విశాఖ రూరల్, న్యూస్‌లైన్: cఆయా కార్యాలయాల్లో ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది వాటిని పరిశీలించారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాల పోలింగ్ కోసం మూడు రకాల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
ఒక్కో స్థానంలో ఓట్ల సంఖ్యను బట్టి బాక్సుల ను కేటాయిస్తున్నారు. వెయ్యి ఓట్లు కంటే అధికంగా ఉన్న కేంద్రానికి రెండు పెద్ద బాక్సులు, వెయ్యి లోపు ఓట్లు, ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండే కేంద్రానికి ఒక పెద్దది, మధ్య తరహా బాక్సులు, అంతకంటే తక్కువ ఓట్లు ఉన్న స్థానాల్లో చిన్న బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక పెద్ద బాక్సులో 1200 నుంచి 1400 వరకు ఓట్లు వేసే అవకాశముంటుంది.
ఈ ఎన్నికలకు మొత్తంగా 2300 పెద్దవి, 1800 మధ్యతరహావి, 1200 చిన్న బాక్సులను అందుబాటులో ఉంచారు. వాటన్నింటినీ ఇప్పటికే పరిశీలించి భద్రపరిచారు. వీటితో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంది. జెడ్పీటీసీలకు సంబంధించిన తెల్ల రంగులోను, ఎంపీటీసీలవి గులాబీ రంగులోను ముద్రించారు. అభ్యర్థుల పేర్లు తెలుగు అక్షర క్రమం అనుసరించి గుర్తులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ మండల కేంద్రాల్లో మంగళవారం నిశితంగా పరిశీలించారు. వాటితోపాటు బ్యాలెట్‌లపై ఉన్న సీరియల్ నంబర్లను సైతం పరిశీలించారు.
సవ్యంగా లేని బ్యాలెట్ పత్రాల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో 16,50,329 మంది ఓటర్లు ఉండగా ఒక్కొక్కరు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి రెండేసి ఓట్లు వేయనున్నారు. దీని ప్రకారం బ్యాలెట్ పత్రాలు సిద్ధమయ్యాయి. 10 శాతం రిజర్వ్‌తో పాటు దాదాపుగా 36.5 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఎన్నికలు ఈ నెల 6,11 తేదీల్లో జరగనున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను మండల కేంద్రాలకు. అక్కడే మే 7వ తేదీ తరువాత లెక్కింపును చేపట్టనున్నారు.
బ్యాలెట్ బాక్సులొచ్చేశాయ్!
Published Wed, Apr 2 2014 2:08 AM | Last Updated on Wed, Sep 5 2018 2:01 PM
Advertisement