ధర్నా చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి సంఘం నాయకులు, మద్దతు తెలుపుతున్న హఫీజ్‌ఖాన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హామీలు అమలు చేయమని అడిగిన ముస్లిం యువకులను అరెస్టు చేయడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ అన్నారు. నంద్యాల ముస్లిం యువకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. గురువారం కర్నూలు పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొనేటి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు షేక్ ఫైజాన్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. నారా హమారా కాదని, అది కేవల ముస్లిం ఓట్ల కోసం టీడీపీ నేతలు చేస్తున్న డ్రామా అన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు కెబినేట్‌లో ఒక్క ముస్లిం మంత్రి లేకపోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కు అని రిటైర్ తహసీల్దార్ రోషన్ అలీ అన్నారు. వెంటనే అరెస్టు చేసిన ముస్లిం యువకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజాతంత్ర వాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.ఖాజా మోహిద్దీన్, సేవాస్తంభ్ జిల్లా అధ్యక్షుడు అజయ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఏ రెహమాన్, రియల్ టైం నాగరాజుయాదవ్, సాంబశివారెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు విజయలక్ష్మీ, విద్యార్థి నాయకులు భానుప్రకాష్, సాయికృష్ణారెడ్డి, సాయి కుమార్, సురేంద్రనాథ్‌రెడ్డి, టి.రవీంద్ర, కె.విజయ్, షేక్ సయ్యద్, కృష్ణకాంత్‌రెడ్డి, జాఫర్, వెంకటేశ్వరరెడ్డి, శాంతభాయ్ పాల్గొన్నారు.
ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అన్యాయంగా అరెస్టు చేసిన 8 మంది నంద్యాల ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురవారం జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో నంద్యాలకు చెందిన కొందరు ముస్లింలు.. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. హామీలు అమలు చేయాల్సింది పోయి.. 8 మంది యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన ముస్లిం యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అబ్దుల్ రెహమాన్, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment