అదృష్టలక్ష్మి ఎవరో..?
హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం చిక్కుముడి వీడడం లేదు. 24 స్థానాలను దక్కించుకుని మెజార్టీలో ఉన్న కాంగ్రెస్... చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు చేయడం లేదు. 18 స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్ కూడా దోస్తీ కోసం కుస్తీ పడుతోంది. ఆయా పార్టీల తరఫున ఎస్సీ మహిళ రిజర్వ్‌డ్ స్థానాల్లో గెలిచిన మహిళలను చైర్‌పర్సన్ పీఠం కోసం ఎంపిక చేయడం పార్టీలకు తలనొప్పిగా మారింది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ రెండు అడుగుల దూరంలో ఉన్నా... డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి తీరు ఆ పార్టీని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తన వర్గానికే చైర్‌పర్సన్ పీఠం ఇవ్వాలని దొంతి పట్టుబడుతున్న విషయం విదితమే. కానీ... కాంగ్రెస్ ఇటీవల భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్ నుంచి పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించింది.
అంతకుముందు నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో గోవిందరావుపేట నుంచి గెలిచిన నామవరపు విజయలక్ష్మిని చైర్‌పర్సన్ అభ్య ర్థిగా సూచనప్రాయంగా పేర్కొన్నారు. ఇక... టీఆర్‌ఎస్ కూడా జెడ్పీ పీఠంపై మంతనాలు సాగిస్తోంది. లోకల్ అలయెన్స్‌లో భాగంగా అవసరమున్న పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతోంది. తమ పార్టీ తరఫున పర్వతగిరి ఎస్సీ జనరల్ స్థానం నుంచి గెలిచిన మాదా సి శైలజకు చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే పార్టీలో నర్మె ట నుంచి గెలిచిన గద్దల పద్మ కూడా జెడ్పీ పీఠా న్ని ఆశిస్తున్నారు. ఇదే అనువైన సమయంగా త మ గాడ్‌ఫాదర్‌ల వద్ద నుంచి వారు చక్రం తిప్పుతున్నారు.
పోటీ వీరికే...
ఎస్సీ మహిళా స్థానాల్లో కాంగ్రెస్ తరఫున దేవరుప్పుల నుంచి నల్ల అండాలు, కొడకండ్ల నుంచి బాకి లలిత, గోవిందరావుపేట నుంచి నామవరపు విజయలక్ష్మి, ఎస్సీ జనరల్ స్థానంలో నె క్కొండ నుంచి బక్కి కవిత గెలిచారు. టీఆర్‌ఎస్‌లో ఎస్సీ మహిళా స్థానం నర్మెట నుంచి గద్దల పద్మ నర్సింహారావు, పర్వతగిరి ఎస్సీ జనరల్ నుంచి మాదాసి శైలజ గెలుపొందారు. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాల్లో 24 కాంగ్రెస్, 18 టీఆర్‌ఎస్, 6 టీడీపీ, ఒక్కో స్థానం చొప్పున బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించా రు. తాడ్వాయి నుంచి కాంగ్రెస్ రెబల్‌గా సరోజన బరిలోకి దిగి గెలుపొందారు.
ఆమె తమ పార్టీలో కే వస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉన్న కాం గ్రెస్ పెద్దలు ఇప్పటికే తమ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించారు. ఈ క్యాంపునకు డీసీసీ మాజీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి వర్గం దూరంగా ఉంది. తన వర్గంలో 8 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారని దొంతి వర్గం ఇప్పటికే ప్ర చారం చేసుకుంటోంది. జెడ్పీ పీఠం తన సెగ్మెం ట్‌లోని నెక్కొండకు ఇస్తే... మద్దతు ఇస్తానంటూ దొంతి డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ... కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాత్రం గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి వైపే మొగ్గు చూపుతున్నారు.
దొంతి మద్దతు తప్పనిసరి కావాల్సిన పరిస్థితి ఉండడంతో కాంగ్రెస్ నేతలు తలపట్టుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో... ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు జెడ్పీ పీఠంపై ఆశతో ఉన్నారు. ప్ర భుత్వం వస్తుందనే ధీమాతో తమ పార్టీని వదిలి ఎవరూ వెళ్లరని భావించిన టీఆర్‌ఎస్ నిన్నటి దాకా నిర్వహించిన క్యాంపును రద్దు చేసింది. ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను ఇళ్లకు పం పించారు. ఈ పార్టీ నుంచి పర్వతగిరి జెడ్పీటీసీ స భ్యురాలు మాదాసి శైలజ, నర్మెట జెడ్పీటీసీ గద్దల పద్మ పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ మే రకు గులాబీ నేతలు టీడీపీ, బీజేపీ, స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యులతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వీరందరి మద్దతు కూడగడితే... టీఆర్‌ఎస్‌కే జెడ్పీ పీఠం దక్కుతుంది.