
రూ.కోటితో అభివృద్ధి చేశా
శెట్టిపల్లెకు గల్లా ఏం చేశారో చెప్పాలి : చెవిరెడ్డి
తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: శెట్టిపల్లె పంచాయతీలోని దాదాపు అన్ని వీధులకు తుడ చైర్మన్‌గా తాను కోటి రూపాయలతో సీసీ రోడ్లు, చెట్లపెంపకం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టానని వైఎస్‌ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జెడ్పీటీసీ అభ్యర్థి తలారి ఆనందమ్మ, శెట్టిపల్లె పంచాయతీలోని ఆరుగురు ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచా రం చేపట్టారు.
ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా కాల నీ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం అడవి ని తలపించేలా ఉండేదన్నారు. అలాం టి ప్రాంతాన్ని మంత్రిగా ఉన్న గల్లా అరుణకుమారి పట్టించుకోలేదన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి రెండుసార్లు మంత్రిగా ఉన్న గల్లా శెట్టిపల్లె పంచాయతీకి ఏం చేశారో చెప్పాలన్నారు. తాను చిన్నపదవి తుడ చైర్మన్ హోదా లో శెట్టిపల్లె పంచాయతీలో ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేశానన్నారు.
తాను గతంలో ఏనాడూ ఓట్లు అడగలేదన్నారు. తొలిసారిగా మీ ముందుకు వస్తున్నా ఆదరించండి, ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించండి అని కోరారు. తాము గెలిస్తే శెట్టిపల్లె పంచాయతీలో మిగిలిన అన్ని వీధులకు సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారు.
శెట్టిపల్లె వైఎస్‌ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు మునిలక్ష్మి, కె.కళావతి, వసంతు, అశోక్‌కుమార్‌రెడ్డి, బీ.రేణుక, రాంకుమార్, ఉమామహేశ్వరితో పాటు పార్టీ నాయకులు రుద్రగోపి, పీఎం.లక్ష్మీనారాయణ, ఓబులరెడ్డి, నాగయ్య, ఎస్సీసెల్ కన్వీనర్ వెంకటరమణ, బాబు, భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ఖాసీం, ప్రసాద్, మస్తాన్, వెంకటేష్, హనుమంత నాయక్, రాంబాబు, రమేష్, ఎంఎస్‌ఆర్, గురవరాజు, రామాంజులరెడ్డి, శివానందరెడ్డి, మహేష్‌రెడ్డి బ్రహ్మయ్య, నాగిరెడ్డి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.