కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
రెంజల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా గురువారం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..గతంలో టీడీపీ పాలనను స్వ యంగా చూశామన్నారు. ఒకరు చస్తేనే మరొకరికి పింఛన్ ఇచ్చే సాంప్రదాయం ఉండేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను తీర్చేం దుకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, రైతులకు మద్దతు ధర, జలయజ్ఞం, పింఛన్లు పెంచడం తదితర పథకాలతో అనేక వర్గాల ప్రజలకు కాంగ్రెస్ లబ్ధిచేకూర్చిందని వివరించారు.
ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే ఆదరించాలని సూచించారు. 40 ఏళ్లుగా లేని మెడికల్ కళాశాలను మీ దయ వల్ల మంజూరు చేయించినట్లు తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టు గ్రామాల వరకు సాగు నీరందిస్తున్నట్లు తెలిపారు.కందకుర్తి ఎత్తిపోతలను జూలై వరకు పూర్తిచేయిస్తామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్లే అనేక రకాల పథకాలు వచ్చాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ పునర్మిర్మాణం కాంగ్రెస్‌తోనే జరుగుతుందన్నారు. తాను అవినీతికి అవకాశం ఇవ్వకుండా అధికారులతో పనులు చేయించానని అన్నారు.
గ్రామాల్లో చిన్న సమస్యలు స్థానిక నాయకులు పరిష్కరించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను విడతల వారీగా పరిష్కరించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి నాగభూషణంరెడ్డి, సర్పంచ్‌లు సవిత, జావిద్, పోశెట్టి,ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.