కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన నేతల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రథములని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. శనివారం రాత్రి స్థానిక జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 200 పైగా కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా బుట్టా రేణుకతో పాటు పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డికి స్థానికులు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. వైఎస్ హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమైందని.. ఆయన ఆశయాలను సాధించేందుకు తపించే నాయకులకే పట్టం కడతామని పాతబస్తీ ముస్లింలు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. అవకాశవాద, రాజకీయ లబ్ధికి ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలు మార్చే నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
బుట్టా రేణుక మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి చేశారన్నారు. పేద, సామాన్య ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా పాలన సాగించడం ఆయనకే చెల్లిందన్నారు. అందుకే ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. ముఖ్యంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయ సాధన ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. టీడీపీ నేత టీజీ వెంకటేష్ స్వార్థం కోసమే పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. తన పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడమే తప్పిస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే ఆలోచన ఏ కోశాన కూడా లేదన్నారు.
తమ నేత జగన్ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, ఎసీ సెల్ జిల్లా కన్వీనర్ కిషన్, మైనార్టీ సెల్ నాయకుడు హమీద్, బీసీ సెల్ నాయకుడు కంటు, ఇతర నాయకులు ఉస్తాద్ మహబూబ్ అలీ, ఉస్తాద్ రిజ్వాన్, అస్లామ్, రాజ్‌ధార్ ఖాన్ సూరి, బాబుభాయ్, మహబూబ్ ఖాన్, హకీం, మసూద్, షఫి, శ్రీనివాసులు, అబ్దుల్లా, వీరన్న, మధు, కృష్ణమూర్తి, నజీబ్, మగ్బూల్, మైమున్నీసా, శివ, పావురాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ హయాంలో ముస్లింలకు పెద్దపీట
Published Sun, Mar 30 2014 1:39 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement