పురం.. హస్తపరం? | congress lead in municipal elections? | Sakshi
Sakshi News home page

పురం.. హస్తపరం?

Published Mon, Mar 31 2014 2:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పురం.. హస్తపరం? - Sakshi

పురం.. హస్తపరం?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాస్త సానుకూల వాతావరణం కనిపించినట్లు క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న సమాచారం, ఆయూ పార్టీల స్వీయు విశ్లేషణలు, అంచనాలను బట్టి తెలుస్తోంది. టీఆర్‌ఎస్ రెండో స్థానంలో నిలిచినట్లు, చాలా స్థానాల్లో ఈ రెండు పార్టీల నడువు వుంచి పోటీ ఉందని ఆ రాజకీయ పార్టీల బూత్ స్థాయి కార్యకర్తలు జిల్లా పార్టీలకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంఐఎం కూడా  కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలతోపాటు ఖవ్ముంలోనూ కాంగ్రెస్ పట్ల కొంచెం మొగ్గు ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నా... వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బాగా పోటీపడినట్లు కనిపిస్తోంది. ఒకటీరెండు చోట్ల బీజేపీ హవా కొంత కనిపించింది.
 
 రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. స్థూలంగా టీడీపీకి పెద్దగా ఆశాజనకంగా ఉన్నట్లు లేదు. మునిసిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల పట్టణాల్లో సానుకూల వాతావరణం కనిపించిందని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా రెబల్స్ బెడద లేకుండా చూడడంలో సఫలీకృతులయ్యారు. కాగా, పలు వార్డుల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఒకరికి మించి పోటీ పడగా.. టికెట్ లభించని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. దానికి తగ్గట్టుగా వార్డులు, డివిజన్‌లలో సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణ లోపాలు కొంత ఇబ్బందికరంగా పరిణమించినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement