మోతె, న్యూస్‌లైన్,మోతె జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో బహుము ఖ పోటీ నెలకొంది. ఈ పోటీల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కటికం సుజాత, కాంగ్రెస్ నుంచి శీలం ఉమ, టీడీపీ అభ్యర్థిగా సోమగాని రేణుక, టీఆర్‌ఎస్ నుంచి కుంచ నీలతో పాటు టీడీపీ నుంచి బీఫారం రాకపోవడంతో అంకిరెడ్డి పద్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.
వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుండగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతు ఇస్తోంది. ఎవరిని విజయం వరించనుందోనని ఉత్కంఠ నెలకొంది. దివంగత నేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కటికం సుజాత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి 25నుంచి ప్రచారం ప్రారంభించారు. కాం గ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రచారమే ప్రారంభించలేదు. మొత్తానికి ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. జెడ్పీటీసీగా ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి..