ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం | end of the 'municipal' campaign | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘మున్సిపల్’ ప్రచారం

Published Sat, Mar 29 2014 1:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

end of the 'municipal' campaign

 కోదాడటౌన్, న్యూస్‌లైన్,మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. చివరిరోజున వివిధ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి పార సత్యావతి తరుఫున సినీనటుడు వేణుమాధవ్ పట్టణంలో ప్రచారం చేశారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు 27, 28 వార్డులలో పాదయాత్ర నిర్వహించి ఆ వార్డు అభ్యర్థి ఓరుగంటి ప్రభాకర్‌ను గెలిపించాలని కోరారు.

 

కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి వంటిపులి నాగలక్ష్మితో పాటు ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి వివిధ వార్డులలో శుక్రవారం విసృ్తతంగా పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు మహబూబ్ జానీ, సత్యబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావులు వివిధ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.శశిథర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న వార్డులలో ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఎర్నేనిబాబు ఆ పార్టీ పార్టీ అభ్యర్థులను గెలిపిచాలంటూ ఆయా వార్డులలో ప్రచారం నిర్వహించారు. 12వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిత్రపక్షాల నాయకులు ర్యాలీలో పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement