kurnool parliament
-
ఆద్యంతం ఉత్కంఠ
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సందడి కర్నూలు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కర్నూలు శివారులోని వెంకాయపల్లె వద్దనున్న పుల్లయ్య, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కర్నూలు పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టారు. నంద్యాల పార్లమెంట్‌తో పాటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్‌లో ఈవీఎంలు వినియోగించడంతో ఫలితాలు మధ్యాహ్నం లోపు వెలువడ్డాయి. జిల్లాలోని రెండు పార్లమెంట్‌తో పాటు 11 శాసనసభ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రౌండ్ల వారీగా ఆధిక్యత ప్రదర్శించారు. ఫలితాలు వెలువడగానే లెక్కింపు కేంద్రాల బయట వేచి ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. విజేతల తరఫున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు, డోన్, పత్తికొండ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లోపల ఉన్న వారితో సెల్ఫోన్లలో మాట్లాడుతూ వివరాలు తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరూ బిజీబిజీగా గడిపారు. ఫలితం వెలువడగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కలెక్టర్, ఎస్పీ పరిశీలన కర్నూలు లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురాంరెడ్డి.. నంద్యాలలోని ఆర్జీఎం కళాశాలలో చేపట్టిన ఓట్ల లెక్కింపును జాయింట్ కలెక్టర్ కన్నబాబు పర్యవేక్షించారు. నియోజకవర్గాల వారీగా కేంద్రాలను సందర్శించి లెక్కింపు తీరును పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విధుల్లోని అధికారులను ఆదేశించారు. గట్టి బందోబస్తు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి స్వయంగా బందోబస్తును పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల అనుచరులు, అభిమానులు ఆయా కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చినప్పటికీ 200 మీటర్ల దూరంలో ఉండేలా చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సెక్షన్ 144 సీఆర్పీసీ 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేశారు. కర్నూలు కౌంటింగ్ కేంద్రాల వద్ద హోంగార్డ్స్ కమాండెంట్, ఏఆర్ అదనపు ఎస్పీ, నంద్యాల కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ పర్యవేక్షించారు. వాహనాల దారి మళ్లింపు ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా కేంద్రాల వద్ద వాహనాలను దారి మళ్లించారు. కర్నూలు, నందికొట్కూరు వాహనాలను నంద్యాల చెక్‌పోస్టు, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మీదుగా పసుపుల, సూదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె ఎల్లమ్మ వద్ద చేరుకునేలా చర్యలు చేపట్టారు. నంద్యాల వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా అదే మార్గంలో కర్నూలుకు చేరుకునేలా పోలీసులు ఏర్పాటు చేశారు. నంద్యాల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రధాన రోడ్డులో కాకుండా సర్వీసు రోడ్లలో వాహనాలను మళ్లించారు. -
బోయలకే జెడ్పీపీఠం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. జిల్లా పరిషత్ పీఠం బోయ కులస్తులకు కట్టబెడుతూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపింది. బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ఆ వర్గీయులను అనాదిగా తొక్కిపెడుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ పీఠం ఎక్కకుండా అడ్డుపడుతోంది. ఇందుకు అతీతంగా వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గీయులు హర్షిస్తున్నారు. చెప్పడం కాదు.. చేసి చూపిన పార్టీగా అభినందిస్తున్నారు. అండగా నిలుస్తామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్‌కు బీసీ కులానికి చెందిన మహిళను అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం మహిళా లోకానికి వరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్నూలు జిల్లా పరిషత్ పీఠాన్ని మొట్టమొదటి సారిగా స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అలంకరించారు. రిజర్వేషన్లు అమలు కాకముందు అగ్రవర్ణాల నాయకులే ఆ పీఠాన్ని అధిష్టించారు. రాజకీయ రిజర్వేషన్లు అమలయ్యాక పరిస్థితులు తారుమారయ్యాయి. తాజాగా కర్నూలు జెడ్పీ సీటు బీసీలకు రిజర్వు కావడంతో అగ్రవర్ణాలను నిరుత్సాహానికి గురిచేసింది. బీసీలకు వచ్చిన ఈ అవకాశం నేపథ్యంలోనూ ఏ వర్గీయులను కూర్చోబెట్టాలనే విషయమై కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకసారి కర్నూలు పార్లమెంట్‌కు, మరోసారి నంద్యాల పార్లమెంట్‌కు జెడ్పీగిరిని పంచుతున్నాయి. తద్వారా ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలకు తెరతీశాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య కుమ్ములాటలు.. విభేదాల నేపథ్యంలో బీసీల్లో ఎవరిని పీఠంపై కూర్చోబెట్టాలో తేల్చుకోలేకపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక న్యాయం అమలు చేస్తామని.. బీసీలకు అండగా నిలుస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి అధినేత ఎదుటే.. అప్పుడే పార్టీలో చేరిన వాల్మీకి సామాజిక వర్గీయుడైన డాక్టర్ పార్థసారధిపై దాడి జరగడం గమనార్హం. బీసీ జపం చేస్తున్న చంద్రబాబు ఎదుటే తమ్ముళ్లు ఆయనను కుళ్లబొడవటం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పట్టింది. ఇక కాంగ్రెస్ మొసలి కన్నీళ్లు సరేసరి. పెద్దరెడ్డి ఎవరి పేరు చెబితే వారే పీఠం ఎక్కాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాల తరఫున పుట్టుకొచ్చిన.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు కట్టుబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సామాజిక న్యాయానికి కట్టుబడి ముందుకు సాగుతోంది. జిల్లాలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గమైన బోయలకు జెడ్పీ పీఠాన్ని కట్టబెడుతూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం వాల్మీకుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చింది. -
వైఎస్ హయాంలో ముస్లింలకు పెద్దపీట
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ముస్లింల సంక్షేమానికి కృషి చేసిన నేతల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రథములని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టా రేణుక అన్నారు. శనివారం రాత్రి స్థానిక జమ్మిచెట్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 200 పైగా కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా బుట్టా రేణుకతో పాటు పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డికి స్థానికులు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. వైఎస్ హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమైందని.. ఆయన ఆశయాలను సాధించేందుకు తపించే నాయకులకే పట్టం కడతామని పాతబస్తీ ముస్లింలు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. అవకాశవాద, రాజకీయ లబ్ధికి ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీలు మార్చే నాయకులకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. బుట్టా రేణుక మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి చేశారన్నారు. పేద, సామాన్య ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా పాలన సాగించడం ఆయనకే చెల్లిందన్నారు. అందుకే ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారన్నారు. ముఖ్యంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయ సాధన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. టీడీపీ నేత టీజీ వెంకటేష్ స్వార్థం కోసమే పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజల కోసం కాదన్నారు. తన పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడమే తప్పిస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించాలనే ఆలోచన ఏ కోశాన కూడా లేదన్నారు. తమ నేత జగన్ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నెకల్ సురేందర్‌రెడ్డి, ఎసీ సెల్ జిల్లా కన్వీనర్ కిషన్, మైనార్టీ సెల్ నాయకుడు హమీద్, బీసీ సెల్ నాయకుడు కంటు, ఇతర నాయకులు ఉస్తాద్ మహబూబ్ అలీ, ఉస్తాద్ రిజ్వాన్, అస్లామ్, రాజ్‌ధార్ ఖాన్ సూరి, బాబుభాయ్, మహబూబ్ ఖాన్, హకీం, మసూద్, షఫి, శ్రీనివాసులు, అబ్దుల్లా, వీరన్న, మధు, కృష్ణమూర్తి, నజీబ్, మగ్బూల్, మైమున్నీసా, శివ, పావురాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
బోయలు.. టీడీపీ కరివేపాకులు
వాల్మీకులను మోసగించడం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా మారింది. వెన్నుపోటు రాజకీయాలతో ప్రతి ఎన్నికల్లో వీరిని కరివేపాకులా వాడుకుని వదిలేయడం జరుగుతోంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మెజార్టీ ఓట్లు కలిగిన ఈ కులస్తులను పల్లకీలు మోసేందుకే పరిమితం చేస్తోంది. సీటు ఇచ్చినట్లే ఇచ్చి కుర్చీ లాగేసుకోవడంతో బోయలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్టీ అధినేత సమక్షంలోనే బోయ పార్థసారధిపై దాడి జరగడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. -
శూన్య హస్తం
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీకి వెనుకడుగు ద్వితీయ శ్రేణి నాయకులను దింపేందుకు కసరత్తు ఈ మేరకు నివేదిక సిద్ధం చేసిన పరిశీలకుడు రెండు రోజుల్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశీలన సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే సాధారణ ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ఉత్సాహం చూపడం లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ముఖ్య నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తమ అనుచరణ గణంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు, అలాగే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు చేసేందుకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడికి అన్ని వివరాలు తెలిసిపోయాయి. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అతనికి శూన్య ‘హస్త’మే కనిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీపై జనం చీదరించుకుంటున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆలూరు, కోడుమూరు ఎమ్మెల్యేలను స్థానికులే ఒప్పుకోవటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై ఆ పార్టీ పెద్దలు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా ఏఐసీసీ దూత ఒకరు కర్నూలులో సుధీర్ఘంగా కసరత్తు చేశారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వివరాలను సేకరించారు. ఆ వివరాలతో నివేదిక సిద్దం చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. రేపో, మాపో ఆ నివేదికను అధిష్టాన వర్గాలకు సమర్పించనున్నారు. జిల్లా కేంద్రమైన కర్నూలు అసెంబ్లీ స్థానంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖా మంత్రి టీజీ వెంకటేష్ అసెంబ్లీ సెషన్స్ తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తేల్చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయటానికి సుముఖత వ్యక్తం చేయటం లేదని తేలిపోయింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వద్దే వద్దు... కోడుమూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మురళీకృష్ణపై స్థానికులు ఫిర్యాదు చేశారు. అతన్ని పోటీ నుంచి తప్పించమని కోరినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయంపై దృష్టి సారించారు. డోన్ విషయానికి వస్తే పోటీ చేయటానికి ఎవరూ సాహసించటం లేదు. వచ్చే ఎన్నికల్లో కోట్ల కుటుంబం డోన్‌ను విడిచిపెట్టాలనే ఆలోచన చేస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంపై సందిగ్ధత నెలకొంది. పత్తికొండ విషయానికి వస్తే చెరుకులపాడు నారాయణరెడ్డి పేరు వినిపిస్తోంది. ఎమ్మిగనూరుకూ సరైన అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రుద్రగౌడు తనకు ఈ సారి అవకాశం కల్పించమని కోరారు. మంత్రాలయం టిక్కెట్ కోసం తిక్కారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎమ్మిగనూరు, మంత్రాలయంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డిని ఎదుర్కొనాలంటే గట్టి అభ్యర్థి కావాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదోనిలో చంద్రశేఖరరెడ్డి, దేవిశెట్టి ప్రకాష్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. ఆలూరు విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే నీరజారెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు ఆమెకే టికె ్కట్ ఇవ్వమని కోరుతున్నారు. మరి కొందరు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేరును ప్రతిపాదించారు. పోటీచేయాలంటే ఖర్చు పార్టీనే భరించాల్సిందే... ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ దిగాలంటే సాహసంతో కూడుకున్న పని అని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ పరిశీలకుల వద్ద విన్నవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిట్టింగ్‌లు బరిలో దిగటానికి వెనుకాడుతున్న తరుణంలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు ఈ సారి తాము పోటీలో ఉంటామని చెప్పారు. అయితే ఎన్నికల వ్యయం అంతా పార్టీనే భరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితేనే పోటీ చేస్తామని ఏఐసీసీ పరిశీలకుల వద్ద తేల్చిచెప్పటంతో ఖంగుతిన్నారు. ఏఐసీసీ పరిశీలకుని రాకతో కాంగ్రెస్ బలహీనత బయటపడింది. దీంతో అభ్యర్థుల కోసం పార్టీ ముఖ్యులు అన్వేషణ ప్రారంభించటం గమనార్హం. ఇదిలా ఉంటూ నంద్యాల పార్లమెంట్ పరిధిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అభ్యర్థుల కోసం రెండు మూడు రోజుల్లో ఏఐసీసీ పరిశీలకులు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.