పురపాలక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరపడంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.
ఏలూరు, న్యూస్‌లైన్ : పురపాలక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరపడంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆదివారం పోలింగ్ జరిగాక, ఏప్రిల్ రెండున ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే పుర ఫలితాలను వెల్లడించరాదంటూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు నడుస్తుండడంతో ఓట్ల లెక్కింపు జరపాలా వద్దా అన్న అంశం పెండింగ్‌లో పడిపోయింది.దీంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు కౌంటింగ్ విషయం వైపు ఆలోచన చేయటం లేదు.
ఇప్పటికే దీనిపై అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎన్నికల సంఘం, పురపాలక సంఘం నుంచి ఏ విషయం తేలకపోవడంతో అధికారుల్లో కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది. అయితే ప్రజావ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు ధర్మాసనం తుది నిర్ణయం వెలువడనుంది.
దీంతో కౌంటింగ్‌పై వేచి చూసే ధోరణిలోనే జిల్లా యంత్రాంగం, కమిషనర్లు ఉన్నారు. ఓట్ల లెక్కింపుపై రాజకీయ పార్టీల్లో గుబులు రేగుతోంది. లెక్కింపును హైకోర్టు వాయిదా వేస్తే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కొంత నిరాశకు గురయ్యే పరిస్థితి ఉంది.