
కరీంనగర్ జిల్లా: అక్రమ ఉపాధి పేరుతో మోసపోయి మయన్మార్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 540 మందిని ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మయన్మార్ బాధితుల కథనాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దాంతో అక్కడ చిక్కుకున్న 500 మందికి పైగా బాధితుల్ని భారత్ కు తీసుకొచ్చారు.
ఈక్రమంలోనే మయన్మార్ నుంచి తిరిగొచ్చిన కరీంనగర్ జిల్లా మానుకొండూరం మండలం రంగం పేటకు చెందిన మధుకర్ రెడ్డి.. బండి సంజయ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని బండి సంజయ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు బండి సంజయ్.
Met Madhukar Reddy from Rangampet, Manakondur Mandal, who safely returned home, thanks to Hon’ble PM Shri @narendramodi ji’s leadership.
He is one of the 540 cybercrime victims lured to Myanmar through fraudulent job offers.
Trapped in forced cyber fraud operations, many like… pic.twitter.com/Cckg20otqS— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 16, 2025
Comments
Please login to add a commentAdd a comment