పోటాపోటీగా ఫైనల్స్ | The general elections war | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా ఫైనల్స్

Published Tue, Apr 15 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

పోటాపోటీగా ఫైనల్స్

పోటాపోటీగా ఫైనల్స్

 హన్మకొండ, న్యూస్‌లైన్ : లీగ్ మ్యాచ్‌ల్లా సాగిన గ్రామపంచాయతీ, సహకార ఎన్నికలు ఎప్పుడో ముగిశారుు. క్వార్టర్స్, సెమీస్‌లా మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికలు సైతం ఇటీవలే అయ్యూరుు. మిగిలింది ఫైనల్ మ్యాచే. రాజకీయ జట్ల మధ్య అసలైన యుద్ధం మొదలైంది. సార్వత్రిక సమరంలో అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నారుు. తమదైన పద్ధతుల్లో ప్రచారంలో కదం తొక్కుతున్నారుు.
 
దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. గత నెల ఐదో తేదీన సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోరుకు ముందుగా మునిసిపల్... ఆ తర్వాత ప్రాదేశిక ఎన్నికలు వచ్చిపడ్డారుు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో పోరు సాగింది. అనంతరం ఓట్ల లెక్కింపుపై సందిగ్ధత... కోర్టు తీర్పుల నేపథ్యంలో గ్రామాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ ఎన్నికలపైనే దృష్టిసారించారు.
 
ఈ నేపథ్యంలో ఎప్పుడూ రసవత్తరంగా సాగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తంతు ఈ సారి చప్పచప్పగా మొదలైంది. అరుుతే  ప్రధాన పార్టీల అభ్యర్థుల టికెట్ల ఖరారు...  జంప్‌జిలానీలతో కొంత ఊపు వచ్చినప్పటికీ అంతంతమాత్రమే. స్థానిక సందడి ముగియడంతో ఇప్పుడు పట్టణాలు, పల్లెలన్నీ సార్వత్రిక పోరుపైనే చర్చిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగినవి కావడంతో... గ్రామాల వారీగా పోలింగ్ సరళి...  అక్కడి ఓటర్ల మనోగతం...  పార్టీల వారీగా మద్దతుపై పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థులు దృష్టి పెట్టారు.
 
ఆయూ గ్రామాలు, మండలాలకు చెం దిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా బలాబలాలపై లెక్కలేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులు అంచనా వేస్తున్న ఓట్లను బట్టి తమకు పోలయ్యే వాటిని అంచనా వేస్తున్నారు. ఈ సారి స్థానిక పోరులో ఊహించిన దాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ జరగడంతో తమ ఓటు బ్యాంకు ను లెక్కకడుతున్నారు.
 
స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి వెచ్చించిన నిధులు.. సార్వత్రిక ఎన్నికలకు చేయాల్సిన ఖర్చులపై లెక్కలేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారంతో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఆయూ చోట్ల ఓటింగ్ సరళిపై దృష్టి కేంద్రీకరిం చారు.  క్రాస్‌ఓటింగ్ ప్రాంతాల్లో పార్టీల వారీగా బలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యూరు.
 
 సమావేశాలు... ప్రచారాలు

సార్వత్రిక ఎన్నికలకు ప్రచార సమయం 16 రోజులే మిగిలి ఉండడంతో పార్టీల అభ్యర్థులందరూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున మైకులు మొత్తుకుం టున్నాయి. కళాకారుల ఆటపాటలు మొదల య్యాయి. మండలాలవారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ప్రతి సెగ్మెంట్‌కూ తమ పార్టీ అగ్రనేతలతో ప్రచారం చేయించుకునేందుకు అభ్యర్థులు ఎత్తుగడ వేస్తున్నారు.
 
 జిల్లా లో ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పాలకుర్తి సెగ్మెంట్‌లో ప్రచారం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రజాగర్జన సమావేశం నిర్వహించారు. మరోమారు కాంగ్రెస్ అగ్రస్థాయి నేతలు, టీఆర్‌ఎస్ సీనియర్లను జిల్లా లో ప్రచారానికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement