికలు నిర్వహించడంతో సరిపెట్టనున్న యంత్రాంగం.. ఫలితాలను మాత్రం వచ్చేనెలలో ప్రకటించనుంది. -
బ్యాలెట్ బాక్సులకు భద్రత కరువు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులకు భద్రత కరువయ్యే పరిస్థితి నెలకొంది. బాక్సులను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చే బాధ్యతను ఈసారి జోనల్ అధికారులకు అప్పగించటమే దీనికి కారణం. గతంలో బ్యాలెట్ బాక్సులను ఆయా పోలింగ్ కేంద్రాల అధికారులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి అప్పగించేవారు. రూట్ ఆఫీసర్లు వరుసగా తమ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లి పోలింగ్ అధికారులను తమ వాహనాల్లో ఎక్కించుకొని బ్యాలెట్ బాక్సులు జిల్లా కేంద్రానికి భద్రంగా వచ్చేలా చర్యలు తీసుకునేవారు. ఈ దఫా అందుకు విరుద్ధంగా జోనల్ అధికారులకు బ్యాలెట్ బాక్సుల తరలింపు బాధ్యతలను అప్పగించారు. రూట్, జోనల్ అధికారులు ఓ వాహనంలో పోలింగ్ కేంద్రాలకు వెల్లి పీవోల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకుంటారు. వెంటనే పీవోలు అక్కడే రిలీవ్ అయ్యే అవకాశం కల్పించారు. దీనివల్ల పీవోలపై భారం తగ్గింది. ఇదివరలో బాక్సులను జిల్లా కేంద్రానికి తెచ్చి.. వాటిని సంబంధిత అధికారులకు అప్పగించేవరకూ వీరిదే బాధ్యత. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికీ ఇదే విధానం అమలు చేస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో జోనల్ అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఓ జోనల్ అధికారి పరిధిలో 10 నుంచి 15 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఒక్కో కేంద్రంలో ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సు ఉంటుంది. ఈ లెక్కన 20 నుంచి 30 బ్యాలెట్ బాక్సులను జిల్లా కేంద్రానికి జోనల్ అధికారి జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. గతంలో పీవోలు వారివారి బ్యాలెట్ బాక్సులను జాగ్రత్తగా పట్టుకొని తీసుకువచ్చేవారు. ఒక్కొక్కరికి రెండు బాక్సులే ఉండడం వల్ల ఇది సాధ్యపడేది. ఇప్పుడు ఒకే వ్యక్తి దాదాపు 30 బాక్సులను తీసుకురావాలి. బాక్సులపై అతికించే సంతకాలతో కూడిన పేపర్లు కానీ, సీళ్లు కానీ ఊడితే తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిబంధన మార్చడం పట్ల జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. -
మహిళలే ‘కీ’లకం
నల్లగొండ, న్యూస్‌లైన్: ఈనెల 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వారు ఎటు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారనుంది. పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తిని చూస్తే ఈ విషయం అవగతమవుతోంది. ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 2 0,77, 581 మంది ఉండగా వీరిలో పురుషులు 10,45,068, మహిళలు 10,32,493 మంది ఉన్నారు. ఇతరులు 20 మంది ఉన్నారు. అత్యధికం.. అత్యల్పం జిల్లాలోని 59 మండలాలకుగాను మేళ్లచెర్వు మండలంలో అత్యధికంగా 54,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చౌటుప్పల్(49,605), గరిడేపల్లి(38,576), నేరేడుచర్ల(48,978) మండలాలు ఉన్నాయి. అత్యల్పంగా హుజూర్నగర్ మండలంలో 18,513, తుర్కపల్లిలో 23,505 మంది ఉన్నారు. 18 మండలాల్లో ప్రభావితం జిల్లాలో 18 మండలాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా మండలాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ అయిన వాటితో పాటు జనరల్ మహిళ, జనరల్ స్థానాలు ఉన్నాయి. జనరల్ మహిళల స్థానాల్లో ప్రధాన పార్టీల నాయకుల సతీమణులు ఎంపీపీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్ల మద్దతు పొందితే తప్ప.. లేకుంటే వారి గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది. జెడ్పీటీసీ స్థానాల్లో.. మేళ్లచెర్వు, మఠంపల్లి, నాంపల్లి, పీఏ పల్లి జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు, చిలుకూరు ఎస్టీ జనరల్, గరిడేపల్లి, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 9 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. అయితే జనరల్ స్థానాల్లో పురుషులు పోటీ చేస్తుండటంతో ఆ మండలాల్లో మహిళా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపీపీ స్థానాల్లో పోటాపోటీ చిలుకూరు ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వ్ కాగా, కేతేపల్లి, మునగాల, నడిగూడెం, నాంపల్లి, వేములపల్లి స్థానాలు జనరల్ మహిళ, మేళ్లచెర్వు, పెన్‌పహాడ్ ఎస్టీ జనరల్, సూర్యాపేట, పీఏపల్లి బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 8 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. ఎస్టీ, బీసీ జనరల్ స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో మహిళా అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగానే ఉండనుంది. వీరిలో మహిళా ఓటర్లను ఆకర్షించిన వారికే గెలుపు సునాయసం కానుంది. -
పటిష్ట నిఘా...
సాక్షి, నల్లగొండ: రెండు విడతలుగా జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మొదటి విడతలో 33మండలాలు, రెండో విడతలో 26మండలాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. అన్ని రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు సోదాలు చేస్తున్నాం. 2,739 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులను మోహరిస్తాం. మొదటి విడతలో సున్నిత 242, అతి సున్నిత 130 ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సున్నిత ప్రాంతాల్లో నలుగురు, అతి సున్నిత ప్రాంతాల్లో ఐదుగురు పోలీసులు విధులు నిర్వహిస్తారు. సాధారణ ప్రాంతాల్లో ఇద్దరు ఉంటారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాల్లో కొన్ని రోజుల క్రితమే పికెట్లు ఏర్పాట్లు చేశాం. అంతేగాక ఈ సమస్యాత్మక ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించాం. ఇక్కడ మోటార్ సైకిళ్లపై పోలీసులు తిరుగుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటారు. రేయింబవళ్లు వీరు విధుల్లో నిమగ్నమై ఉంటారు. 4వేల మందితో బందోబస్తు.... మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు మొత్తం 4వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,500మంది పోలీసులు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 11 ఏపీఎస్పీ ప్లాటూన్లను రప్పిస్తాం. అవసరమైతే ఇతర యూని ఫాం ఉద్యోగులను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. వీలైతే మాజీ సైనికులను వారి ఆసక్తిని బట్టి ఆహ్వానిస్తాం. విస్తృతంగా సోదాలు... ప్రతి నియోజకవర్గానికి ఒక డీఎస్పీని.. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ను కేటాయించి పర్యవేక్షిస్తున్నాం. క్షేత్రస్థాయిలో రూట్ మొబైల్ వాహనాలు తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లూ తని ఖీలు చేపడతాయి. దీనికితోడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియోజకవర్గస్థాయిలో డీఎస్పీ పరిధిలో ఉం టాయి. ప్రతి నియోజకవర్గంలో 3బృందాలు విడతల వారీగా తనిఖీలు చేస్తాయి. వీటి ప్రధాన విధి.. డబ్బు, మద్యం రవాణాను అడ్డుకోవడం. భారీగా నగదు పట్టివేత... పోలీసులు విస్తృతంగా తనిఖీ చేయడంతో పెద్ద ఎత్తున నగదు, మద్యం పట్టుబడింది. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలూ లేకుండా తరలిస్తున్న రూ. 3.86 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖాధికారులకు అప్పగించాం. 605 కేసుల్లో నేరచరిత్ర, గతంలో విధ్వంసాలకు పాల్పడిన 6166 మందిని బైండోవర్ చేశాం. నాటుసారా దాదాపు ఏడువేల లీటర్లు, రెండు వేలకుపైగా బీర్లు, ఆరు వేల క్వార్టర్లు, 443 హాఫ్ మద్యం బాటిళ్లు, 345 ఫుల్ బాటిళ్లు, 66,500 కిలోల నల్లబెల్లం, 1500 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నాం. 21 వాహనాలను సీజ్ చేశాం. లెసైన్స్ కలిగిన 790 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. నిష్పక్షపాతంగా.... అధికార పార్టీ, విపక్ష పార్టీ నేతలన్న పక్షపాతం మాకు లేదు. మాకు అందరూ సమానమే. రాగద్వేషాలకు అతీతంగా, పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నాం. గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం మాపై ఎటువంటి ఒత్తిడీ లేదు. ఇప్పుడు స్వేచ్ఛగా మా విధులు నిర్వర్తించుకోగలుతున్నాం. సస్పెన్షన్ తప్పదు.... అభ్యర్థులు, పార్టీల నాయకుల నుంచి పోలీసులు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకపోతే రాతపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ ఫిర్యాదులు అందితే పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. డబ్బులు తీసుకున్నారని తేలితే ఆ పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. రెండో ఆలోచన లేకుండా సస్పెన్షన్ వేటేస్తాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే పోలీసులకు వివరించాం. ప్రజలూ సమాచారం ఇవ్వొచ్చు... డబ్బు, మద్యం పంపిణీ, ఇతర ప్రలోభాలకు గురిచేసినట్లు తెలిస్తే వెంటనే రంగంలోకి దిగుతున్నాం. ఇంటింటికీ తిరిగి సోదాలు చేయడం అసాధ్యం. ప్రజల వద్ద సమాచారం ఉంటే 100 నంబర్‌కు డయల్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. -
బ్యాలెట్ బాక్సులొచ్చేశాయ్!
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: cఆయా కార్యాలయాల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది వాటిని పరిశీలించారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కోసం మూడు రకాల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఒక్కో స్థానంలో ఓట్ల సంఖ్యను బట్టి బాక్సుల ను కేటాయిస్తున్నారు. వెయ్యి ఓట్లు కంటే అధికంగా ఉన్న కేంద్రానికి రెండు పెద్ద బాక్సులు, వెయ్యి లోపు ఓట్లు, ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండే కేంద్రానికి ఒక పెద్దది, మధ్య తరహా బాక్సులు, అంతకంటే తక్కువ ఓట్లు ఉన్న స్థానాల్లో చిన్న బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక పెద్ద బాక్సులో 1200 నుంచి 1400 వరకు ఓట్లు వేసే అవకాశముంటుంది. ఈ ఎన్నికలకు మొత్తంగా 2300 పెద్దవి, 1800 మధ్యతరహావి, 1200 చిన్న బాక్సులను అందుబాటులో ఉంచారు. వాటన్నింటినీ ఇప్పటికే పరిశీలించి భద్రపరిచారు. వీటితో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంది. జెడ్పీటీసీలకు సంబంధించిన తెల్ల రంగులోను, ఎంపీటీసీలవి గులాబీ రంగులోను ముద్రించారు. అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమం అనుసరించి గుర్తులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ మండల కేంద్రాల్లో మంగళవారం నిశితంగా పరిశీలించారు. వాటితోపాటు బ్యాలెట్లపై ఉన్న సీరియల్ నంబర్లను సైతం పరిశీలించారు. సవ్యంగా లేని బ్యాలెట్ పత్రాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 16,50,329 మంది ఓటర్లు ఉండగా ఒక్కొక్కరు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి రెండేసి ఓట్లు వేయనున్నారు. దీని ప్రకారం బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 10 శాతం రిజర్వ్‌తో పాటు దాదాపుగా 36.5 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఎన్నికలు ఈ నెల 6,11 తేదీల్లో జరగనున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రాలకు. అక్కడే మే 7వ తేదీ తరువాత లెక్కింపును చేపట్టనున్నారు. -
రెండో విడత.. అభ్యర్థులకు కలత
5 రోజులపాటు అదనపు వ్యయం ఒక్కో స్థానానికి రూ.2.5 కోట్లని అంచనా టీడీపీని వెంటాడుతున్న నైరాశ్యం ఏంచేయాలో పాలుపోని పరిస్థితి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికలు అభ్యర్థులకు సంకటంగా మారాయి. తొలి విడత 22 జెట్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న జరగనుండగా అయిదు రోజులు తరువాత రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 11న రెండో విడత కింద 17 జెట్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ అయిదు రోజులు ప్రచారాలకు సమయముందన్న ఆనందం కంటే.. అధిక వ్యయం రెండో దశ అభ్యర్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని భావించిన పార్టీలు సర్వశక్తులు ఒడ్డయినా ఇందులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా గత పదేళ్లుగా అధికారం కోసం కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవోలా మారాయి. ఒకవైపు పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, ప్రతీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఎలాగైనా ఇందులో విజయం సాధించడానికి పార్టీలు కోట్లకు కోట్లను వెదజల్లుతున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఒక్కో స్థానానికి రెండు నుంచి రెండున్న కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. అభ్యర్థిత్వాలు ఖరారు కాని పార్టీల్లో ఆశావహులు తమ సీట్లను పదిలం చేసుకోడానికి మండలాల్లో విపరీతంగా డబ్బును కుమ్మరిస్తున్నారు. తొలి దశలో జరిగే స్థానాలకు ఒక్కో దానికి రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. రెండో దశ గుబులు తొలి ఎన్నికలకు ఇంకా అయిదు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ అయిదు రోజుల్లోనే అభ్యర్థులకు కోట్లు ఖర్చుకానున్నాయి. రెండు దశ ఎన్నికలకు 10 రోజులు సమయముంది. దీంతో ఈ దశలో జరిగే 17 స్థానాల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తొలి దశ ఎన్నికల తరువాత అప్పటి ట్రెండ్స్‌కు అనుగుణంగా అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అదనపు సమయంలో అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, కానుకలు సమర్పణతో పాటు, మందు, విందులకు చేతి చమురు అధనంగా వదిలించుకోవాల్సిందేనని తర్జన భర్జన పడుతున్నారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టయినా ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రభావంతో సాధారణ ఎన్నికలకు వెళ్లాలనుకున్న పార్టీలకు సుప్రీం కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత చేపట్టనుండడంతో ఆ పార్టీలకు ఏం చేయాలో దిక్కుతీచకుండా పోయింది. సాధారణ ఎన్నికల్లోపు ప్రజలను తమవైపునకు తిప్పుకోడానికి ఇప్పటికే విజయం కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసిన పార్టీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. -
‘ప్రాదేశిక’ ఎన్నికలు ఇలా...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారను. జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ స్థానాలు, 640 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, రెండు జడ్పీటీసీ, 20 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడంలేదు. 44 జడ్పీటీసీలకు ఎన్నికలు, 620 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం రెవెన్యూ డివిజన్లలో 29 మండలాలు ఉన్నాయి. వాటిలో వేలేరుపాడు, కుక్కునూరు ప్రజలు తమను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఆ రెండు మండలాలు పోగా 27 మండలాలకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం డివిజన్లోని 17 మండలాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. 6న ఎన్నికలు జరిగే మండలాలు ఏప్రిల్ 6న కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్ల లో ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం రెవెన్యూ డివి జన్‌లోని బయ్యారం, చండ్రుగొండ, ఏన్కూర్, గార్ల, గుం డాల, జూలూరుపాడు, కామేపల్లి, కొత్తగూడెం, సింగరేణి(కారేపల్లి), టేకులపల్లి, ఇల్లెందు మండలాలకు, పాల్వంచ డివిజన్లోని అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపహడ్, దమ్మపేట, మణుగూ రు, ములకలపల్లి, పాల్వంచ, పినపాక, భద్రాచలం డివిజన్లోని భద్రాచలం, చర్ల, చింతూరు, దుమ్ముగూడెం, కూనవరం, వీఆర్‌పురం, వెంకటాపురం, వాజేడు మండలాలలో ఎన్నికలు నిర్వహిస్తారు. 11న ఖమ్మం డివిజన్లో.. ఖమ్మం రెవెన్యూ డివిజన్లో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. బోనకల్లు, చింతకాని, కల్లూరు, రఘునాధపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, కూసుమంచి, మధిర, ముదిగొండ, నేలకొండపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, తిరుమలాయపాలెం, వేంసూరు, వైరా, ఎర్రుపాలెం మండలాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్నాయి. -
నెల పైగా నిరీక్షణక్షణం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎవరైనా గుప్పెట మూసి.. ‘లోన ఏముందో చెప్పుకో చూద్దాం?’ అంటేనే ఒకింత ఉత్కంఠ మొదలవుతుంది. మూసిన ఆ గుప్పెట్లో ఉన్నది ఏమైనా.. దాని సైజు ‘గుప్పెడు మించదు’ అన్న ఆధారం మనకున్నా.. ‘ఫలానాదే ఉంది’ అని బల్లగుద్ది చెప్పలేం. అలాంటిది.. ఎన్నికల బరిలో దిగి, గెలుపు కోసం ప్రచారాన్ని హోరెత్తించి, శక్తియుక్తులన్నింటినీ ధారబోసి, సామదానభేద దండోపాయాలను ప్రయోగించి, కరెన్సీ నోట్లను.. కరపత్రాలకన్నా ధారాళంగా పంచి, మద్యాన్ని మినరల్ వాటర్ కన్నా ఉదారంగా పోయించి, ఓటరు దేవుళ్లను పోలింగ్ బూత్‌ల వరకూ నడిపించిన అభ్యర్థులు.. వారిచ్చింది వరమో, శాపమో తెలుసుకునేందుకు నెలకు పైగా ఆగాల్సి వస్తే ఇంకెంత ఉత్కంఠ నెలకొంటుంది? ఈసారి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన 2,947 మంది అభ్యర్థులకు ఆ పరిస్థితి అనివార్యమైంది. ప్రాదేశిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగబోతున్నా.. వాటి ఫలితాలను మే నెలలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. కోర్టు నెల పైగా నిరీక్షణక్షణం ఉత్తర్వులను ప్రధాన పార్టీలు స్వాగతిస్తున్నా.. ప్రాదేశిక అభ్యర్థులు మాత్రం ‘అమ్మో! గుండెలు ఉగ్గబట్టుకుని నెల పైగా ఎదురు చూడాలా? ఎలారా దేవుడా?’ అని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దేశమంతటా జరుగుతాయి కాబట్టి పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహిస్తారు. చివరి విడత పోలింగ్ పూర్తయ్యాకే మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పుడు కూడా అభ్యర్థులకు 15 రోజులకు మించి ఎదురు చూడాల్సిన అగత్యం ఉండదు. అయితే ఈసారి రాష్ర్టంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులు అంతకు రెట్టింపు కాలం నిరీక్షించక తప్పడం లేదు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయని, మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు తమ వారినే వరిస్తుందని, ఆనక మండల అధ్యక్ష పీఠాలపై కూర్చోవాలని ఆశలు పెంచుకున్న వారు న్యాయస్థానం ఆదేశంతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ బరిలో ఉన్నవారికి, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్నవారికి కూడా నరాలు తెగే ఉత్కంఠ తప్పదు. కాగా ఫలితాలు వాయిదా పడడంతో వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంపై పడదని రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. వారి నిరీక్షణ మరింత సుదీర్ఘం..! ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల తర్వాతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాతే వెలువరించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ఏప్రిల్ ఒకటిన విచారణకు రానుంది. నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేయటంతో ఆ ఎన్నికల బరిలో నిలిచినవారిలోనూ ఆందోళన మొదలైంది. ఈ నెల 30న పోలింగ్, ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు జరిగాక.. రెండు, మూడు రోజుల్లో చైర్మన్ లేదా మేయర్ ఎన్నికలు జరిగి ఆ పీఠాలపై కొలువు దీరగలమని ఆశపడ్డ వారు కూడా ‘నలభై రోజుల వరకూ నిరీక్షించాలా?’ అని అసహనానికి గురవుతున్నారు. జిల్లాలో మున్సిపల్ బరిలో తలపడుతున్న 806 మంది అభ్యర్థులు హైకోర్టు ఏమి తీర్పు చెపుతుందోనని బితుకుబితుకుమంటున్నారు. -
బరిలో నిలిచేదెవరో?
నేడు తేలనున్న లెక్కలు ఏకగ్రీవాల కోసం రాత్రి రాజకీయాలు... జోరుగా గ్రూపుల మంతనాలు బలమైన అభ్యర్థులను దింపేందుకు {పధాన పార్టీల వ్యూహం బి-ఫారం ఇవ్వకుంటే స్వతంత్రులే విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ముఖ చిత్రం నేడు స్పష్టంకానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగియనుండడంతో తుది పోరులో అభ్యర్థులు ఎవరన్నది కొలిక్కి రానుంది. నామినేషన్ల సమర్పించిన వారిలో ఇప్పటి వరకు కేవలం 11 మంది మాత్రమే ఉపసంహరించుకున్నారు. ఇంకా ఒక్కో స్థానానికి ఒక పార్టీ నుంచి ముగ్గురు నుంచి 10 మంది వరకు పోటీ ఉన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం అధికారులు వివిధ కారణాలతో ఆరింటిని తిరస్కరించారు. దీంతో ప్రస్తుతం 381 నామినేషన్లు ఉన్నాయి. శని,ఆదివారాల్లో భారీగా నామినేషన్ల ఉపసంహరణలు ఉంటాయని అధికారులు భావిం చారు. అయితే కేవలం ఐదుగురు మాత్రమే పోటీ నుంచి తప్పుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు యుగియనుండడంతో భారీగా ఉపసంహరణలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తగ్గనున్న నామినేషన్లు కొంత మంది అభ్యర్థులు నాలుగైదు సెట్లు నామినేషన్లు వేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో డెమ్మీలగానూ వేయించారు. ఎన్ని సెట్లు వేసినా అన్నింటిని ఒకటిగానే పరిగణిస్తారు. అలాగే అభ్యర్థుల డెమ్మీలు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఈ విధంగా 100 వరకు నామినేషన్లు సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావి స్తున్నారు. జోరందుకున్న బుజ్జగింపులు ఉపసంహరణ గడువు సమీపిస్తుండడంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయి. నయోనో, భయానో వారిని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీల అగ్రనాయకులు రంగంలోకి దిగారు. గడువు సమీపిస్తుండటంతో ప్రత్యర్థులకు దీటైన వారిని పోటీలో నిలిపేందుకు ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రెబల్స్ వల్ల నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో నాయకులు అభ్యర్థులకు తాయిళాల ఎరవేస్తూ వారిని సర్ధిచెప్పే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నారు. రాత్రిళ్లు అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి మంతనాలు జరుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం లోగా వీరిని ఓ దారికి తెచ్చుకోకుంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న భయం అన్ని పార్టీలను వెంటాడుతోంది. వామపక్ష పార్టీలు, బీజేపీ మినహా మిగిలిన అభ్యర్థులందరూ బి-ఫారం లేకుండానే పార్టీల పేరు మీద నామినేషన్లు వేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గం టలలోగా అభ్యర్థులు బి-ఫారంను అధికారులను సమర్పించాల్సి ఉంది. భి-ఫారం ఇవ్వనిపక్షంలో వారిని సత్వంత్రులుగానే పరిగణిస్తారు. ఇండిపెండెంట్లుగానే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. -
ప్రాదేశిక ఎన్నికలకు 100 గుర్తులు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయనున్న వారికి కేటాయించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం 100 గుర్తులను ప్రకటించింది. అందులో 17 గుర్తులు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినవి కాగా, మిగిలిన 83 గుర్తులు స్వతంత్రులకు కేటాయించనున్నారు. వరుస క్రమంలో జాతీయ పార్టీలైన బహుజన్ సమాజ్‌పార్టీ-ఏనుగు, బీజేపీ-కమలం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-కంకి కొడవలి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్టు)-సుత్తి కొడవలి నక్షత్రం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్-హస్తం, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ-గడియారం గుర్తులు కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన వాటిలో టీడీపీకి-సైకిల్, టీఆర్ఎస్-కారు గుర్తులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజం-రెండు ఆకులు, జనతాదళ్(సెక్యులర్)-వరి కంకులు తీసుకెళుతున్న మహిళా రైతు, సమాజ్‌వాది పార్టీ- మర్రిచెట్టు, జనతాదళ్(యునెటైడ్)-బాణం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ-సింహం, రాష్ట్రీయ లోక్‌దళ్-చేతిపంపు గుర్తులున్నాయి. ఇక ఎన్నికల సంఘం వద్ద గుర్తులు రిజర్వ్డ్ చేసుకున్న వాటిలో ఆల్ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్-గాలిపటం, లోక్‌సత్తా పార్టీ - ఈల, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ)- ఫ్యాను గుర్తులున్నాయి. పార్టీలుగా రిజిస్టరు చేసుకుని గుర్తులు లేని పార్టీలతోపాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థుల కోసం 83 గుర్తులను కేటాయించింది. వీటిలో బీరువా, ఆటోరిక్షా, గాలిబుడగ, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, బ్యాటరీలైట్, బెల్ట్, నల్లబోర్డు, బాటిల్, బ్రెడ్, పెట్టె, చీపురు, బ్రష్, బకెట్, కేక్, క్యాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, కార్పెట్, క్యాలీఫ్లవర్, పాదరక్షలు(ఈ గుర్తు జైసమైక్యాంద్ర పార్టీకి కామన్‌గా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు), చెస్‌బోర్డు, కోటు, కొబ్బరికాయ, మంచం, కప్పు మరియు సాసరు, కటింగ్ ప్లేయర్, కత్తి, డీజిల్ పంపు, డిష్యాంటెన్నా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూటు, గౌను, మూకుడు, గరాటు, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గాజుగ్లాసు, ద్రాక్షపండు, హార్మోనియం, టోపీ, హెల్మెట్, హాకీబ్యాటు-బంతి, ఐస్‌క్రీం, ఇస్త్రీపెట్టె, కెటిల్, లేడీపర్సు, పోస్టు డబ్బా, మిక్సీ, నెయిల్కట్టర్, నెక్‌టై, పెన్‌స్టాండ్, పెన్సిల్ ఫార్పనర్, కుండ, ప్రెషర్ కుక్కర్, రేజర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, స్కూల్బ్యాగు, కత్తెర, కుట్టుమిషను, షటిల్, పలక, స్టెతస్కోప్, స్టూలు, టేబులు, టేబుల్ బల్బ్, టెలిఫోన్, దూరదర్శిని, టెంట్, టూత్‌బ్రష్, ట్రంపెట్, వయోలిన్, చేతికర్ర, నీటి పంపు, కిటికి గుర్తులు ఉన్నాయి.