సాక్షి ప్రతినిధి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. 12న నిర్వహించ తలపెట్టిన జనభేరి.. 13వ తేదీకి వాయిదా పడిందన్నారు. 13న ఉదయం 10 గంటలకు కోడుమూరుకు చేరుకోనున్న జననేత రోడ్‌షో నిర్వహించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు.
అక్కడి నుంచి నేరుగా ఆలూరుకు వెళ్తారని.. మార్గమధ్యలో స్థానికులను కలుసుకుంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఆలూరులో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారన్నారు. అనంతరం పత్తికొండకు చేరుకుని రోడ్‌షో చేపడతారని.. ఆ తర్వాత జనభేరిలో ప్రసంగిస్తారని వెల్లడించారు.