mothe
-
రోజూ పూజలే.. ఇదేంటని అడిగితే ఎదురు సమాధానం
మోతె (సూర్యాపేట): ఆరునెలల పసిబిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. మూఢ నమ్మకాలతో కన్న తల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంతో తండా వాసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఈ దారుణ ఘటనకు ముం దు పరిస్థితుల గురించి ఆరా తీస్తే.. వారం రోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తోంది. అదీ ఎవరూ లేనప్పుడు.. అగర్బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతోంది.. దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే .. అంటూ దాటవేస్తూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాసమైన మేకలపాడు తండాలో గురువారం భారతి తన ఆరునెలల కూతురును గొంతుకోసి బలిచ్చిన విషయం తెలిసిందే. దీం తో తండాఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఆ తండావాసులను ఎవరినీ పలకరించినా భయాందోళనలోనే ఉన్నారు. భారతికి ఇది రెండో వివాహం తండాకు చెందిన భారతికి కృష్ణతో రెండో వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్లక్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియ దు కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆమె మానసికస్థితి బాగా ఉండడం లేదని పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులక్రి తం ఒకరిని కత్తితో బెదిరించినట్లు సమాచారం. నిందితురాలు భారతి నిలదీస్తే ఎదురు సమాధానాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫొటోతోపాటు యూట్యూబ్‌లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ల ఫొటోలకు అగర్బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతోంది. చుట్టుపక్కల వారికి అగర్బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే ‘మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తామామలకు చెప్పినా వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది. అంతలోనే భారతి కూతురును గొంతుకోసి చంపింది. ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భారతి భర్త కృష్ణ్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం నిందితురాలు భారతిని అదుపులోకి తీసుకొంటామని చెప్పారు. రోదిస్తున్న రీతు నానమ్మ తండా నుంచి వెళ్లగొట్టండి అభంశుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతిని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకును, నన్ను హత్య చేయదని గ్యారటీ ఏమిటీ. ఆమెపై మాకు అనుమానం ఉన్నా బిడ్డను చంపుతుందా? అని అనుకున్నాం. కానీ అన్నంత పనిచేసింది. మళ్లీ ఏమీ తెలియనట్లు ఉంది. ఇలాంటి కర్కోటకురాలిని కఠినంగా శిక్షించాలి. – కృష్ణ తల్లి చంద్రమ్మ ఏమీ గుర్తులేదంటున్న భారతి.. నిందితురాలు భారతి ప్రస్తుతం తన తల్లిగారింటి వద్ద ఉంది. నీ బిడ్డను ఎందుకు హత్య చేశావని బంధువులు ప్రశ్నించగా.. ‘రీతును నేను ఎందుకు హత్య చేశానో నాకే తెలియడం లేదు’అని తాపీగా సమాధానం చెబుతోంది. అసలు హత్య చేసింది కూడా గుర్తులేదని బదులిస్తోంది. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
టికెట్ కలిపింది ఇద్దరినీ...
రామడుగు (చొప్పదండి): చిన్న మనస్పర్థలతో భార్యాభర్తలు ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడిపోవడానికి కోర్టు మెట్లెక్కారు. కానీ.. స్థానిక ఎన్నికల పుణ్యమా అని విడిపోవడానికి నిశ్చయించుకున్న దంపతులు ఏకమయ్యారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని మోతె ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో పలువురు ఆభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్టు ఆశించారు. కోరటపల్లికి చెందిన సీనియర్ నేత కలిగేటి లక్ష్మణ్ కూడా టికెట్టు కోసం పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకున్నాడు. పలువురి పేర్లతోపాటు లక్ష్మణ్ పేరు కూడా పరిశీలించారు. కుటుంబ గొడవల కారణంగా ఆయన భార్య కాపురానికి రావడం లేదన్న విషయం నాయకులు గుర్తించారు. ఇదే విషయమై లక్ష్మణ్‌ను అడగగా, తన భార్య రావడం లేదని, కోర్టులో కేసు నడుస్తుందని, తన తల్లికి టికెట్టు ఇస్తే గెలిపించుకుంటానని విన్నవించుకున్నాడు. దీంతో వారు ‘నీ భార్యను తీసుకొని వస్తేనే టిక్కెట్ ఇస్తాం’అని చెప్పడంతో లక్ష్మణ్ తన భార్య తరఫు బంధువులతో సంప్రదింపులు జరిపాడు. కాపురానికి వచ్చేలా ప్రయత్నాలు చేసి బుధవారం భార్య కవితను ఒప్పించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ భార్యకు టికెట్టు కేటాయించారు. గురువారం బీఫాం ఆర్వోకు అందజేశారు. కాగా, పార్టీ టిక్కెట్ భార్యాభర్తలను ఏకం చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. లక్ష్మణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంపీటీసీ ఎన్నికలు మమ్మల్ని కలుపడం సంతోషంగా ఉందని చెప్పారు. -
కొడుకు కోసం ఓ అమ్మ ఆర్తనాదం
-
పంటలను పరిశీలించిన మయన్మార్ శాస్త్రవేత్తలు
సిరికొండ (మోతె) : మండలంలోని సిరికొండలో శనివారం మయన్మార్ దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వేరుశనగ, కంది పంటలను పరిశీలించారు. మిర్యాలగూడెం కంపసాగర్ కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మయన్మార్ శాస్త్రవేత్తలకు పలువు వివరాలు తెలియజేశారు. రైతులు ఎక్కువగా పండించే కదిరి–కే 6, ఐసీజీయూ 00351, ఐసీజీయూ 91114 మూడు రకాల వేరుశనిగ పంటలు పరిశీలించి వాటి దిగుబడి, పంట కాల పరిమితులు, తెగుళ్లు, సాగు విధానం, యాంత్రీకరణ విధానం వంటి వివరాలు వారు అడిగి తెల్సుకున్నారు. కార్యక్రమంలో మయన్మార్ శాస్త్రవేత్తలు ఫీజీమోటో ఛీప్ అడ్వైజర్ టాసిన్, మీయాంటో, కంపసాగర్ శాస్త్రవేత్త ఎం.శంకర్, ఇక్రిషాట్ శాస్త్రవేత్త కృష్ణారెడ్డి, కోదాడ డివిజన్ ఏడీఏ ఎల్లయ్య, మోతె ఏఓ పి.రజిని, ఏఈఓ జ్యోత్సS్న, సర్పంచ్ నూకల శ్రీనివాసరెడ్డి, రైతులు నూకల ఉపేందర్‌రెడ్డి, నూకల వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, తిర్పయ్య, రమేష్, ఎల్లయ్య, ప్రభాకర్‌రెడ్డి, కొండపల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
సతీసమేతంగా కొరటాల శివ @ మోతె
- సతీమణితో కలిసి చారిత్రక మోతె వీరభద్రస్వామి, భద్రాద్రిలో 'శ్రీమంతుడు' దర్శకుడి ప్రత్యేక పూజలు ఖమ్మం: శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందని, రానున్న రోజుల్లో ఇలాంటి మెసేజ్‌తో కూడిన సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలున్నాయన్నారు దర్శకుడు కొరటాల శివ. శనివారం సతీసమేతంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మోతె ఆలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు అమ్మమ్మ ఊరికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంతోపాటు మహేశ్ బాబుకు ఓ విన్నపం కూడా చేశారు.. 'ప్రేక్షకులకు చక్కని ఆలోచన కలిగిస్తే తప్పకుండా అటువంటి సినిమాను ఆదరిస్తారు. ప్రతీ సినిమా శ్రీమంతుడులాగే ఉండాలని లేదు. దర్శకుడిగా శ్రీమంతుడు సినిమా మంచి సంతృప్తినిచ్చింది. కొత్త ప్రాజెక్టుకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే.. హీరో మహేష్‌బాబు అమ్మమ్మ స్వగ్రామం బూర్గంపాడు మండలం ముసలిమడుగు అని తెలుసుకున్నాక ఆశ్చర్యానికి లోనయ్యా. ఈ గ్రమాన్ని ఓ సారి సందర్శించాలని మహేష్‌బాబుకు చెబుతా' అని కొరటాల శివ అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంతోపాటు బూర్గంపాడు మండలం సారపాక నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది మధ్యలో (మోతెగడ్డ) కొలువైన వీరభద్రస్వామిని కొరటాల దంపతులు దర్శించుకున్నారు. అద్భుత నిర్మాన శైలిలో శతాబ్ధాల కిందటే నిర్మితమైన మోతెగడ్డ ఆలయం సరైన గుర్తింపునకు నోచుకోలేకపోయింది. కాగా, మొన్నటి గోదావరి పుష్కరాల సందర్భంలో మాత్రం అనూహ్య ఆదరణ పొందింది. రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చడంతో వీరభద్రస్వామి ఆలయంతోపాటు దానికి సమీపంలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి కూడా భక్తులు, సెలబ్రిటీల రాక పెరుగుతున్నది. కొరటాల రాకతో మోతె ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. -
అల్విన్ కాలనీలో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
-
బైక్‌తో సహా బావిలోకి..
నల్లగొండ: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోతె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఖమ్మం - సూర్యాపేట రహదారి మార్గంలో ఉన్న మోతె సమీపంలోని వ్యవసాయ బావి నుంచి దుర్గంధం వస్తుండటంతో స్థానికులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో నుంచి గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బావిలోని నీటిని మొత్తం తీసివేయడంతో బావిలో ద్విచక్రవాహనం ప్రత్యేక్షమయింది. దీంతో అతివేగంగా వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెందినది ఎవరా అనేది ఇంకా తెలియరాలేదు. -
ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువు కట్ట పై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోతే మండలం విభలాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన రైతు మైనంపాటి వీరారెడ్డి(45) పొలంలో ఉన్న పత్తిమూటలను తెచ్చేందుకు కూలీలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పత్తిమూటల లోడుతో వస్తుండగా గ్రామంలోని చెరువు కట్టపై మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు వీరారెడ్డి, కూలీ కొత్తపల్లి రమేష్(25)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరారెడ్డికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్‌కు కొద్ది నెలల కిత్రమే పెళ్లి అయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (మోతే) -
ఆడపిల్ల పుట్టిందని.. గొంతు నులిమింది!
-
ఉద్యమస్పూర్తికి చిరునామా మోతె
-
మోతె జెడ్పీటీసీ స్థానం ఎవరికి దక్కేనో?
మోతె, న్యూస్‌లైన్,మోతె జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో బహుము ఖ పోటీ నెలకొంది. ఈ పోటీల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కటికం సుజాత, కాంగ్రెస్ నుంచి శీలం ఉమ, టీడీపీ అభ్యర్థిగా సోమగాని రేణుక, టీఆర్ఎస్ నుంచి కుంచ నీలతో పాటు టీడీపీ నుంచి బీఫారం రాకపోవడంతో అంకిరెడ్డి పద్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఎం మద్దతు ఇస్తోంది. ఎవరిని విజయం వరించనుందోనని ఉత్కంఠ నెలకొంది. దివంగత నేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కటికం సుజాత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి 25నుంచి ప్రచారం ప్రారంభించారు. కాం గ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రచారమే ప్రారంభించలేదు. మొత్తానికి ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. జెడ్పీటీసీగా ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి.. -
'కష్టాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ మట్టే'