sirikonda
-
Adilabad District: ఇన్చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
ఇచ్చోడ(బోథ్): అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడే జిల్లాలో ఆదిలాబాద్ మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి రైతులకు ఆధునిక వ్యవసాయం, పంటల మార్పిడి, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగులో మెలకువలు, సాగులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ అధికారుల పోస్టులు జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. డీఏవో కూడా ఇన్చార్జీనే.. ఆదిలాబాద్‌లో పనిచేసిన జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి డిప్యూటేషన్‌పై మెదక్ జిల్లాకు వెళ్లింది. ఆమె స్థానంలో ప్రభుత్వం మళ్లీ డీఏవోను నియమించలేదు. దీంతో ఆదిలాబాద్ ఏడీఏ, మార్క్‌ఫెడ్ డీఎంగా అదనపు బాధ్యతలు చూస్తున్న పుల్లయ్యను ఇన్చార్జి డీఏవోగా నియమించారు. కొత్త మండలాలకు మంజూరు కాని పోస్టులు ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో సిరికొండ, గాదిగూడ, భీంపూర్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలను నియమించిన ప్రభుత్వం వ్యవసాయ అధికారులను నియమించడం మరిచింది. దీంతో ఆరు మండలాలకు ఆరేళ్లుగా ఇన్చార్జి వ్యవసాయ అధికారులే కొనసాగుతున్నారు. 18 మండలాలకు 11 మందే ఏవోలు జిల్లాలోని 18 మండలాల్లో కేవలం 11 మంది ఏవోలే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగితా ఏడు మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్లుగా రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని బేల, ఇంద్రవెల్లి, తలమడుగు, సిరికొండ, భీంపూర్, మావల, గాదిగూడ మండలాల్లో ఇన్చార్జి వ్యవసాయ అధికారులే విధులు నిర్వర్తిస్తున్నారు. బేల మండల ఏవోగా పనిచేసిన రమేశ్‌ను కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేయగా, ఏడాది కాలంగా బోథ్ ఏవో విశ్వామిత్ర బేల ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. తలమడుగు ఏవో రమణను సర్వీసు నుంచి తొలగించడంతో నార్నూర్–2 ఏవో మహేందర్ తలమడుగు ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లి ఏవో కైలాస్ నాలుగేళ్ల కిత్రం ఇచ్చోడకు బదిలీపై రావడంతో ఉట్నూర్ ఏవో గణేశ్ ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన గాదిగూడకు టెక్నికల్ ఏవో జాడి దివ్య, సిరికొండకు ఇచ్చోడ ఏవో కైలాస్, భీంపూర్కు తాంసి ఏవో రవీందర్, మావలకు ఆదిలాబాద్ అర్బన్ ఏవో రవీందర్ ఇన్చార్జి ఏవోలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నార్నూర్, జైనథ్ మండలాలకు ఇద్దరు ఏవోలు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. (క్లిక్: కరీంనగర్ జిల్లాలో మరో ఆరు కొత్త మండలాలు!?) ప్రభుత్వానికి నివేదించాం కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం ఏవోలను నియమించలేదు. దీంతో పాత మండలాల ఏవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాం. కొన్ని మండలాల్లో ఏవోలు బదిలీపై వెళ్లడంతో అక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వారి స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. – పుల్లయ్య, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆకస్మికంగా వచ్చిన వరదకు వాగులో నుంచి వెళుతున్న ట్రాక్టర్ కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పంచ్ తండా గ్రామ పంచాయతీకి చెందిన బట్టు రంపాల్ కొండాపూర్ గ్రామం నుంచి ట్రాక్టర్లో ఫ్రిజ్, కూల్ డ్రింక్స్ డబ్బాలు తీసుకుని వెళ్తుండగా మొండి వాగులో ట్రాక్టర్ దిగబడింది. అదే సమయంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి భారీగా వరద వచ్చింది. ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ ట్రాక్టర్ దిగి ఒడ్డుకు చేరడంతో ప్రమాదం తప్పింది. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్‌లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. -
ఆదిలాబాద్‌లో ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా ప్రబలతోంది. సిరికొండ మండలం తుమ్మల్ పాడ్ గ్రామంలో డయేరియా ఛాయలు కనడబడుతున్నాయి. చాలా మంది డయేరియా బారిన పడుతున్నారు. ఇప్పటకే 50 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలవుతున్నాయి. వాంతులు, విరేచనాలతో నీరసంగా మారి గ్రామంలో చాలామంది మంచాన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.. -
ఆదిలాబాద్ జిల్లా లో డయేరియా కలకలం
-
రెండ్రోజులుగా చెట్టుపైనే మృతదేహం
సాక్షి, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న గంగాధర్ మృతదేహం రెండ్రోజులుగా చెట్టు పైనే ఉంది. గత అక్టోబర్‌లో గ్రామానికి చెందిన మమత హత్య కేసులో గంగాధర్‌ను అనుమానితుడిగా భావించి పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు, మహిళలు ఆరోపిస్తున్నారు. గంగాధర్ ఆత్మహత్యకు కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, మమత హత్య కేసులో అసలైన నిందితులను తక్షణం పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చదవండి: ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి! ఇరు కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, గంగాధర్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. శవాన్ని చెట్టుపై నుంచి దించేందుకు ప్రయత్నించిన పోలీసులను అడ్డుకున్నారు. వారితో మాట్లాడటానికి వచ్చిన నిజామాబాద్ ఆర్డీవో రవిని ఆదివారం రాత్రి వరకు అక్కడే అడ్డుకున్నారు. తగిన న్యాయం జరిగేంత వరకు చెట్టుకు వేలాడుతున్న మృతదేహన్ని కిందకు దించనిచ్చేది లేదని వారు పట్టుబట్టారు. చదవండి: అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య -
హైదరాబాద్ నుంచి వచ్చారని ఊరి బయటే..
సాక్షి, సిరికొండ(బోథ్) : కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటే కష్టమని సొంతూళ్లకు బయలుదేరినా కరోనా లక్షణాలు ఉన్నాయేమోననే అనుమానంతో ఊరి బయటే ఉంచుతున్నారు. తాజాగా ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో ఎలాగోలా బతికి తిరిగి సొంతూళ్లకు రావడంతో కరోనా భయంతో గ్రామస్తులు ఊరి నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాథోడ్ రమేశ్, పవార్, రమేశ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో వీరు ముగ్గురు ఇన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు. ఓ లారీలో మంగళవారం రాత్రి రాగా గ్రామస్తులు ఊరిబయటే ఉంచారు. దీంతో వీరిప్పుడు పంట పొలాల్లో ఉంటున్నారు. 14 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడకపోతే అప్పుడు వీరిని ఊర్లోకి రానిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. (పేద బ్రాహ్మణునికి నిత్యావసరాల పంపిణీ) -
ఆందోళన : ఇంటికి నిప్పు పెట్టిన బంధువులు
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని సిరికొండ మండలంలో దారుణం చోటుచేసుకుంది. గోప్యనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న తండాలో సుజాత అనే మహిళ ఉరివేసుకుని ఆదివారం బలన్మరణానికి పాల్పడింది. అత్తింటివారు వేధింపులకు పాల్పడటంతోనే సుజాత ఆత్మహత్య చేసుకుందని ఆమె తరపు బంధువులు ఆరోపించారు. సుజాత అత్తింటివారి ఎదుట ఆందోళనకు దిగారు. వారి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అయితే, విషయాన్ని గ్రహించిన మృతురాలి భర్త, అత్తామామలు అక్కడ నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ప్రజల ఆశీస్సులే శ్రీరామరక్ష
సాక్షి,భూపాలపల్లి: ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలుపొందడం ఖాయమని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచా రి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని కేటీకే–2 గని సమీప బ్యారెక్స్, మిలీనియం క్వార్టర్స్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తన 5 ఏళ్ల పదవీ కాలంలో భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తెచ్చి కాలనీల్లో అంతర్గత రోడ్లు, విద్యుత్, ఆధునీకరణ పనులు చేపట్టానని చెప్పారు. సింగరేణి, కేటీపీపీ యాజమాన్యాలతో మాట్లాడి భూపాలపల్లి నుంచి చెల్పూరు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించామని, గతంలో లేని విధంగా భూపాలపల్లి అభివృద్ధి దిశలో పయనిస్తోందన్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతమైన భూ పాలపల్లిలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారని, తాను గెలిచిన అనంతరం వారి కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, పార్టీ పట్టణ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు పైడిపెల్లి రమేష్, సింగనవేని చిరంజీవి, చెరకుతోట శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు సిరికొండ అండ
సాక్షి,రేగొండ: భూపాలపల్లి నియోజక వర్గంలో పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నకోడెపాక, దామరంచపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లె, చెన్నాపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు స్పీకర్‌కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన రోడ్‌షోలో మధుసూదనాచారి మాట్లాడుతూ కాయలు కాసి ఫలాలను అందించే చెట్టులాంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొంత మంది నరికివేయాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 70 ఏళ్లుగా జరుగని అభివృద్ధి 53 నెలల్లో చేశామన్నారు. అవినీతి అక్రమాలు చేస్తూ ఆస్తులు, సొంత వ్యాపారాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఓట్లు వేయొద్దన్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ వారితో మమేకమైన తమను ఆదరించి మరోమారు గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, ఎంపీపీ ఈర్ల సదానందం, మాజీ సర్పంచ్ మార్క మమత, సుధాకర్, ఎంపీటీసీ సభ్యులు కూనూరి సదానందం, పీఎసీఎస్ చైర్మన్ గోపు భిక్షపతి, నాయకులు పున్నం రవి, మైస భిక్షపతి, సంతోష్, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్, శ్రీధర్‌గౌడ్, బలేరావు మనోహర్‌రావు, కిరణ్, తిరుపతి, గ్రామ కమిటి అ«ధ్యక్షులు బొమ్మరాజు సుధాకర్, పెరమాండ్ల చక్రపాణి, రమేష్, వీవర్స్ సోసైటీ చైర్మన్ అశోక్, సాంబయ్య, కుమార్, మొండయ్య, సారయ్య, నాగపూరి పరమేశ్వర్, అశోక్, అశోక్, మమత, మల్లెబోయిన భిక్షపతి, బాబురావు, కృష్ణారెడ్డి, ఎడ్డే స్వాతి, రాజ్‌కుమార్, నీలాంబ్రం, దాస్ తదితరులు పాల్గొన్నారు. -
బండరాళ్లతో మోది దారుణ హత్య
సిరికొండ(బోథ్) : బండరాళ్లతో తలపై మోది ఓ గిరిజనుడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని సోన్‌పెల్లి శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాంజీగూడ గ్రామానికి చెందిన అర్క కమ్ము (48) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి రైతుబంధు డబ్బులు రూ.10వేలు తీసుకొని సొంత పనుల నిమిత్తం ఆదిలాబాద్‌కు వెళ్లాడు. గురువారం ఉదయం, సాయంత్రం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. నేను బయలు దేరాను.. నా వెంట ఒక స్నేహతుడు కూడా ఉన్నాడని భార్య హీరాబాయితో చెప్పి ఫోన్ పెట్టేశాడు. రాత్రి మరోసారి కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. శుక్రవారం ఉదయం సోన్‌పెల్లి గ్రామశివారులో శవమై తేలాడు. అటుగా వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు సిరికొండ ఇన్చార్జి ఎస్సై రాముగౌడ్, నేరడిగొండ ఎస్సై వెంకన్నతోపాటుగా పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొదట డబ్బుల కోసమే ఎవరో కమ్మును కొట్టి చంపారని నిర్ధారణకు వచ్చారు. కమ్ము షర్టు, ధోతిని విప్పి చూడగా రూ.8వేలు లభించాయి. ఇది డబ్బుల కోసం అయి ఉండదని, ఎవరో కక్షపూరితంగా హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అక్కడికి చేరుకున్నా రు. శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం బోథ్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా కమ్ము సెల్‌ఫోన్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి రాంజీగూడకు చెందిన ఆదివాసీ గిరిజనుడు అర్క కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, హంతకులను పట్టుకోవాలని ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా అధ్యక్షుడు జలైజాకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతానికి వారు సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ తరుణంలో ఓ ఆదివాసీ గిరిజనుడు హత్యకు గురికావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హంతకులను పట్టుకుంటాం.. కమ్ము హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపి హంతకులను వెంటనే పట్టుకుంటామని ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కమ్ము హత్యకు గురైన ప్రాంతాన్ని యన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కమ్ము హత్యకు కారణాలను, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో విచారణ జరిపిస్తున్నామని, ముందుగా ఇంటి నుంచి కమ్ము ఎవరితో ఎక్కడికి వెళ్లాడు..ఎవరితో తిరిగాడనే దానిపై విచారణ జరుపుతున్నాన్నారు. ఆదివాసీ గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి...
సిరికొండ: మండలంలో ఖాళీగా ఉన్న మినీఅంగన్వాడీ కార్యకర్తలు, ఆయాపోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఐదు మినీ అంగన్వాడీ టీచర్లు, 6 ఆయాపోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి ఈనెల13 వరకు ఆన్లైన్లో దర ఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ పో స్టులన్నింటికి గిరిజనులుకు మాత్రమే కేటా యించామని, మండలంలోని నం.1 అంగన్వాడీ సెంటర్లోని ఆయా పోస్టు జనరల్ వా రికి కేటాయించామని ఆమె తెలిపారు. కనీస విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తారన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్‌కార్డు కూడా జతచేయాలని ఆమె సూచించారు. ఎవ రైనా అంగన్వాడీ పోస్టును ఇప్పిస్తానని డ బ్బు తీసుకునే ప్రయత్నాలు చేస్తే తమ దృష్టికి తేవాలని, ఈ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు చోటులేదని తెలిపారు. -
పంటలను పరిశీలించిన మయన్మార్ శాస్త్రవేత్తలు
సిరికొండ (మోతె) : మండలంలోని సిరికొండలో శనివారం మయన్మార్ దేశానికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటల క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వేరుశనగ, కంది పంటలను పరిశీలించారు. మిర్యాలగూడెం కంపసాగర్ కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మయన్మార్ శాస్త్రవేత్తలకు పలువు వివరాలు తెలియజేశారు. రైతులు ఎక్కువగా పండించే కదిరి–కే 6, ఐసీజీయూ 00351, ఐసీజీయూ 91114 మూడు రకాల వేరుశనిగ పంటలు పరిశీలించి వాటి దిగుబడి, పంట కాల పరిమితులు, తెగుళ్లు, సాగు విధానం, యాంత్రీకరణ విధానం వంటి వివరాలు వారు అడిగి తెల్సుకున్నారు. కార్యక్రమంలో మయన్మార్ శాస్త్రవేత్తలు ఫీజీమోటో ఛీప్ అడ్వైజర్ టాసిన్, మీయాంటో, కంపసాగర్ శాస్త్రవేత్త ఎం.శంకర్, ఇక్రిషాట్ శాస్త్రవేత్త కృష్ణారెడ్డి, కోదాడ డివిజన్ ఏడీఏ ఎల్లయ్య, మోతె ఏఓ పి.రజిని, ఏఈఓ జ్యోత్సS్న, సర్పంచ్ నూకల శ్రీనివాసరెడ్డి, రైతులు నూకల ఉపేందర్‌రెడ్డి, నూకల వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, తిర్పయ్య, రమేష్, ఎల్లయ్య, ప్రభాకర్‌రెడ్డి, కొండపల్లి వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ
నిజామాబాద్ : బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ గుర్తు పరిమాణాన్నితగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ సిరికొండ మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని నినదిస్తూ బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిప్యూటి తహశీల్దార్ విక్రమ్‌కు వినతి పత్రం అందజేశారు. -
ముగ్గురు మహిళా రైతులు అరెస్ట్
నిజామాబాద్ : గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో కందకాలు తవ్వేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నందుకు ముగ్గురు గిరిజన మహిళా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... అటవీ శాఖ అధికారులు మంగళవారం రావుట్ల గ్రామంలో గిరిజనులు సాగు చేసిన అటవీ భూముల్లో పంటను నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అటవీ భూముల్లో కందకాలను తవ్వేందుకు అటవీ అధికారులు నాలుగు జేసీబీలతో ఈ రోజు గ్రామానికి చేరకున్నారు. పోలీసులు సహాయంతో వచ్చిన అటవీ అధికారులను గిరిజన మహిళా రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు ముగ్గురు మహిళా రైతులను అరెస్ట్ చేశారు. కాగా, భూములను పరిశీలించేందుకు వచ్చిన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తదితరులను గ్రామంలోనే అడ్డుకొని పీఎస్‌కు తరలించారు. పోలీసులు సహాయంతో అటవీ శాఖ అధికారులు కందకం తవ్వకాలను కొనసాగిస్తున్నారు. -
సిరికొండలో బీడీ కార్మికుల ర్యాలీ
నిజామాబాద్: బీడీ కట్టలపై 85శాతం గొంతు కేన్సర్ బొమ్మను ముద్రించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ బీడీ కార్మికుల నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (సిరికొండ) -
పూలే చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
సిరికొండ,న్యూస్‌లైన్: సామాజిక విప్లవోద్యమ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి అన్నారు. మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో గురువారం నిర్వహించిన పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆనాటి కాలంలో అగ్రవర్ణాలకే పరిమితమైన విద్యను .. అందరికీ పంచేందుకు పూలే చూపిన చొరవ అమోఘమన్నారు. సమాజ మార్పు, స్త్రీలకు విద్యను అం దించడం కోసం తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి పూలే అని కొనియాడారు. పూలేను గురువుగా భావించిన అంబేద్కర్ కూడా చదువుతోనే అన్నిం టినీ ప్రభావితం చేయవచ్చని భావించారన్నారు. అందుకే రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు అన్ని హక్కులు సంక్రమించేలా చేశారని కీర్తించారు. అనంతరం గతేడాది పదో తరగతి, ఇంటర్ మండల టాపర్లకు నగదు పురస్కారం *1116, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందచేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆర్.నర్సయ్య, ఎం ఈఓ సుశీల్‌కుమార్, సర్పంచ్‌లు చిన్నసాయ న్న, సురేఖ, ఠాకూర్ జితేందర్‌సింగ్, రమేశ్, లాలీ, విండో చైర్మన్ గోపాల్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నర్సిం హులు,ఉపాధ్యాయ సంఘ నాయకు లు సాల్మన్,బాలయ్య, రాజేశ్వర్, సత్యానంద్,చిన్ననర్సయ్య పాల్గొన్నారు.