ఓటమికి కుంగిపోవడం లేదు: పొన్నాల | no regret for defeat, says ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

ఓటమికి కుంగిపోవడం లేదు: పొన్నాల

Published Fri, May 16 2014 4:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

ఓటమికి కుంగిపోవడం లేదు: పొన్నాల - Sakshi

ఓటమికి కుంగిపోవడం లేదు: పొన్నాల

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పడిన రాజకీయ వాతావరణం తెలంగాణలోనూ కనిపించిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గెలుపోటములు సహజమని అన్నారు. ఓటమికి కుంగిపోవడం లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండడం వ్యతిరేకం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి బాధపడాల్సిన అవసరం లేదని, ఆలోచించాల్సిన అవసరముందన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణానికి అధికార పక్షానికి తాము సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. దీనికి భిన్నంగా ఉన్నప్పుడు ప్రజల పక్షానా పోరాడతామన్నారు. గెలుపు కాంగ్రెస్ది, ఓటమికి బాధ్యత తనది అన్న వ్యాఖ్యలకు కట్టుబడివున్నట్టు పొన్నాల తెలిపారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామన్నారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement