Published
Sat, Sep 3 2016 9:36 PM
| Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
పంటలను పరిశీలించిన మయన్మార్ శాస్త్రవేత్తలు
సిరికొండ (మోతె) : మండలంలోని సిరికొండలో శనివారం మయన్మార్ దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వేరుశనగ, కంది పంటలను పరిశీలించారు. మిర్యాలగూడెం కంపసాగర్ కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మయన్మార్ శాస్త్రవేత్తలకు పలువు వివరాలు తెలియజేశారు. రైతులు ఎక్కువగా పండించే కదిరి–కే 6, ఐసీజీయూ 00351, ఐసీజీయూ 91114 మూడు రకాల వేరుశనిగ పంటలు పరిశీలించి వాటి దిగుబడి, పంట కాల పరిమితులు, తెగుళ్లు, సాగు విధానం, యాంత్రీకరణ విధానం వంటి వివరాలు వారు అడిగి తెల్సుకున్నారు. కార్యక్రమంలో మయన్మార్ శాస్త్రవేత్తలు ఫీజీమోటో ఛీప్ అడ్వైజర్ టాసిన్, మీయాంటో, కంపసాగర్ శాస్త్రవేత్త ఎం.శంకర్, ఇక్రిషాట్ శాస్త్రవేత్త కృష్ణారెడ్డి, కోదాడ డివిజన్ ఏడీఏ ఎల్లయ్య, మోతె ఏఓ పి.రజిని, ఏఈఓ జ్యోత్సS్న, సర్పంచ్ నూకల శ్రీనివాసరెడ్డి, రైతులు నూకల ఉపేందర్‌రెడ్డి, నూకల వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, తిర్పయ్య, రమేష్, ఎల్లయ్య, ప్రభాకర్‌రెడ్డి, కొండపల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు.